Chanakya Niti Telugu : అదృష్టం ఈ వ్యక్తులను ఎప్పటికీ వదిలిపెట్టదు
Chanakya Niti : పని చేయకుండా అదృష్టం రాదని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడి ప్రకారం అదృష్టం రావాలంటే కష్టపడేతత్వం ఉండాలి.

ఆచార్య చాణక్యుడు రాజకీయవేత్త, దౌత్యవేత్త, వ్యూహకర్తగానే కాకుండా ఆర్థిక శాస్త్రంపై కూడా విస్తృత పరిజ్ఞానం ఉంది. దీనితో పాటు ఆయన తన అనుభవంతో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను కూడా చర్చించాడు. అటువంటి పరిస్థితిలో చాణక్య నీతిని కచ్చితంగా ఫాలో కావాలి. దానిని జీవితంలో స్వీకరించినట్లయితే, ఒక వ్యక్తి ఎప్పుడూ ఓటమిని ఎదుర్కోనవసరం లేదు.
ఆచార్య చాణక్యుని ఆర్థికశాస్త్రం, నీతిశాస్త్రంలో గురువుగా చాలా మంది చూస్తారు. ఆయన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఇది ఒక వ్యక్తి యొక్క అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయకరంగా ఉంటుంది. చాణక్య నీతిలో పేర్కొన్న విషయాలను చదవడం ద్వారా, జీవితం పట్ల వ్యక్తి యొక్క దృక్పథంలో సానుకూల మార్పులు ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు తన విధానంలో జీవితంలో అడుగడుగునా అదృష్టాన్ని చూసే కొంతమంది వ్యక్తులను వివరించాడు.
చాణక్యుడి సూత్రాలు పాటించేవారు నేటికీ సమాజంలో ఉన్నారు. వారు జీవితంలో వియజం సాధించడానికి సులువుగా ఉంటుంది. చాణక్యుడి చెప్పిన సత్యాలను పాటిస్తే కచ్చితంగా గెలుపు మీకు సొంతం అవుతుంది. చాణక్యుడు ఎలాంటి వ్యక్తులకు అదృష్టం ఉంటుందో తెలిపాడు వారి గురించి తెలుసుకుందాం..
లక్ష్యం పెట్టుకోవాలి
ఆచార్య చాణక్యుడు విజయాన్ని సాధించడానికి, ఒక వ్యక్తి మొదట లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని నమ్ముతాడు. ఎందుకంటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వ్యక్తి మాత్రమే తన గమ్యాన్ని చేరుకోగలడు. లక్ష్యం లేని జీవితం వ్యర్థం. ముందుగా ఏం చేయాలో మనకు ఓ క్లారిటీ ఉండాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం, లేదంటే అక్కడే ఆగిపోతాం. అందుకే ప్రతి ఒక్కరూ జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లేదంటే మీరు ఎంత ప్రయత్నించినా విజయం అనేది మీ దరి చేరదు.
లక్ష్యాన్ని ఇతరులకు చెప్పొద్దు
కొందరికి తమ లక్ష్యాలను ఇతరులకు చెప్పే అలవాటు ఉంటుంది. ఆచార్య చాణక్యుడు ఈ అలవాటును తప్పుగా పేర్కొన్నాడు. ఎందుకంటే అందరి ముందు తన లక్ష్యం గురించి చెప్పే వ్యక్తి విజయం సాధించడం కష్టం. అదే సమయంలో, ఎల్లప్పుడూ మౌనంగా ఉండి. తన పనిలో నిమగ్నమై ఉండే వ్యక్తి కచ్చితంగా విజయం సాధిస్తాడు. ఇతరులకు మీ లక్ష్యాలను చెబితే వారు చెడగొట్టే అవకాశం ఉంది. అంతేకాదు మీ గెలుపును వారు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మౌనంగా ఉండటం అనేది మనం నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఇస్తుంది.
అదృష్టం మీదనే ఆధారపడొద్దు
ఒక వ్యక్తి తన అదృష్టం మీద మాత్రమే ఆధారపడకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడి, అంకితభావం ద్వారా మాత్రమే తన అదృష్టాన్ని సంపాదించుకుంటాడు. అందుకే ఆచార్య చాణక్యుడు ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా లొంగకూడదని చెప్పారు. కష్టం విలువ తెలిసిన వ్యక్తికే అదృష్టం వస్తుంది. మీరు కష్టపడుకుండా జీవితంలో ఏదీ రాదని చాణక్య నీతి చెబుతుంది. అందుకే కచ్చితంగా కష్టపడే గుణం మీకు ఉండాలి.
తప్పుల నుంచి నేర్చుకోవాలి
ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే జీవితంలో విజయం సాధించవచ్చని ఆచార్య చాణక్య చెప్పాడు. చాణక్యుడు ప్రకారం ఇతరుల తప్పుల నుండి నేర్చుకోని వ్యక్తి తన జీవితంలో విజయం సాధించడానికి కష్టపడుతూనే ఉంటాడు. ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడం మంచిది. జీవితంలో మీ కంటే పెద్దవారితో స్నేహం చేయాలి. అప్పుడు వారి అనుభవాలు మీకు పాఠాలు అవుతాయని చాణక్య నీతి వివరిస్తుంది. అనుభవాల నుంచి నేర్చుకునే పాఠాలు కచ్చితంగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.