Janhvi Kapoor: బంగారంలాంటి పిల్ల జాన్వీ, ఆమెకు ఇష్టమైన ఈ రంగు డ్రెస్సుల్లో ఎంతలా మెరిసిపోతోందో చూడండి
Janhvi Kapoor: జాన్వీ కపూర్ నచ్చే షేడ్ గోల్డెన్ షేడ్. బంగారు రంగులో మెరిసే డ్రెస్సులో ఆమె ఎన్నో సార్లు మెరిసింది. జాన్వీ ఫాలో అయ్యే గోల్డెన్ ఫ్యాషన్ అవుట్ ఫిట్స్ ఇవిగో.
జాన్వీ కపూర్ కు ఈ మధ్య గోల్డెన్ షేడ్ తెగ నచ్చేస్తోంది. అందుకే ఆమె ఈ మధ్యన గోల్డెన్ డ్రెస్సుల్లో మెరిసిపోతోంది. ఆమె ఇటీవల పోస్టు చేసిన ఫ్యాషన్ ఫోటోలే ఇందుకు నిదర్శనం. ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ కార్యక్రమానికి డిజైనర్ గౌరవ్ గుప్తా కుట్టిన బంగారు గౌనును ధరించారు. ఆమె గోల్డెన్ డ్రెస్సులో దేవతలా మెరిసిపోతోంది. కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఆమె కనిపిస్తోంది.
ఐఫా అవార్డ్స్ లో జాన్వీ మరో గోల్డెన్ డ్రెస్సులో కూడా కనిపించింది. ఈ డ్రెస్ ను రిమ్జిమ్ దాదు డిజైన్ చేశారు. ఈ డ్రెస్‌లో స్ట్రాప్లెస్ ట్యూబ్ బ్లౌజ్, బాడీ హగ్గింగ్ ఫ్లోర్ లెంగ్త్ స్కర్ట్ ధరించింది. సిల్వర్ సీక్విన్స్ లో చేసిన సిగ్నేచర్ మెటాలిక్ కార్డ్స్ తో ఆ డ్రెస్ రూపొందించారు. డైమండ్ చోకర్ నెక్లెస్, టియర్ డ్రాప్ చెవిపోగులు, హై హీల్స్, లూజ్ హెయిర్స్ స్టైల్ తో ఆమె ఎంతో అందంగా కనిపించింది. కోహ్ల్-లైన్డ్ కళ్లు, న్యూడ్ లిప్ స్టిక్ పెదవులు, నల్లటి కనుబొమ్మలతో గోల్డెన్ లుక్ ను డిజైన్ చేసింది.
ఐఫా అవార్డ్స్ లో జాన్వీ రెడ్ కార్పెట్ కోసం మెరిసే బంగారు దుస్తులు ఎంపిక చేసుకుంది. వాటిపై స్ఫటికాలు, నడుముపై హంస డిజైన్, బాడీకాన్ మెర్మైడ్ సిల్హౌట్ తో అలంకరించిన అందమైన గౌన్ ఆమె వేసుకుంది. దీన్ని గౌరవ్ గుప్తా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కు ఆమె అందమైన మేకప్ ఎంచుకుంది. సైడ్-పార్ట్ లూజ్ హెయిర్స్, బుల్గారి చోకర్ నెక్లెస్, సర్పెంటైన్ చెవిపోగులు, నిగనిగలాడే గులాబీ పెదవులు, కంటికి మస్కారాతో ఆమె చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపిస్తోంది.
దేవరను ప్రమోట్ చేసే సమయంలో జాన్వీ మనీష్ మల్హోత్రా రూపొందించిన బంగారు కంజీవరం చీరను ధరించింది. తొమ్మిది గజాల చీరలో జర్దోసి ఎంబ్రాయిడరీ, భిన్నమైన పింక్ పట్టి బోర్డర్, భారీ పల్లూతో ఎంతో చక్కగా ఉంది. ఈ చీరకు సరిపోయే హాఫ్ స్లీవ్ బ్లౌజ్, బంగారు జుమ్కీలు, ఉంగరాలు, గులాబీ రంగు బొట్టు, మస్కారా అలంకరించిన కనురెప్పలు, గులాబీ పెదవులతో ఆమె మన మేకప్ ముగించింది. చివరగా, ఆమె తన జుట్టును ఒక ప్రక్కన వదులుగా వదిలేసింది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకలకు హాజరైన జాన్వీ ఫాల్గుణి షేన్ పీకాక్ డిజైన్ చేసిన ఈ అద్భుతమైన లెహంగా సెట్ ను ఎంచుకుంది. సంప్రదాయ దుస్తుల్లో టెంపుల్ జ్యూయలరీ బ్లౌజ్, అందమైన లెహంగా, సీక్విన్స్ అలంకరించిన నెట్ దుపట్టా ఉన్నాయి. గోల్డ్ చోకర్, మ్యాచింగ్ చాంద్బాలీస్, మాంగ్ టికా, గాజులు, ఉంగరాలను ధరించి అందంగా కనిపిస్తోంది.
వెడల్పాటి ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉన్న ఈ అందమైన టిష్యూ సిల్క్ చీరలో జాన్వీ భారతీయ సంప్రదాయ లుక్ లో కనిపిస్తోంది. ఆమె తొమ్మిది గజాల ఎంబ్రాయిడరీ చీరతో, బ్యాక్లెస్ బ్లౌజ్ డిజైన్, ప్లంపింగ్ నెక్లైన్ కలిగి ఉంది. ఎమరాల్డ్ చెవిపోగులు, ఉంగరాలు పెట్టుకుంది. కనురెప్పలను అందంగా మస్కారాతో అలంకరిచింది. ఆమె లుక్ మొత్తంగా ఎంతో చక్కగా ఉంది.
టాపిక్