Laddu: పాలు, రవ్వ కలిపి నేతి లడ్డూలు చేసేయండి, ఎంతో రుచిగా ఉంటాయి
Laddu: రవ్వతో చేసే లడ్డూలు ఇవి. చాలా సులువు ఈ క్రీమీ లడ్డూలను చేసేయవచ్చు. పిల్లలకు కూడా ఈ రవ్వ లడ్డూలు నచ్చుతాయి. వీటిని చేయడం కూడా చాలా సులభం. ఇక్కడ మేము చెప్పిన విధంగా లడ్డూలను చేసేయండి.
స్వీట్లను ఎవరు ఇష్టపడరు? ఇంట్లోని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్వీటు కావాలి. ముఖ్యంగా భోజనం తిన్న తర్వాత ఏదైనా తీపి పదార్థం తినాలనిపిస్తుంది. ఇంట్లోనే చాలా సింపుల్ గా పాలు వేసి రవ్వ లడ్డూ తయారుచేసేయండి. దీని రెసిపీ చాలా సులువు. ఇవి తినడానికి చాలా రుచిగా, ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ఈ ఇన్ స్టంట్ సెమోలినా లడ్డూను తయారు చేద్దాం. దీని ఈజీ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రవ్వ లడ్డూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఉప్మా రవ్వ - రెండు కప్పులు
పాలు - ఒకటిన్నర కప్పు
దేశీ నెయ్యి - మూడు నుండి నాలుగు టీస్పూన్లు
డ్రై ఫ్రూట్స్ - అరకప్పు
చిరోంజి గింజలు - గుప్పెడు
చక్కెర - ఒక కప్పు
యాలకుల పొడి - అర స్పూను
రవ్వ లడ్డూ రెసిపీ
- సెమోలినా లడ్డూలు తయారు చేయాలంటే ముందుగా రవ్వను పాలలో నానబెట్టాలి.
- ఇలా 10 నిమిషాల పాటు నానబెట్టి అలాగే వదిలేయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో రవ్వ, పాల మిశ్రమాన్ని వేయాలి.
- తక్కువ మంట మీద మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి.
- లోపల పాలు చిక్కగా మారడం మొదలయ్యాక అందులో రెండు మూడు టీస్పూన్ల దేశీ నెయ్యి కలపాలి.
- ఇప్పుడు ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడకనివ్వాలి.
- ఈ మొత్తం మిశ్రమం గట్టిగా, దగ్గరగా అవుతుంది. అప్పుడు పంచదార వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమంమల్లా హల్వాలాగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.
- స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించుకోవాలి. వాటిని సన్నగా తరిగి రవ్వ మిశ్రమంలో కలపాలి.
- అలాగే రెండు స్పూన్లు నెయ్యిని వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- చేత్తోనే వీటిని లడ్డూల్లా చుట్టుకుని గాలిపోని డబ్బాల్లో వేసి భద్రపరచాలి.
- అంతే టేస్టీ రవ్వ లడ్డూ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. నేతి వాసన ఘుమఘుమలాడిపోతుంది.
ఈ నేతి రవ్వ లడ్డూ రెసిపీ అదిరిపోతుంది. అతిథులకు వడ్డించేందుకు ఇది ఉత్తమ ఎంపిక. ఒకసారి మేం చెప్పిన పద్దతిలో చేసి చూడండి. ఇది ఎవరికైనా నచ్చేస్తుంది.
సంబంధిత కథనం