Masala Palli: పండగకు సులువుగా రెడీ అయ్యే మసాలా పల్లీలు, క్రంచీ స్నాక్ రెసిపీ
Masala Palli: సింపుల్‌గా ఏదైనా స్నాక్ చేయాలనుకుంటే పీనట్ మసాలా బెస్ట్ రెసిపీ. దీపావళికి పిండివంటలు చేసే సమయం లేకపోతే ఇలా సింపుల్ చట్ పటా స్నాక్ చేసేయండి. రెసిపీ చూసేయండి.
మసాలా పల్లీలు
చట్ పటా క్రంచీ స్నాక్ ఈ మసాలా పల్లీలు. దీపావళికి పిండి వంటలు చేసే సమయం లేకపోతే ఈ సింపుల్ స్నాక్ ట్రై చేయండి. తింటున్నప్పుడు క్రంచీగా, రుచిగా ఉంటాయివి. ఒకసారి చేస్తే వారం అయినా నిల్వ ఉంటాయి. రెసిపీ ఎలాగో చూసేయండి.
మసాలా పల్లీల తయారీకి కావాల్సినవి:
పావు కేజీ పల్లీలు
సగం కప్పు శనగపిండి
4 చెంచాల బియ్యం పిండి
అర చెంచా పసుపు
అర చెంచా కారం
అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
చిటికెడు వంటసోడా
అరచెంచా ఉప్పు
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
అర టీస్పూన్ ఛాట్ మసాలా (ఆప్షనల్)
మసాలా పల్లీల తయారీ విధానం:
- ముందుగు ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులో శనగపిండి, బియ్యంపిండి వేసుకొని కలపండి.
- మిగతా మసాలాలు కూడా వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, సోడా వేసుకొని కలపేసుకోండి.
- ఇప్పుడు పల్లీలను ఈ మసాలాలో వేసి కలపండి. ఓ రెండు చెంచాల నూనె కూడా వేసుకోండి.
- ఒకసారి పొడిగా అన్నీ కలిపేసుకున్నాక కాస్త నీళ్లు కూడా చల్లుకోండి. ఇప్పుడు పిండి మసాలా పల్లీలకు బాగా అంటుకుంటుంది.
- ఇప్పుడు పిండి మరీ పలుచగా అనిపిస్తే కాస్త బియ్యం పిండి, ముద్దగా అనిపిస్తే కొన్ని నీళ్లు చల్లుకుని అడ్జస్ట్ చేసుకోండి.
- ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె పోసుకోండి. వేడెక్కాక పల్లీలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. కాసేపటికే పల్లీలు క్రిస్పీగా అయిపోతాయి. చ
- వాటిని బయటకు తీసి చల్లార్చుకుని కాస్త ఛాట్ మసాలా చల్లుకొని కలుపుకోండి. ఇప్పుడు పల్లీలను గాలి చొరవని డబ్బాలో పోసి నిల్వ చేసేయండి.
.
టాపిక్