బెస్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి బహుమతులు ఇస్తే మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు-looking for the best wedding gift gifts like these will make you remembered for life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బెస్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి బహుమతులు ఇస్తే మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు

బెస్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి బహుమతులు ఇస్తే మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు

Haritha Chappa HT Telugu

వివాహ సీజన్ వచ్చేసింది. వారానికో పెళ్ళికి వెళ్లాల్సిన అవసరం కూడా రావచ్చు. అయితే వివాహాలకు ఎలాంటి గిఫ్టులు ఇస్తే బాగుంటాయో తెలుసుకోండి.

ట్రెండీ వెడ్డింగ్ గిఫ్ట్స్ (Pixabay)

ఏప్రిల్, మే నెలలో ఎన్నో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మీకు తెలిసిన వారు ఎంతోమంది పెళ్లికి సిద్దమవుతారు. వారి పెళ్లికి మీరు ఉత్త చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? వారు జీవితాంతం గుర్తుండిపోయేలా మంచి బహుమతిని తీసుకువెళ్లాల్సిందే. మేము వివాహ బహుమతుల కోసం ఎలాంటి వస్తువులు ఇస్తే ఉత్తమంగా ఉంటుందో ఇక్కడ వివరించాము. మీ బడ్జెట్లోనే కొత్త జంట ఉపయోగించుకునేలా మీరు మంచి బహుమతిని అందించాలనుకుంటే కింద చెప్పిన ఐడియాలలో ఏదో ఒకటి ఫాలో అవ్వండి.

వంటగది వస్తువులు

పెళ్లయిన జంటలకు కచ్చితంగా ఇంట్లో ఎన్నో వస్తువులు అవసరం. వారు ఏ వస్తువులు వాడే అవకాశం అధికంగా ఉంటుందో ఆలోచించి అలాంటివి కొనండి. ఇంటిలో మిక్సీ ఉండాల్సిందే. మిక్సీ ఇస్తే దాన్ని మూలన పడేయకుండా కచ్చితంగా వాడుతారు. కాబట్టి మిక్సీ కూడా మీకు 1500 రూపాయల నుంచి 3000 రూపాయల లోపే వచ్చేస్తుంది. ఇది కూడా బడ్జెట్లో ఉన్నదే. కాబట్టి ఏదైనా జంటకు మిక్సీ ఇస్తే అది వాడుతున్నంత కాలం మీరు వారికి కచ్చితంగా గుర్తుంటారు.

ట్రెండీ కుక్‌వేర్

పెళ్లయిన జంటలకు వంట సామాగ్రి చాలా ముఖ్యం. ఇప్పుడు వంట సామాగ్రిలో కూడా ట్రెండీగా ఉండే కుక్ వేర్ వచ్చేసాయి. ఇండస్ వ్యాలీ ఇలా ఎన్నో కంపెనీలు అందమైన పాత్రలను మార్కెట్లోకి తెచ్చాయి. వాటిని చూస్తేనే ఏదైనా వండాలి అనిపించేలా ఉంటాయి. ఇలాంటి అందమైన కుక్‌వేర్ ను వారికి ఇవ్వండి. వారి వంట గదిలో ఆ కుక్ వేర్ సెట్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.

హనీమూన్ ప్యాకేజీ

బడ్జెట్ అధికంగా పెట్టాలనుకునేవారు హనీమూన్ ప్యాకేజీలను కూడా జంటలకు బహుమతిగా ఇవ్వచ్చు. వారికి మీరు శాశ్వత జ్ఞాపకాలను ఇచ్చిన వారవుతారు. విలాసవంతమైన హనీమూన్ ప్యాకేజీ ఇస్తే ఫోటోల రూపంలో అవి ఎప్పుడూ వారితోనే ఉంటాయి.

డిన్నర్ వోచర్లు

డైనింగ్ రెస్టారెంట్లు ఆహ్లాదకరమైన డిన్నర్ కోసం వారికి మీరు వోచర్లను కూడా గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఇలాంటి ఓచర్లు ఉంటే వారు కచ్చితంగా డిన్నర్ చేసేందుకు వెళతారు. అయితే మంచి రెస్టారెంట్ ని ఎంపిక చేసుకోవడం మర్చిపోకండి.

పర్సనలైజ్డ్ హోమ్ డెకార్

తమ వెడ్డింగ్ డేటును రాసిన ఫోటో ఫ్రేమ్స్, కస్టమైజ్డ్ వాల్ ఆర్ట్స్, కపుల్ పేర్లు రాసి ఉన్న గిఫ్ట్స్ వంటివి కూడా నేటి వధూవరులు అధికంగా ఇష్టపడతారు. అవి కూడా ఇచ్చేందుకు ప్రయత్నించండి.

ఎకో ఫ్రెండ్లీ హోం ప్రొడక్ట్స్ ఎన్నో మార్కెట్లలో దొరుకుతున్నాయి. రీసైకిల్ మెటీరియల్స్ తో చేసిన గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవి భిన్నంగా ఉండటమే కాదు.. అందరినీ ఆకర్షించేలా కూడా ఉంటాయి. వాటిని ఇచ్చేందుకు కూడా మీరు ప్లాన్ చేయవచ్చు.

మ్యాచింగ్ డ్రెస్సులు

కాస్త ట్రెండీగా ఇవ్వాలనుకుంటే భార్యాభర్తలిద్దరికీ ఒకేలాంటి మ్యాచింగ్ డ్రెస్సులను కూడా ప్లాన్ చేయవచ్చు. దీనికి ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది. ఇలాంటి దుస్తులను కూడా కొత్తగా పెళ్లి అయిన జంటలు చాలా ఇష్టపడతాయి.

గిఫ్ట్ లు మీ బడ్జెట్‌ను బట్టి ఆధారపడి ఉంటాయి. తక్కువ బడ్జెట్లో దొరికేవి మొక్కలు, ఫోటో ఫ్రేములు, డిన్నర్ డేట్ వంటివి. వీటి ఖర్చు రూ.1000 నుంచి రూ.2000 వరకు అవుతుంది. రూ. 2000 నుంచి పెడితే మీరు మరింత ట్రెండీగా గిఫ్ట్ లను వారికి ఇవ్వగలరు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం