Maggi Masala: మ్యాగీ మసాలాను ఇంట్లోనే తయారు చేసుకుంటే, టేస్టీ నూడుల్స్ వండుకోవచ్చు
Maggi Masala: మ్యాగీ మసాలా తయారీకి ఇంట్లో వాడే మసాలా దినుసులను మాత్రమే ఉపయోగిస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసి నిల్వ చేయాలనుకుంటే, సులభంగా ఇంట్లో తయారుచేసిన మ్యాగీ మసాలా రెసిపీని అనుసరించండి.

రుచిలేని కూరగాయలను కూడా టేస్టీగా మార్చేస్తాయి నూడుల్స్ వంటకం. పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాగీ మసాలాను ప్రతి భారతీయ వంటగదిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నూడుల్స్ తినాలనుకుంటే ప్రతి సారి బయట కొంటే ఆరోగ్యానికి చేటు జరుగుతుంది. కాబట్టి ఇంట్లోనే మ్యాగీమసాలా పొడి చేసుకుని… నూడుల్స్ చేసుకుంటే మంచిది. పిల్లలకు హోమ్ మేడ్ నూడుల్స్ తినిపిస్తే ఆరోగ్యకరం కూడా. పిల్లలకు మ్యాగీ అంటే ఇష్టం. మ్యాగీ మసాలాను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకోండి. మ్యాగీ మసాలా తయారీకి ఇంట్లో వాడే మసాలా దినుసులను మాత్రమే ఉపయోగిస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసి నిల్వ చేసుకుంటే నాలుగైదు నెలల పాటూ దీన్ని వాడుకోవచ్చు.
మ్యాగీ మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయ పొడి - మూడు స్పూన్లు
వెల్లుల్లి పొడి - రెండున్నర టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూను
పంచదార పొడి - రెండు టేబుల్ స్పూన్లు
మామిడి తురుము - 3 టేబుల్ స్పూన్లు
కారం - ఒక స్పూను
పసుపు - రెండు స్పూన్లు
జీలకర్ర - మూడు స్పూన్లు
మిరియాల పొడి - ఒక స్పూన్
మెంతులు - మూడు గింజలు
ఎండుమిర్చి - 2
ధనియాలు - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
ఎండు అల్లం పొడి - ఒక స్పూను
మ్యాగీ మసాలా పొడి రెసిపీ
1. జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ధనియాల, ఎండు మిర్చి, మిరియాలు కనీసం 2 గంటల పాటు ఎండలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మసాలా దినుసుల్లో ఉండే తేమ తొలగిపోతుంది.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేడి చేయాలి.
3. స్టవ్ వేడెక్కాక ఎండలో ఆరబెట్టిన మసాలా దినుసులన్నీ వేసి తక్కువ మంట మీద నాలుగు నిమిషాలు వేయించి పక్కన పెట్టండి.
4. దీని తరువాత, ఈ మసాలా దినుసులను ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లబరచండి.
5. ఈ మొత్తం మసాలా దినుసులు చల్లారిన తర్వాత వాటిని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి.
6. ఇప్పుడు ఈ మసాలాలో ఉల్లిపాయ పొడి, వెల్లుల్లి పొడి, కార్న్ ఫ్లోర్, ఆమ్చూర్ పొడి, పంచదార, ఎండు అల్లం పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి మసాలా దినుసులన్నింటినీ మరోసారి మెత్తగా గ్రైండ్ చేయాలి.
7. ఇప్పుడు ఈ మసాలా దినుసులను జల్లెడ సహాయంతో వడగట్టి ఆ మసాలా పొడిని ఒక సీసాలో వేసి గట్టిగా మూత పెట్టుకోవాలి.
ఇలా మ్యాగీ మసాలా రెడీ చేసుకుంటే ఎప్పటికప్పుడు మ్యాగీ నూడుల్స్ తయారుచేసుకోవచ్చు. ఈ పొడి తయారుచేసుకుని పెట్టుకుని నూడుల్స్ కొనుక్కుంటే సరి. ఈ రెండింటితో ఇంట్లోనే టేస్టీగా మ్యాగీ నూడుల్స్ వండేయచ్చు.
టాపిక్