Masala Chaap Recipe: మీ హాలీడేను స్పెషల్‌గా మార్చుకోవాలంటే మసాలా చాప్ తయారు చేసుకుని తినండి.. ఇదిగో రెసిపీ!
Masala Chaap Recipe: రిపబ్లిక్ డే సెలవుదినాన్ని ఆస్వాదించాలనుకుంటే ఇంట్లోనే మసాలా చాప్ తయారు చేసుకుని తినండి. రుచికరమైన ఈ రెసిపీ తయారు చేయడం కూడా సులువే. రోటీ లేదా చపాతీలతో కలిపి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తినాలి అనుకోవడం ఖాయం. మసాలాచాప్‌ను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి..
గణతంత్ర దినోత్సవం రోజున పిల్లలు-పెద్దలు అందరూ ఇంట్లోనే ఉంటారు. అలాంటప్పుడు ఏదో ప్రత్యేకమైనది తినాలని అనుకుంటారూ. సెలవు రోజుల్లో ప్రత్యేక దినాల్లో ఇంట్లో ఖాలీగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి కోరిక కలుగుతుంది. మీరు సెలవుదినాన్ని ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే మసాలా చాప్ తయారు చేసుకోండి. ఈ రుచికరమైన రెసిపీని తయారు చేసే విధానం కావాలసిన పదార్థాలు గురించి ఇక్కడ తెలుసుకోండి.
మసాలా చాప్ తయారీకి కావలసినవి
- 8-10 సోయా చాప్
- ఒక కప్పు పెరుగు
- చాట్ మసాలా
- గరం మసాలా
- జీరా పౌడర్
- నిమ్మరసం రెండు చెంచాలు
- ఒక చెంచా జీలకర్ర
- ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క
- యాలకులు
- జాజికాయ
- లవంగం
- 7-8 వెల్లుల్లి రెబ్బలు
- రెండు పచ్చిమిర్చి
- రెండు అంగుళాల అల్లం ముక్క
- రెండు ఉల్లిపాయలు
- 3-4 టమాటాలు
- 8-10 జీడిపప్పు
- చాప్ మసాలా
- పసుపు
- కారం
- రుచికి సరిపడా ఉప్పు
- కసూరి మెంతి
మసాలా చాప్ తయారీ విధానం:
-ముందుగా చాప్‌ను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.(చాప్ ఇంట్లో తయారు చేసుకున్నా పరవాలేదు. మార్కెట్ నుంచి తెచ్చుకున్నదైనా పర్వాలేదు.
-ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో నూనె పోసి వేడి చేయండి.
-నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఈ చాప్ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-ఒక గిన్నెలో కోసిన చాప్ ముక్కలను తీసుకుని, అందులో పెరుగు, చాట్ మసాలా, నిమ్మరసం, గరం మసాలా, జీరా పౌడర్ వేసి బాగా కలిపి, మెరినేట్ అవ్వడానికి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు వేరొక పాన్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలను వేసి తక్కువ మంట మీద వేయించాలి.
- ఇవి కాస్త వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేయాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత, గ్యాస్ ఆఫ్ చేసి, ఈ పదార్థాలన్నింటినీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.
ఇప్పుడు కడాయి తీసుకుని దాంట్లో వెన్న, నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
-నూనె వేడెక్కిన తర్వాత జీరా , దాల్చిన చెక్క, లవంగం, జాజికాయ, యాలకులు వేయాలి.
-అవి వేగిన తర్వాత, తయారు చేసిన పేస్ట్ వేసి తక్కువ మంట మీద వేయించాలి.
- ఈ మసాలాలు అన్నీ చక్కగా వేగి దాంట్లో నుంచి నూనె పైకి తేలిన తర్వాత ముందుగా మెరినేట్ చేసి పెట్టుకున్న చాప్ ముక్కలను దీంట్లో వేసి కలపాలి.
-ఇప్పడు ఈ మిశ్రమంలో అవసరమైనంత నీళ్లు పోసుకుని ఉడికించాలి. ఉడుకుతుండానే ఉప్పు వేసి కలుపుకోవాలి.
-చివరగా కసూరి మెంతి వేసి, గ్యాస్ ఆఫ్ చేయాలి.
-రుచికరమైన మసాలా చాప్ సిద్ధం అయినట్టే, దీన్ని అన్నంలోకి, పరోటాల్లోకి, రోటీల్లోకి వడ్డించుకుని తినచ్చు. దీని రుచి తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.