Potato Chips : ఇంట్లో చేసుకుంటే ఆలూ చిప్స్ సరిగా రావడం లేదా.. చాలా మందికి తెలియని సీక్రెట్ ఇదే
Potato Chips: బంగాళదుంప చిప్స్ ఇంట్లో తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తే సరిగా రావు. చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకు ఓ సీక్రెట్ ఉంది. ఇది ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. అదేంటో ఇక్కడ చూడండి.
బంగాళదుంప చిప్స్ (ఆలూ చిప్స్) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే, ఇంట్లో వీటిని చేసుకునేందుకు ప్రయత్నిస్తే చాలా మందికి సరిగా రావు. బయట షాప్‍ల్లో కొనుక్కొచ్చిన విధంగా టేస్టీగా, కరకరలాడుతూ తయారు కావు. సరిగా కాలకపోవడమో, మాడిపోవడమో జరుగుతుంటాయి. అయితే, షాప్‍ల్లో తయారు చేసే వారికి ఆలూ చిప్స్ అంతబాగా వచ్చేందుకు ఓ సీక్రెట్ ఉంటుంది. వారు వేరే రకమైన బంగాళదుంపను వాడతారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బంగాళదుంపనే సీక్రెట్
చిప్స్ చేసేందుకు షాప్‍ల వారు ‘స్టాచీ బంగాళదుంప’ను (Starchy Potato) వినియోగిస్తారు. వీటిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని చిప్స్ ఆలూ అని కూడా అంటారు. సాధారణంగా మార్కెట్‍లో దొరికేవి ‘వ్యాక్స్ బంగాళదుంపలు’. వీటినే మనం ఎక్కువగా వాడతాం. వ్యాక్స్ ఆలూతోనే కూరలు, వంటకాలు చేసుకుంటుంటాం. అయితే వ్యాక్స్ ఆలూలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటితో చిప్స్ చేసేందుకు ప్రయత్నిస్తే అంత బాగా కుదరవు. అందుకే చిప్స్ ఇంట్లో చేసుకుంటే సరిగా రావు.
అందుకే.. స్టాచీ ఆలూతోనే చిప్స్ చేస్తే షాప్‍లో దొరికేలా పర్‌ఫెక్ట్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, స్టాచీ ఆలూ బయట దొరకడం కాస్త కష్టమే. పెద్ద సూపర్ మార్కెట్లలో లభించే అవకాశం ఉంది. స్టాచీ ఆలూతో ఇంట్లో చిప్స్ చేసుకోవాలన్నా.. కొన్ని టిప్స్ పాటించాలి. ఆలూ స్లైస్‍ను నీటితో శుభ్రంగా కడిగి మిగిలిన స్ట్రాచ్ పోయేలా చేయాలి. ఆ తర్వాత ఓ వస్త్రంపై వేసి స్లైస్‍లను పొడిగా అయ్యే వరకు తుడవాలి. ఆ తర్వాతే నూనెలో ఫ్రై చేయాలి. షాప్‍ల్లో తయారు చేసే వారు స్లైసెస్ నానబెట్టి, పొడిగా చేసే ప్రక్రియ చేయరు. ఎందుకంటే వారు చాలా నూనెహీట్‍తో ఫ్రై చేస్తారు. ఇంట్లో అంత హీట్ సాధ్యం కాదు. అంతటి పెద్ద పాత్రలు కూడా ఉండవు.
వ్యాక్స్ ఆలూతో చేసుకోవాలంటే..
స్టాచీ ఆలూ దొరకక.. వ్యాక్స్ బంగాళదుంపలతోనే చిప్స్ చేయాలంటే కొంత ఎక్కువ ప్రక్రియ అవసరం అవుతుంది. ముందుగా బంగాళదుంపను స్లైస్‍గా చేసుకోవాలి. వాటిని కనీసం ఓ మూడు, నాలుగుసార్లు నీటితో కడగాలి. కడిగిన తర్వాత నీరు శుభ్రంగా కనిపించే వరకు.. నీళ్లు మారుస్తూ కడుగుతూ ఉండాలి. ఆ తర్వాత బంగాళదుంప స్లైసెస్‍ను ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడి ఆరనివ్వాలి. ఆ తర్వాత స్లైసెస్‍ను ఓ వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత చిప్స్ కొన్నికొన్నిగా వేస్తూ వేడినూనెలో ఎక్కువ మంటపై ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే చిప్స్ కాస్త బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, స్టాచీ ఆలూతో చేసినంత పర్‌ఫెక్ట్‌గా రాకపోవచ్చు.
టాపిక్