Banana Benefits: అరటిపండు తింటే మహిళల్లో జాయింట్ నొప్పులు హాంఫట్! రేటు తక్కువ.. చేసే మేలు ఎక్కువ
Banana Benefits: జాయింట్ పెయిన్ తగ్గించడానికి అరటిపండ్లు బెస్ట్ ఇంటి చిట్కా అని చెప్తున్నారు నిపుణులు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం శరీరానికి ఎంతో మేలు చేస్తాయట. అదెలాగో తెలుసుకుందామా..!
చిన్నారుల నుంచి ముసలోళ్ల వరకూ అరటిపండు అంటే ఇష్టపడని వారుండరు. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాల్లోనూ అరటిపండు తక్కువ ధరలో దొరికే ఎక్కువ ప్రొటీన్లు అందించే పండు. రక్తపోటు సమస్య ఉన్నవారిలో మెన్‌స్ట్రుయల్ క్రాంప్స్ సమస్యలు ఉన్న వారికి అరటిపండు దివ్యౌషదంగా పనిచేస్తుంది. ఈ సూపర్ ఫుడ్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లోనూ, స్నాక్స్ సమయంలోనూ తీసుకోవడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలుంటాయట. అరటిపండు రెగ్యూలర్గా తినడం వల్ల కడుపులో మంట తగ్గడంతో పాటు ఇన్‌ఫ్లమ్మేషన్ గుణాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకొక అద్భుతమైన ప్రయోజనమేమిటంటే, పురుషులకైనా, మహిళలకైనా జాయింట్ నొప్పులుంటే ఇది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జాయింట్ నొప్పిని ఆర్థరాల్జియా అని కూడా అంటుంటారు. కండరాలలో అసౌకర్యం, జాయింట్ నొప్పులు, శరీరంలో అనేక భాగాలలో ఒకేసారి నొప్పులు కలగడాన్ని ఈ పేరుతో పిలుస్తారు. రెండు లేదా మూడు ఎముకలు కలిసి, కదలికలకు తోడ్పడే శరీర భాగాన్ని జాయింట్ అని పిలుస్తారు. ఈ ఎముకలు కలిసే ప్రదేశంలో ఏదైనా డ్యామేజ్, ఇబ్బంది కలిగితే దానిని అది జాయింట్ నొప్పికి దారి తీస్తుంది. గాయాలవడం, ఇన్ఫెక్షన్లు కలగడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఈ సమస్య వ్యక్తులను రోజువారీ పనులు చేయడానికి ఆటంకంగా మారి ఇబ్బందికి గురి చేస్తుంది. ఫలితంగా ఎక్కువగా నడవలేకపోయే సమస్యకు దారి తీస్తుంది. ఆసక్తికరమైన అంశమేమిటంటే, ఈ సమస్యతో బాధపడేవాళ్లు అరటిపండు తినడం వల్ల జాయింట్ పెయిన్ నుంచి చక్కటి ఉపశమనం పొందవచ్చట.
జాయింట్ పెయిన్ నివారణకు అరటిపండు ఎలా ఉపయోగపడుతుంది?
అరటిపండు తినడం అనేది జాయింట్ పెయిన్ రిలీఫ్ కు చాలా అద్భుతమైన ఆహారం. ఇందులో పలు రకాలైన విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉండి అసౌకర్యం కలిగే ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి అరటిపండ్లు ఎలా ఉపయోగపడతాయంటే..
సమృద్ధిగా పొటాషియం
అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉండి ఎముకల ఆరోగ్యానికి దోహదపడతాయి. రోజూ తినడం వల్ల శరీరంలో యాసిడ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. శరీరంలో కాల్షియంను కరిగించే యాసిడ్ లెవల్స్ తగ్గిపోతాయి. ఈ విధంగా పరోక్షంగా ఎముకలకు ఆరోగ్యాన్ని కల్పించి జాయింట్ నొప్పిని తగ్గిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అధికం
అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అయిన విటమిన్ సీ, విటమిన్ ఈ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మంపై కణాలు డ్యామేజ్ అవకుండా అడ్డుకుంటాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి స్థిరంగా లేకుండా ఇన్‌ఫ్లమ్మేషన్‌కు గురి చేసి శరీరంలో జాయింట్ పెయిన్ నెలకొనేలా చేస్తాయి. అటువంటి కీలక సమయంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అరటిపండు తినడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి అసౌకర్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది.
మెగ్నీషియం
మెగ్నీషియం స్థాయిలు అరటిపండ్లలో ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల కండరాలతో పాటు నరాల పనితీరులోనూ చక్కటి మార్పు కనిపిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ ప్రభావాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచి జాయింట్ నొప్పుల వంటి సమస్యలను పరిష్కరిస్తాయి. ఫలితంగా ఆర్థరైటిస్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అరటిపండ్లను రోజూ తినడం వల్ల ప్రయోజనాలున్నప్పటికీ, వీటిని మీ డైట్ లో చేర్చుకునే ముందు మీ శరీరానికి సరిపడతాయో లేదోనని పరీక్షించుకోండి.
సంబంధిత కథనం