Leftover Rice benefits : మిగిలిన అన్నం రాత్రంతా నానబెట్టి ఉదయం ఇలా తింటే హెల్త్‌కి సూపర్
Leftover Rice benefits : రాత్రిపూట అన్నం మిగిలితే మనం చేసే మెుదటి పని.. ఉదయాన్నే పడేయడం. కానీ దీనిని సరిగ్గా వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాత్రి మిగిలిన అన్నంతో శరీరానికి అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.
చద్ది అన్నం తినడం మంచిదని మన పెద్దలు చెబుతుంటారు. కానీ ఇప్పటి జనరేషన్ వారికి వేడి వేడిగా తింటేనే తృప్తి. రాత్రి మిగిలిన అన్నం ఎంత ఉన్నా.. పడేయాల్సిందే. కానీ ఇలా చేయడం కంటే దానిని తింటే మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. చాలా ఆరోగ్యకరమైన పోషకాలను శరీరానికి ఇవ్వవచ్చు. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కి ఇది తింటే సరిపోతుంది.

ప్రోబయోటిక్ ఆహారాలు పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పెరుగు కూడా ప్రోబయోటిక్ ఆహారం. ఇటువంటి ఆహారాలు పేగులలోని మలినాలను తొలగించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి. అన్నంలో పెరుగు కలుపుకొని తింటే అనేక ఉపయోగాలు ఉంటాయి.
రాత్రి మిగిలిన అన్నాన్ని మట్టి కుండలో వేసి నీళ్లు పోయాలి. ఉదయాన్నే దీనికి కొంచెం పెరుగు వేసి ఖాళీ కడుపుతో ఒక చెంచా తినండి. ఒకవేళ పెరుగు లేకున్నా.. మీరు తినవచ్చు. ఇందులో కాస్త ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శస్త్ర చికిత్స చేయించుకున్న వారు ఇలా తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది అల్సర్‌లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
ఇలా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హార్మోన్ల సమతుల్యతలో సహాయపడుతుంది. వాపు సమస్య ఉంటే అది కూడా తగ్గుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగితే అన్నాన్ని నానబెట్టి ఉదయం పెరుగులో కలిపి తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. చర్మ సౌందర్యానికి కూడా మంచిది ఇలా వారానికి 5 సార్లు లేదా వారంలో ఏడు రోజులు తింటే మీ చర్మంలో మార్పు కనిపిస్తుంది. మీ చర్మం మెరుస్తుంది.
రాత్రంతా నానబెట్టిన అన్నంలో సూక్ష్మ పోషకాలు, మినరల్స్ ఉంటాయి. ఇందులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం దొరుకుతాయి. ప్రతిరోజూ ఒక చెంచా ఖాళీ కడుపుతో తీసుకుంటే, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే నీటిలో నానబెట్టిన అన్నంలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
ఇంట్లో అందరూ తిన్న తర్వాత రాత్రి అన్నం మిగులుతుంది. మిగిలిపోయిన అన్నంతో ఏం చేయాలో పాలుపోక చాలా మంది బయటపడేస్తారు. ఇకపై అలాంటి బాధ అవసరం లేకుండా పైన చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి. ఒకవేల అది నచ్చకపోతే ఇతర రెసిపీలు కూడా ట్రై చేయెుచ్చు. కానీ మిగిలిన అన్నాన్ని నీటిలో నానబెట్టి ఉదయం పూట పెరుగులో కలిపి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఎక్కువ నీటిలో మాత్రం నానబెట్టకండి.
మన పూర్వీకులు ఇలానే చద్ది అన్నం తిని బలంగా ఉండేవారు. కుండలో నానబెట్టిన అన్నంతో ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. మీకు కావాలంటే ఒక ఉల్లిపాయను కొరుకుతూ కూడా చద్ది అన్నం తినొచ్చు. ఎన్నో ఉపయోగాలు దీనితో ఉంటాయి.
టాపిక్