Madras Chicken Curry: మద్రాసీ చికెన్ కర్రీ రెసిపీ, మసాలా దట్టించి చేస్తే ఈ కూర ఎంత తిన్నా తనివితీరదు-madras chicken curry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Madras Chicken Curry: మద్రాసీ చికెన్ కర్రీ రెసిపీ, మసాలా దట్టించి చేస్తే ఈ కూర ఎంత తిన్నా తనివితీరదు

Madras Chicken Curry: మద్రాసీ చికెన్ కర్రీ రెసిపీ, మసాలా దట్టించి చేస్తే ఈ కూర ఎంత తిన్నా తనివితీరదు

Haritha Chappa HT Telugu
Nov 20, 2024 11:30 AM IST

Madras Chicken Curry: చికెన్ కూర వండడం సులువే, మీకు ఆ కూర మరీ బోర్ కొడుతుంటే స్పైసీగా మద్రాస్ చికెన్ కర్రీని వండి చూడండి. ఇది రుచికరమైన రెసిపీ. ఈ రెసిపీ వండడం సులువు.

మద్రాసీ చికెన్ కర్రీ రెసిపీ
మద్రాసీ చికెన్ కర్రీ రెసిపీ

మీరు మాంసాహారులైతే, ముఖ్యంగా చికెన్ తినడానికి ఇష్టపడే వారు అయితే ఈ రెసిపీని ఇష్టపడతారు. చికెన్ ప్రియులు చికెన్ వంటకాలను కొత్త పద్ధతిలో వండి తినడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో, ఒకే రకమైన చికెన్ తినడానికి విసుగు చెందితే, ఈ రుచికరమైన స్పైసీ మద్రాస్ చికెన్ కర్రీని ప్రయత్నించండి. ఈ స్పైసీ రెసిపీ రోటీ లేదా అన్నం రెండింటితో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇంటి వంటలు లేవు. ఈ రెసిపీని పార్టీ యొక్క ప్రధాన కోర్సు వంటకానికి కూడా జోడించవచ్చు. ఈ రెసిపీ తయారు చేయడం చాలా సులభం మరియు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మద్రాస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం.

మద్రాస్ చికెన్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ - అరకిలో

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

టమోటాలు - రెండు

లవంగాలు - మూడు

పసుపు - అర స్పూన్

నల్ల మిరియాలు - అర స్పూను

దాల్చిన చెక్క - చిన్న ముక్క

యాలకులు - నాలుగు

అనాస పువ్వు - ఒకటి

బిర్యానీ ఆకులు - రెండు

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

సోంపు అరస్పూను

జీలకర్ర - అర స్పూను

కారం - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

మద్రాస్ చికెన్ రెసిపీ

  1. చికెన్ కూర టేస్టీగా ఉంటే ఎంత రుచిగా ఉంటుంది. మద్రాస్ చికెన్ కూర ఎలా వండాలో తెలుసుకోండి.
  2. ముందుగా చికెన్ బాగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
  3. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. జీలకర్ర, సోంపు, మిరియాలు వేసి 2-3 నిమిషాలు వేయించాలి.
  5. తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
  6. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
  7. అన్నీ వేగాక లవంగాలు, దాల్చినచెక్క, అనాస పువ్వు, యాలకులు వేసి చిన్నమంటపై వేయించాలి.
  8. అన్నీ వేగాక టమోటా తరుగును వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అంతా చల్లారనివ్వాలి.
  9. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో బిర్యానీ ఆకులు, కరివేపాకులు వేసి వేయించాలి.
  11. అందులో ముందుగా మారినేట్ చేసిన చికెన్ వేసి కలుపుకోవాలి. పైన మూతపెట్టి ఉడికించుకోవాలి.

12. ముందుగా రుబ్బుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసి ఉడికించాలి. కారాన్ని కూడా వేసి కలుపుకోవాలి

13. ఒక అరగ్లాసు నీళ్లు కూడా పైన మూత పెట్టి ఉడికించాలి.

14. నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చిన్న మంట మీద ఉడికిస్తే చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి. చివర్లో కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. అంతే టేస్టీ మద్రాస్ చికెన్ కర్రీ రెడీ అయినట్టే

మద్రాస్ చికెన్ కర్రీ ఒకసారి వండి చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా చికెన్ కూర వండి చూడండి. ఇది రోటీ, చపాతీలోకి, అన్నంలోకి అదిరిపోతుంది.

Whats_app_banner