Butter Naan on Tawa Recipe: ఇంట్లోనే పెనంపై బటర్ నాన్ పర్‌ఫెక్ట్‌గా చేసుకోవచ్చిలా.. రెస్టారెంట్ టేస్ట్‌తోనే!
Butter Naan on Tawa Recipe: బటర్ నాన్‍ను ఇంట్లోనే పెనంపై కూడా చేసుకోవచ్చు. తందూర్ లేకుండానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కూడా దాదాపు రెస్టారెంట్‍లో ఉండే టేస్ట్‌తోనే వస్తాయి.
Butter Naan on Tawa Recipe: ఇంట్లోనే పెనంపై బటర్ నాన్ పర్‌ఫెక్ట్‌గా చేసుకోవచ్చిలా.. రెస్టారెంట్ టేస్ట్‌తోనే!
రెస్టారెంట్‍కు వెళితే బటర్ నాన్‍ను చాలా మంది తప్పకుండా ఆర్డర్ చేస్తారు. ఏ కర్రీలోకైనా బటర్ నాన్ అంతలా అదిరిపోతుంది. మృధువుగా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్‍లో బొగ్గులపై తందూర్ చేసి నాన్‍లను తయారు చేస్తారు. దీంతో ఇంట్లో చేయడం కష్టమని చాలా మంది అనుకుంటారు. అయితే, ఇంట్లో పెనంపై కూడా బటర్ నాన్‍లు తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్‍లోనే వస్తాయి. పెనంపై బటర్ నాన్ ఎలా చేయాలంటే..
బటర్ నాన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పు కప్పుల మైదా పిండి
- అర కప్పు పెరుగు
- అర టీస్పూన్ వంట సోడా
- ఓ టీ స్పూన్ చక్కెర
- తగినంత ఉప్ప
- నాన్‍కు రాసేందుకు బటర్
- పిండిపై వేసేందుకు కాస్త నూనె
- కాస్త కొత్తిమీర
- కాస్త పొడి మైదా పిండి
పెనంపై బటర్ నాన్ తయారు చేసుకునే విధానం
- ఓ గిన్నెలో మైదా పిండి వేసుకోవాలి. దాంట్లోనే పెరుగు, ఉప్పు, వంటసోడా వేయాలి.
- ముందు నీరు వేయకుండా పెరుగుతోనే పిండిని వేళ్లతో బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత కాస్త నీరు పోసి.. మళ్లీ పిండిని పిసకాలి. దాంట్లో కాస్త నూనె వేయాలి. మళ్లీ వత్తుకోవాలి.
- పిండిని సుమారు ఆరు నిమిషాల పాటు వత్తుకుంటూనే ఉండాలి. పిండిని బాగా కలిపితేనే నాన్‍లు పొంగి, మృధువుగా వస్తాయి. అలాగే పిండి ముద్దలా కాకుండా జిగురుగా ఉండేలా చూసుకోవాలి.
- పిండిని బాగా వత్తుకున్నాక నాన్‍లకు సరిపోయే విధంగా గుండ్రని ఉండల్లా (బాల్స్‌లా) చేసుకోవాలి.
- ఓ ప్లేట్‍లో పొడిపిండిని వేసి దానిపై పిండి బాల్స్ పెట్టాలి. వాటిపై కాస్త నూనె రాయాలి. వాటిపై తడి క్లాత్ కప్పేసి సుమారు 40 నిమిషాలు నాననివ్వాలి.
- పక్కన పెట్టుకున్న తర్వాత 40 నిమిషాల్లో పిండి బాల్స్ బాగా పొంగినట్టు అవుతాయి.
- వాటిని చపాతీ కర్రతో నాన్ ఆకారంలో వత్తుకోవాలి. కింద పొడి పిండి వేసి మృధువుగా నాన్‍లా కర్రతో కాస్త మందంగా వత్తుకోవాలి.
- నాన్ వత్తుకున్నాక ఓవైపు నీటితో తడి చేసుకొని.. వేడి పెనంపై వేయాలి. తక్కువ మంటపైనే నాన్‍ను కాల్చాలి.
- సుమారు రెండు నిమిషాల్లో నాన్ కాస్త పొంగి ఓవైపు కాలుతుంది.
- నాన్ పెనానికి గట్టిగా అతుక్కొనే ఉంటుంది. అప్పుడు పెనాన్ని పొయ్యిపై తిప్పేసి మరోవైపు నేరుగా మంటపైనే కాల్చుకోవాలి. ఆ వైపు నేరుగా మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో కాలాక పెనం నుంచి నాన్ సులువుగా తిప్పేసుకోవచ్చు. కాసేపు రెండువైపులా తిప్పుతూ కాల్చుకోవాలి.
- అంతే బాగా కాలిన నాన్‍ను పెనంపై నుంచి దించి వేడి మీద ఉన్నప్పుడే.. దానికి ఇరువైపులా.. కరిగించి, కాస్త కొత్తమీర వేసుకున్న బటర్ రాయాలి. అంతే బటర్ నాన్ రెడీ అవుతుంది.
పెనంపై బటర్ నాన్ చేసుకునేందుకు పిండిని జిగురుగా వత్తుకోవాలి. అలాగే సుమారు ఆరు నిమిషాలైనా ఒత్తుకోవాలి. అలాగే, బాల్స్‌లా చేసుకున్న పిండిని తప్పనిసరిగా 40 నిమిషాలు పక్కన పెట్టాలి. కాల్చడం కూడా పైన చెప్పిన విధంగానే చేయాలి. ఈ టిప్స్ పాటిస్తే రెస్టారెంట్ స్టైల్‍లో ఇంట్లోనే పెనంపై బటర్ నాన్ పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.
సంబంధిత కథనం