మిగిలిపోయిన కూరగాలయతో ఇలా రోటి పచ్చటి చేసేయండి, అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది!-leftover veggie roti pachadi for a delicious evening meal goes great with rice and roti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మిగిలిపోయిన కూరగాలయతో ఇలా రోటి పచ్చటి చేసేయండి, అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది!

మిగిలిపోయిన కూరగాలయతో ఇలా రోటి పచ్చటి చేసేయండి, అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది!

Ramya Sri Marka HT Telugu

ఇంట్లో మిగిలిపోయిన కొన్ని కొన్ని కూరగయాలతో ఏం చేయాలో అర్థం కావడం లేదా? ఉపయెగపడవనుకుని వాటిని పడేస్తున్నారా? ఇకపై ఈ పొరపాటు చేయకండి. మిగిలిపోయిన కూరగాలేవైనా సరే వాటితో ఇలా అద్భుతమైన రోటి పచ్చడి చేసి పెట్టండి. ఎలా తయారు చేయాలో ఇక్కడ ఉంది.

కూరగాయలతో తయారు చేసిన పచ్చడి

అప్పుడప్పుడు మన ఇంట్లో కూరగాయలు మిగిలిపోతుంటాయి. కొన్నే కదా అనుకుని ఏం చేయాలో అర్థం కాక చాలామంది వాటిని పారేస్తూ ఉంటారు. ఈసారి నుంచీ ఇలా చేయకండి. ఇంట్లో మిగిలిపోయిన ఆ కొద్దిపాటి కూరగాయలతో ఒక అద్భుతమైన, రుచికరమైన పచ్చడిని తయారు చేయవచ్చని తెలుసుకోండి. ఇది మీ రొట్టెల్లోకి, అన్నంలోకి అదిరిపోయే రుచినిస్తుంది. ఏదైనా ప్రత్యేకంగా తినాలనిపిస్తే ఒక్కసారి ఇలా మిగిలిన కూరగాయలతో రోటి పచ్చడిని చేసి చూడండి. దీని రుచికి ఇంట్లో అందరూ తప్పకుండా ఫిదా అయిపోతారు. మరి ఆలస్యం ఎందుకు? ఆ టేస్టీ రెసిపీని చూసేద్దాం రండి..

మిక్సిండ్ వెజిటెబుల్ రోటి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు:

  • నూనె- రెండు టేబుల్ స్పూన్లు
  • ధనియాలు- అర టీస్పూన్
  • ఎండు మిరపకాయలు- 6 నుంచి 8
  • పళ్లీలు- ఒక టేబుల్ స్పూన్
  • నువ్వులు- ఒక టేబుల్ స్పూన్
  • శనగపప్పు- ఒక టేబుల్ స్పూన్
  • మినపప్పు- ఒక టేబుల్ స్పూన్
  • జీలకర్ర- ఒక టేబుల్ స్పూన్
  • చింతపండు- పెద్ద నిమ్మకాయంత సైజు
  • టమాట- రెండు లేదా మూడు
  • వెల్లుల్లి రెబ్బలు- ఒక వెల్లుల్లి మొత్తం
  • పచ్చిమిర్చీ- 10 నుంచి 15 మీ రుచికి తగినంత
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • దొండకాయ- ఒక కప్పు
  • మెంతి ఆకు- అర కప్పు
  • వంకాయ- ఒక కప్పు
  • క్యాప్పికం, బ్రోకటి, దోసకాయ వంటి మీకునచ్చిన ఏవైనా కూరగాయలు

మిక్సిడ్ వెజిటెబుల్ చట్నీ తయారే చేసే విధానం:

  1. మిగిలిపోయిన కూరగాయలతో పచ్చడి చేయడం కోసం ముందుగా మీ ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి.
  2. తరువాత ఒక ఫ్రైయింగ్ పాన్ లేదా కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో నూనె పోసి వేడి చేయండి.
  3. నూనె కాస్త వేడెక్కగానే దాంట్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, పళ్లీలు, నువ్వులు, శనగపప్పు, మినప పప్పు వేసి దోరగా వేయించండి. వీటిని మీడియం మంట మీద మాత్రమే వేయించాలి. లేదంటే అడుగంటి పచ్చడి రుచి చెడిపోతుంది.
  4. అన్నీ దోరగా వేగిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చల్లారనివ్వండి.
  5. ఇప్పుడు అదే కడాయిలో మీకు నచ్చిన కూరగాయలన్నింటినీ వేసి కాసేపు వేయించండి.
  6. కూరగాయలన్నీ నూనెలో కాస్త వేగిన తర్వాత దాంట్లో టమాటాలు, ఉప్పు వేసి కాసేపు ఉడికించండి.
  7. టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొత్తిమీర వేసి వేయించండి.
  8. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి.
  9. చల్లారిన ఈ రెండు మిశ్రమాలన్నింటినీ రోట్లో కొద్దిగా కొద్దిగా వేస్తూ రుబ్బాలి. రోలు లేని వారు రోటిలో పచ్చడి చేసే సమయం లేని వారు ముందుగా పప్పుల మిశ్రమాన్ని వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత కూరగాయలు, టమాటా మిశ్రమాన్ని వేసి బాగా మిక్సీ పట్టాలి.
  10. ఈ మిశ్రమం మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉంటేనే పచ్చడి రుచి అద్భుతుంగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. దీన్ని అన్నం, చపాతీలతో పాటు దోస, ఇడ్లీ వంటి వాటితో కలిపి కూడా తినచ్చు. ఇలా చేశారంటే కూరగాయలు వృథా అవకుండా ఉంటుంది, రుచికరమైన పచ్చడి తిన్నట్టు ఉంటుంది. లేటు ఎందుకు మరీ ఇవాళే ఈ పచ్చిడిన ట్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టేయండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.