Maggi recipe: మ్యాగీతో కట్‌లెట్ ఇలా చేసేయండి, పిల్లలకు ఎంతో నచ్చుతుంది-make cutlet with maggi kids will love it know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Maggi Recipe: మ్యాగీతో కట్‌లెట్ ఇలా చేసేయండి, పిల్లలకు ఎంతో నచ్చుతుంది

Maggi recipe: మ్యాగీతో కట్‌లెట్ ఇలా చేసేయండి, పిల్లలకు ఎంతో నచ్చుతుంది

Haritha Chappa HT Telugu
Jan 22, 2025 03:30 PM IST

Maggi recipe: మ్యాగీని పిల్లలు ఇష్టంగా తింటారు. మ్యాగీతో ఎన్నో రకాల వంటకాలు చేయవచ్చు. ఇక్కడ మేము మ్యాగీతో కట్ లెట్ ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. దీన్ని ఒకసారి వండి చూడండి. రెసిపీ ఇదిగో.

మ్యాగీ కట్ లెట్ రెసిపీ
మ్యాగీ కట్ లెట్ రెసిపీ (Youtube)

మ్యాగీ చేసి పెడితే చాలు పిల్లలు ఇష్టంగా తింటారు. మ్యాగీతో అనేక రకాల వంటకాలు వండుకోవచ్చు. మ్యాగీ చాలా మందికి ఇష్టమైన ఆహారంగా మారింది. ఇంట్లోనే మ్యాగీతో రుచికరమైన కట్‌లెట్‌లను తయారు చేసుకోవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. కట్ లెట్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

yearly horoscope entry point

మ్యాగీ కట్‌లెట్ రెసిపీకి కావాల్సిన పదార్ధాలు

మ్యాగీ - ఒక ప్యాకెట్

ఉల్లిపాయ - ఒకటి

కారం - ఒక స్పూను

కార్న్ ఫ్లోర్ - ఒక కప్పు

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

నీళ్లు - తగినంత

పసుపు - పావు స్పూను

పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బల తరుగు - ఒక స్పూను

ఉల్లిపాయలు తరుగు - రెండు స్పూన్లు

క్యారెట్ తరుగు - రెండు స్పూన్లు

మిరియాల పొడి - పావు స్పూను

మ్యాగీ మసాలా పొడి - ఒక స్పూను

బంగాళాదుంపలు - రెండు

మ్యాగీ కట్‌‌లెట్ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి మ్యాగీని చిన్న ముక్కలుగాగా చేతితోనే నలిపి వేయించాలి.

2. అందులోనే ఒక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తరుగు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.

3. అందులో కారం, మిరియాల పొడి, మ్యాగీ మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి.

4. ముందుగానే బంగాళాదుంపను నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. పైన పొట్టుతీసి చేత్తోనే నలిపి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు కళాయిలోని మిశ్రమంలో బంగాళాదుంప పేస్టును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

6. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.

7. ఇప్పుడు ఒక ప్లేటులో మ్యాగీని చేత్తోనే నలపాలి. చాలా చిన్నచిన్నగా నలపాలి.

8. ఇప్పుడు ఒక కప్పులో కార్న్ ఫ్లోర్ వేసి నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి.

9. ఇప్పుడు కళాయిలోని మిశ్రమాన్ని చేత్తోనే కట్ లెట్ లాగా చేత్తోనే ఒత్తుకోవాలి.

10. వాటిని కార్న్ ఫ్లోర్ నీళ్లలో ముంచి తీయాలి. ఇప్పుడు దాన్ని మ్యాగీ ముక్కలపై దొర్లించాలి. అవన్నీ దీనికి అతుక్కుంటాయి.

11. ఇప్పుడ స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.

12. నూనె వెడేక్కాక ఈ కట్ లెట్ వేసి అన్ని వైపులా వేయించుకుని తీసి టిష్యూ పేపర్ పై వేసుకోవాలి.

13. అంతే టేస్టీ మ్యాగీ కట్ లెట్ తయారైనట్టే. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది.

మ్యాగీతో చేసే కట్ లెట్ ఒక్కసారి చేసి చూడండి. ఇది కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ఈ స్నాక్ చేసి చూడండి.

Whats_app_banner