Lemon Tree At Balcony: నిమ్మకాయలను ఇంటి బాల్కనీలోనే ఈజీగా పెంచుకోవచ్చు! ఎలాగో ఇక్కడ చూడండి!
ఎక్కువ స్థలం లేకపోయనా, నేల లేకపోయినా ఇంటి బాల్కనీలోనే అది కూడా కుండీలోనే ఈజీగా నిమ్మకాయలను పెంచుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? ఇది ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.
నిమ్మకాయలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నిమ్మరసం నుంచి నిమ్మకాయ పులిహోర వరకూ, క్లీనింగ్ నుంచి స్కిన్ గ్లో వరకూ అన్నింటిలోనూ నిమ్మకాయ పాత్ర అమోఘమైనది. అలాంటి నిమ్మకాయను బయట నుంచే ప్రతిసారి కొనుక్కురావడం ఎందుకు? ఇంట్లోనే ఈజీగా పెంచుకుంటే బాగుంటుంది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ టిప్స్ మీ కోసమే. వీటిని పాటించారంటే ఎక్కువ చోటు లేకపోయినా, నేల లేకపోయినా కుండీలో కూడా ఈజీగా నిమ్మకాయలను పెంచుకోవచ్చు. మీ బాల్కనీనే నిమ్మతోటగా మార్చేయచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం రండి..

విత్తనాలా లేక మొక్కనా?
నిమ్మకాయలను పెంచాలనే ఆసక్తి మీకు ఉంటే మీరు విత్తనాలను నాటాలనుకుంటున్నారా లేదా మొక్కను కొనుగోలు చేసి పెంచుకోవాలి అనుకుంటున్నారా అని ముందుగా నిర్ణయించుకోండి. విత్తనాల నాటి పెంచినప్పడు మొక్క పూర్తి అభివృద్ధిని మీరు చూడవచ్చు. అలాగే మొక్కను నాటడం ద్వారా పండ్లను ఆస్వాదించవచ్చు.
సరైన కుండను ఎంచుకోండి..
నేల లేకపోవడం వల్ల మీరు కుండీలో నిమ్మకాయ మొక్కను పెంచాలనుకుంటే, కుండ పరిమాణం పెద్దదిగా ఉండేలా చూసుకోండి. అప్పుడే నిమ్మమొక్క బాగా పెరుగుతుంది. మీరు ఎంచుకునే కుండీ లేదా బకెట్ కనీసం 7 అంగుళాల లోతుతో కాస్త విశాలంగా ఉండేలా చేసుకోండి.
మట్టి మిశ్రమం విషయంలో జాగ్రత్త..
నిమ్మచెట్టును పెంచడంలో మట్టి పాత్ర చాలా కీలకం. కనుక మీకు తెలిసిన లేదా దగ్గర్లోని నర్సరీకి వెళ్లి అక్కడి తోటమాలిని అడిగి మట్టిని తెచ్చుకోండి. కుండీలో 50% తోట మట్టి, 20% వానపాము ఎరువు లేదా సేంద్రీయ ఎరువులతో పాటు ఇతర మట్టిని కలపండి.
నీటి అవసరం తెలుసుకోండి..
మీరు నిమ్మకాయ మొక్కకు నీరు పోసేటప్పుడు జాగ్రత్తగా పోయాలి. ఎందుకంటే నిమ్మ చెట్టు సువాసన, పండ్లు కొన్ని కీటకాలను ఆకర్షిస్తాయి. కాబట్టి మట్టి ఉపరితలం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీరు పోయాలి (ముఖ్యంగా శీతాకాలంలో) రోజుకు ఒకసారి మాత్రమే నీరు పోయాలి. వేసవి మట్టి పొడిబారటాన్ని బట్టి రెండు సార్లు పోయండి.
సూర్యకాంతి అవసరం
నిమ్మ చెట్లకు సూర్యకాంతి చాలా అవసరం. ప్రకాశవంతమైన సూర్యకాంతి మొక్క మీద పడాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది, పూలు, పండ్లు వస్తాయి. కాబట్టి మీరు బాల్కనీ తోటలో మొక్కను ఉంచినట్లయితే, రోజులో 6 గంటల సూర్యకాంతి వస్తుందో లేదో చూడండి. కొంత సమయం పరోక్ష సూర్యకాంతి కూడా మొక్క ఎదుగుదలకు అవసరం.
మట్టిని కదిలిస్తూ ఉండాలి..
నిమ్మ చెట్టు పెంపకంలో మొక్క చుట్టూ ఉన్న మట్టిని కదిలించడం చాలా ముఖ్యం. మీరు మొక్కను ఇంటికి తీసుకువచ్చిన కొద్ది రోజులకు ఆకులు పెరగడం ప్రారంభమవుతాయి. అలాంటప్పుడు ప్రతి 20 నుండి 25 రోజులకు మట్టిని కదిలించాలి.
ఎరువు అవసరమా?
పండ్లు త్వరగా రావాలంటే నిమ్మ చెట్టుకు ఎరువు తప్పకుండా వేయాలి. కానీ, ఇది పూలు పూసే సమయంలోనే చేయాలి. ఆకులు రాలే సమయంలో చేయకూడదు. పూలు రావడం ప్రారంభించిన తర్వాత, ఎరువు వేసి, అనవసరమైన ఆకులను తొలగించాలి.
పండ్లు రావడం ఎప్పుడు ప్రారంభవుతుంది?
పూలు పూసిన వెంటనే పండ్లు రావడం ప్రారంభమవుతాయి. నిమ్మ చెట్టులోని పూలు తెల్లగా ఉంటాయి. వాటిపై బంగారు రంగు మొగ్గలు వస్తాయి. వాటిలో పచ్చని గింజలు ఉంటాయి. మొదటి పూవు పూసిన 2 వారాలలో ఇలా జరగడం ప్రారంభమవుతుంది.
ఎప్పుడు కోయాలి?
ఒకటిన్నర నెలల తర్వాత పూలు కాయలుగా మారిన తర్వాత నిమ్మకాయలు పూర్తిగా పెరగడం ప్రారంభిస్తాయి. అవి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇంకా కొన్ని వారాలకు పసుపు రంగులోకి మారుతాయి. అలా మారేంత వరకూ వేచి చూసి కాయలను కోయాలి.
టాపిక్