Life in Small Towns: “సిటీ లైఫ్ వదిలేశాను.. ప్రశాంతంగా బతుకుతున్నాను” ఇది కదా లైఫ్ అంటే!
Life in Small Towns: ముంబై లాంటి మహా నగరంలో అందుకుంటున్న భారీ శాలరీని వదులుకుని సొంతూరికి వెళ్లిపోయాడు. అంతే, కట్ చేస్తే ప్రశాంతమైన జీవితంతో పాటు మరెన్నో సౌకర్యాలతో సక్సెస్‌ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్నాడు. అదెలాగో తెలుసా!
ముంబై లాంటి మహా నగరంలో భారీ శాలరీని వదిలేసుకుని సొంతూరికి వెళ్లిపోయాడు. అంతే, కట్ చేస్తే ప్రశాంతమైన జీవితంతో పాటు మరెన్నో సౌకర్యాలతో సక్సెస్‌ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్నాడు. అదెలాగో తెలుసా!
ఐదేళ్ల క్రితం, అంటే కరోనా లాంటి మహమ్మారి ప్రభావం తర్వాత ఓ వ్యక్తి తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై నగరంలో బిజీ లైఫ్ గడపడం ఇష్టం లేక సొంతూరికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. అంతే తన లగేజి మొత్తం తీసుకుని సొంతూరైన జంషెడ్‌పూర్ వచ్చేశాడు. అతను తీసుకున్న ఆ నిర్ణయాన్ని కొందరు ఎగతాళి చేస్తే, మరికొందరు బతకడం తెలియదని జాలిపడ్డారు. కానీ, అతను ప్రస్తుతమున్న స్థానాన్ని చూస్తే వారంతా ముక్కున వేలేసుకోవాల్సిందే.
తొలినాళ్లలో చాలా ఒడిదుడుకులు:
జంషెడ్పూర్ లో ఎదిగిన సుమిత్ అనే వ్యక్తి హైదరాబాద్, ముంబై లాంటి ఛాలెంజింగ్ సిటీలలో చాలా ఏళ్ల పాటు గడిపాడు. కానీ, అతను తన సొంతూరికి వెళ్లిపోదామనుకున్నప్పుడు, అక్కడ సమాజంలో నేను ఇమడగలనా?, నాకు పని ఎక్కడ దొరుకుతుంది.? అనే ప్రశ్నలు వెంటాడాయట. కానీ, ఇంత చిన్న పట్టణంలో కూడా తనకు అందిన సౌకర్యాలను ముందుగా ఊహించలేకపోయానని చెప్తున్నాడు.
సొంతూరికి వెళ్లిపోవాలని అనుకోవడానికి 5 కారణాలు:
ట్రాఫిక్ చిక్కులు లేని ప్రదేశం
మా ఊరికి వచ్చేయడం వల్ల రోజు మొత్తంలో 20-25శాతం ట్రాఫిక్ లో గడపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటే 14 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయినా 15 నిమిషాలలో చేరుకోగలుగుతున్నా. ఈ ప్రయాణం విసుగు తెప్పించడం లేదు.
లివింగ్ కాస్ట్ తక్కువ
కొత్త ప్రదేశంలో సాధారణంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఇది మా సొంతూరు కావడం వల్ల అలాంటివేం లేవు. పైగా నెలకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. దాంతోపాటుగా మహానగరంలో గడిపిన దాని కంటే బెటర్ గా క్వాలిటీ లైఫ్ స్పెండ్ చేయగలుగుతున్నాను.
అందుబాటు ఖర్చు
ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సైట్లు కూడా అందుబాటులో ఉండటంతో మహానగరంలో గడిపి ఖర్చులు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది. ఇక్కడే ఉంటే, శక్తికి మించిన ఖర్చు పెట్టక్కర్లేదు. క్యాబ్స్, ఈవెంట్లు, మల్టీప్లెక్సులు అన్ని కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
ప్రశాంతమైన ప్రదేశాలు
వీకెండ్స్ లో బయటకు వెళ్లాలంటే, మహానగరాల్లో ఉండే బిజీ వాతావరణం ఇక్కడ లేదు. గుంపులు గుంపులుగా కూడా లేకపోవడంతో ప్రశాంతమైన ప్రదేశాలు ఆహ్లాదకరంగా అనిపించాయి.
ఆరోగ్యం కోసం ఎక్కువ సమయం
ఫిట్‌నెస్, స్పోర్ట్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించగలిగాను. ఎంత పెద్ద నగరంలో ఉన్నా కూడా ఈ సౌకర్యం అందుకోలేకపోయాను.
సిటీ లైఫ్ గడిపి వచ్చిన తర్వాత పల్లెటూళ్లలో అందే సౌకర్యాల కంటే అందుబాటులో లేని లగ్జరీలను పెద్దగా పట్టించుకోవాలని అనిపించలేదు. కాకపోతే ఈ విషయం ఎవరికి వాళ్లకు వ్యక్తిగతంగా ఉండొచ్చు. ఐదేళ్ల క్రితం చిన్న పట్టణంలో ఉండగలనా అనిపించింది. కానీ, అప్పట్లో నేను అనుకున్నంత దారుణంగా ఏమీ లేదు. మరి మీ సంగతేంటి? మెట్రో సిటీల్లో బిజీ లైఫ్, ట్రాఫిక్ లైఫ్ గడిపే మీరు కూడా సౌంతూళ్లకు వెళ్లే ఆలోచన చేస్తున్నారా.. ధైర్యంగా నిర్ణయంతీసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్