Long Weekends In 2025 : 2025 లాంగ్ వీకెండ్స్ లిస్ట్ ఇదిగో.. సరిగా ప్లాన్ చేసి టూర్స్ వెళ్లొచ్చు!
2025లో చాలా లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. మీరు సరిగా ప్లాన్ చేసుకుంటే మంచి మంచి టూర్స్ ప్లాన్ చేయవచ్చు. ఈ ఏడాది వచ్చే లాంగ్ వీకెండ్స్ లిస్ట్ చూద్దాం..
2025లో వస్తున్న లాంగ్ వీకెండ్‌లు మీ సెలవులను ప్రత్యేకంగా చేస్తాయి. మీరు కుటుంబంతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఏడాది వచ్చే లాంగ్ వీకెండ్స్ లిస్ట్ చూసి.. మీరు ఇప్పుడే ప్రణాళికలు వేసుకోవచ్చు. ఎలాంటి ప్రదేశాలు సందర్శించాలో ఆలోచన చేయవచ్చు. మీ డైరీని తీసి, తేదీలను నోట్ చేసుకుని ప్లాన్ వేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి రావొచ్చు. 2025లో వచ్చే లాంగ్ వీకెండ్స్ లిస్ట్ ఇక్కడ చూడండి.
జనవరిలో మొదటి లాంగ్ వీకెండ్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జనవరి 11, 12 తేదీల్లో శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయి. జనవరి 13 (సోమవారం) సెలవు తీసుకుంటే మకర సంక్రాంతి ప్రభుత్వ సెలవులతో జనవరి 14 లాంగ్ వీకెండ్ అవుతుంది.
మార్చి నెల కూడా సుదీర్ఘ సెలవులు ఉంటాయి. మార్చి 14న హోలీ, మార్చి 15, 16న శని, ఆదివారం సెలవులు ఉన్నాయి. మీరు 13వ తేదీ లీవ్ తీసుకుంటే నాలుగు రోజులు ఎంజాయ్ చేయవచ్చు. మార్చి 29, 30 శని, ఆదివారం. మార్చి 31 ఈద్ అల్-ఫితర్ సెలవుదినం.
ఏప్రిల్‌లో రెండు లాంగ్ వీకెండ్‌లు కూడా ఉన్నాయి. మొదటిది ఏప్రిల్ 10న మహావీర్ జయంతి, ఏప్రిల్ 11న సెలవు తీసుకుంటే అది ఏప్రిల్ 12, 13వ తేదీలలో శని, ఆదివారంతో లాంగ్ వీకెండ్ అవుతుంది. రెండోది ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 19, 20న శనివారం, ఆదివారం.
మేలో ఒక లాంగ్ వీకెండ్ మాత్రమే ఉంది. మే 10, 11 తేదీల్లో శని, ఆదివారాలు సెలవుల నేపథ్యంలో మే 12న బుద్ధ పూర్ణిమకు ప్రభుత్వ సెలవుదినం.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 16న జన్మాష్టమి (శనివారం), ఆగస్టు 17న ఆదివారం. సరిగా ప్లాన్ చేసి ఓ చిన్న టూర్ వెయవచ్చు.
సెప్టెంబర్ 5న ఈద్-ఎ-మిలాద్, ఓనం ఉన్నాయి. సెప్టెంబర్ 6 శనివారం, సెప్టెంబర్ 7 ఆదివారం కలిసి లాంగ్ వీకెండ్ అవుతాయి.
అక్టోబర్‌లోనూ వీకెండ్స్ ఎక్కువే వస్తున్నాయి. మహా నవమి, గాంధీ జయంతి అక్టోబర్ 1, 2 తేదీలలో ఉన్నాయి. మీరు అక్టోబర్ 3న సెలవు తీసుకుంటే అక్టోబర్ 4, 5 శని, ఆది వారాలు కలిసి వస్తాయి. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో దీపావళి వారాంతం. 23-26 అక్టోబర్‌లో భాయ్ దూజ్‌తో మరో లాంగ్ వీకెండ్ కూడా ఉంటుంది.
క్రిస్మస్ డిసెంబర్ 25న. డిసెంబరు 26న సెలవు తీసుకుంటే 27, 28వ తేదీలు శని, ఆది వారాలు కలిసి లాంగ్ వీకెండ్ అవుతుంది.