చికెన్ కూర వండాలంటే కనీసం అరకప్పు నూనె వాడతారు. అలాగే చికెన్ ముక్కలు ఉడికేందుకు నీరు కూడా వేస్తారు. ఇగురు రావాలంటే నీరు అవసరమే. కానీ ఇక్కడ మేము నూనె అవసరం లేకుండా చికెన్ గ్రేవీ ఎలా వండాలో ఇచ్చాము. ఇలా ప్రయత్నించి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. నూనె, నీరు అవసరం లేకుండా చికెన్ కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చికెన్ - అర కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
పసుపు - అర స్పూను
కారం - రెండు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు
టమోటోలు - రెండు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
చికెన్ మసాలా పౌడర్ - ఒక స్పూను
కొబ్బరి ముక్కలు - గుప్పెడు
లవంగాలు - మూడు
యాలకులు - మూడు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
అనాసపువ్వు - రెండు
గసగసాలు - అర స్పూను
పుదీనా తరుగు - గుప్పెడు
పచ్చిమిర్చి - మూడు
1. చుక్క నీరు, నూనె అవసరం లేకుండా చికెన్ కర్రీ ఎలా వండాలో ఇక్కడ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది.
2. మీరు చికెన్ దేనిలో వండాలనుకుంటున్నారో ఆ గిన్నెను తీసుకొని అందులో చికెన్ ముక్కలు వేయండి.
3. ఆ చికెన్ ముక్కల్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయండి.
4. అలాగే టమాటో తరుగును కూడా వేయండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపండి.
5. వీటిపి కలిపి ఒక పావుగంట పక్కన పెట్టండి.
6. ఈ లోపు తాజా కొబ్బరి ముక్కలు లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, గసగసాలు, పచ్చిమిర్చి మిక్సీలో వేసి కాస్త నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి.
7. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్టుని కూడా చికెన్ లోనే వేసి బాగా కలపండి.
8. ఈ కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ వస్తుంది. అలాగే చికెన్ మసాలా కూడా వేసి బాగా కలుపుకోండి.
9. పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసి చేతితోనే బాగా కలిపి స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడికించండి.
10. కుక్కర్లో ఉడికిస్తే చికెన్ నుంచి నీరు ఎక్కువ దిగుతుంది.
11. ఇందులో మనము నీరు, నూనె వేయలేదు.
12. కాబట్టి చిన్న మంట మీదే వండుకోవాలి.
13. పైన చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ మూత పెట్టండి.
14. చిన్న మంట మీదే ఉడికించడం వల్ల చికెన్ నుంచి దిగిన నీరు, కొబ్బరి తురుములో ఉన్న నీరు, అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న నీరు, కొత్తిమీరలోని నీరు, పుదీనాలోని నీరు, టమాటాల్లోను నీరు అన్నీ కలిపి అది గ్రేవీలాగా అవుతుంది.
15. చికెన్ ముక్క ఉడికే వరకు చిన్న మంట మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయినట్టే.
ఈ చికెన్ గ్రేవీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. నూనె లేకుండా చికెన్ కర్రీ వండడం కష్టం అనుకుంటారు. నిజానికి చాలా సింపుల్గా టేస్టీగా ఈ చికెన్ కర్రీని వండొచ్చు. అయితే అన్ని బాగా ఉడికేలా చూసుకోవాలి. లేకుంటే ఉల్లిపాయల నుంచి టమోటాల నుంచి పచ్చివాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దీని కుక్కర్లో వండడం వల్ల ఈ కర్రీ అద్భుతంగా వస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్