Eye Care In Summer : వేసవిలో మీ కంటి ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి-lemonade helps improving your eye health during in summers details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Lemonade Helps Improving Your Eye Health During In Summers Details Inside

Eye Care In Summer : వేసవిలో మీ కంటి ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి

వేసవిలో కంటి ఆరోగ్యం
వేసవిలో కంటి ఆరోగ్యం

Eye Care In Summer : మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే.. కళ్లు కూడా వేసవిలో చాలా ఒత్తిడికి గురవుతాయి. కొన్ని రకాల చిట్కాలను పాటంచి.. ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి.

వేసవి(Summer)లో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుంచి ఇంట్లోని చిట్కాలతోనే(Home Made Tips) బయటపడొచ్చు. ఎక్కువగా వినియోగించే నిమ్మరసం(Lemon).., వేసవిలో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ పానీయాన్ని ఆరోగ్య నిపుణులు, ఫిట్‌నెస్ ఔత్సాహికుల కూడా తీసుకోమని చెబుతారు. ఇక వేసవిలో చేసే.. లెమన్ షర్బత్ ది ప్రత్యేక స్థానం. నిమ్మరసం, నీరు, నల్ల ఉప్పు, చక్కెర, ఇతర స్వీటెనర్ల మిశ్రమంతో తయారు చేయబడిన ఈ పానీయం మీరు హైడ్రేటెడ్‌(hydrate)గా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది మీ కళ్లను కాపాడుతుందని మీకు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు

వేడి, తీవ్రమైన సూర్య కిరణాలకు గురికావడం వల్ల కంటిశుక్లం, మాక్యులర్ డీజెనరేషన్, కళ్ళు పొడిబారడం వంటి అనేక రకాల సమస్యలకు దారితీయవచ్చు. కొంతమందికి ఈ సీజన్‌లో నిరంతరం కంటి చికాకు ఉంటుంది. ప్రధానంగా గాలిలో కాలుష్య(Pollution) కారకాలు ఎక్కువగా ఉండటం వల్ల మన కళ్లు అలర్జీకి గురవుతాయి. అందుకే, వేసవి(Summer)లో మీ కళ్లను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మంచి నాణ్యమైన సన్ గ్లాసెస్, కంటి చుక్కలు సూర్యకిరణాల నుంచి కాపాడతాయి. అయితే ఇది మీ సమస్యలకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాలతో మీ కంటి ఆరోగ్యాన్ని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే నిమ్మకాయ పానీయం గొప్పగా పనిచేస్తుంది.

నిమ్మకాయలో విటమిన్ సి(Vitamin C) పుష్కలంగా ఉంటుంది. పోషకాహారం యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది. ఇది రాడికల్ నష్టం మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి కళ్లను రక్షించడంలో సహాయపడుతుంది.

నిమ్మకాయలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడే ముఖ్యమైన పోషకం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో విటమిన్ ఎ లేకపోవడం పాక్షిక అంధత్వానికి దారి తీస్తుంది.

నిమ్మరసం(Lemon)లో రెండు ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. లుటిన్, జియాక్సంతిన్, ఇవి మాక్యులర్ డిజెనరేషన్, కంటిశుక్లం నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.

నిమ్మకాయలోని విటమిన్ సి కళ్లలోని రక్తనాళాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది రెటీనాకు రక్త ప్రవాహాన్ని మరింత ప్రేరేపిస్తుంది. దృష్టిని, మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

సంబంధిత కథనం