Soap Hacks: మిగిలిపోయిన సబ్బు ముక్కలతో జుట్టు రాలకుండా ఆపే షాంపూ ఇలా తయారు చేయండి
Soap Hacks: జుట్టు రాలిపోవడం, జుట్టు పలుచబడడం వంటి సమస్యలతో బాధపడుతుంటే ఇంట్లో ఉన్న సబ్బు ముక్కలతో యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ తయారు చేసుకోవచ్చు. సబ్బు ముక్కలతో చేసే ఈ షాంపూని తయారు చేయడం చాలా సులువు.
జుట్టు రాలడం, వెంట్రుకలు చిట్లిపోవడం వంటి సమస్యలతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు అనేక షాంపూలు వాడడం ద్వారా జుట్టును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన మీ జుట్టు రాలడం ఆగకపోతే ఇంట్లోనే షాంపూను తయారు చేయండి. దీని కోసం ఇంట్లో మిగిలిపోయిన సబ్బు ముక్కలను వాడితే సరిపోతుంది.
ప్రతి ఇంట్లో సబ్బు అరిగిపోయాక చివరన చిన్నగా మారిపోతుంది. ఆ ముక్కలన్నీ బయట పడేస్తూ ఉంటారు. అలాంటి సబ్బు ముక్కలను విసిరేసే బదులు ఒకచోట భద్రపరచండి. వాటితోనే షాంపూను తయారు చేయవచ్చు. ఇవి మీ జుట్టు పెరగడానికి మరియు రాలడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. హెయిర్ బ్రేకేజ్ తో ఇబ్బంది పడే చాలా మంది ప్రతిరోజూ షాంపూలు మారుస్తూ ఉంటారు. కానీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూను కొన్ని నిమిషాల్లోనే ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇది జుట్టుపై పేరుకుపోయిన మురికి, నూనె పొరను కూడా క్లియర్ చేస్తుంది. కాబట్టి మిగిలిపోయిన సబ్బుతో ఇంట్లోనే షాంపూ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
సబ్బుతో షాంపూ తయారీ
హెయిర్ బ్రేకేజ్, జుట్టు రాలిపోవడం నివారించడానికి, ఇంట్లో మిగిలిపోయిన సబ్బులతో కింద ఇచ్చిన పదార్థాలను కలిపి షాంపూ తయారు చేయవచ్చు. షాంపూ తయారీకి శీకాయ, రోజ్ మేరీ ఆకులు, కుంకుడు కాయలు, సబ్బు ముక్కలు, నీరు అవసరం పడతాయి.
- ఒక గిన్నెలో నీటిని వేసి స్టవ్ మీద పెట్టాలి.
- అందులో అయిదు కుంకుడు కాయలు, అయిదు శీకాయలు, గుప్పెడు రోజ్ మేరీ ఆకులు వేసి మరిగించాలి.
- అవి మరుగుతున్నప్పుడు ఇంట్లో మిగిలిపోయిన సబ్బు ముక్కలను వేసి మరగనివ్వాలి.
- ఇలా షాంపూ చేస్తున్నప్పుడు చేతికి గ్లవుజులు వేసుకోవడం ఉత్తమం. దీనివల్ల మీ చేతిలోని బ్యాక్టిరియా షాంపూకు చేరదు.
- ఈ మొత్తం మిశ్రమం చిక్కగా అయ్యేదాకా మరిగించాలి. తరువాత దాన్ని చల్లార్చి వడకట్టి ఒక బాటిల్ లో వేసుకోవాలి.
సరైన పిహెచ్ స్థాయితో షాంపూ రెడీ అయిపోయింది. దీనిలోని మీ మాడుపై ఉన్న చర్మాన్ని శుభ్రపరిస్తే, మిగతా పదార్థాలు మీ జుట్టును శుభ్రపరచడంలో సహాయపడుతాయి. ఈ షాంపూను వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేసి బాగా కడగాలి. దీని వల్ల జుట్టుపై ఉన్న మురికి మొత్తం తొలగిపోతుంది. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్