Chicken Biryani: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? దాంతో ఇలా చికెన్ బిర్యానీ వండేయండి, కొత్తగా టేస్టీగా ఉంటుంది-leftover chicken curry cook the chicken biryani like this recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Biryani: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? దాంతో ఇలా చికెన్ బిర్యానీ వండేయండి, కొత్తగా టేస్టీగా ఉంటుంది

Chicken Biryani: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? దాంతో ఇలా చికెన్ బిర్యానీ వండేయండి, కొత్తగా టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
May 04, 2024 11:30 AM IST

Chicken Biryani: మిగిలిపోయిన చికెన్ కర్రీ తో చికెన్ బిర్యానీ వండితే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి. రెసిపీ కూడా చాలా సులువు.

చికెన్ బిర్యానీ రెసిపీ
చికెన్ బిర్యానీ రెసిపీ ( Foodvedam/Youtube)

Chicken Biryani: ప్రతి ఇంట్లో చికెన్ కర్రీ వండిన తర్వాత కొంత మిగిలిపోవడం సాధారణం. అలా మిగిలిపోయిన కర్రీని కొత్తగా తిరిగి వండవచ్చు. ఆ మిగిలిపోయిన కర్రీతో చికెన్ బిర్యానీ వండితే టేస్ట్ గా ఉంటుంది. రుచి కూడా అదిరిపోతుంది. ఒక్కసారి చేశారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కర్రీ రెడీగా వండేసి ఉంది... కాబట్టి ఈ చికెన్ బిర్యాని వండడానికి అరగంట సమయం సరిపోతుంది.

చికెన్ బిర్యాని రెసిపీకి కావలసిన పదార్థాలు

మిగిలిపోయిన చికెన్ కర్రీ - ఒక కప్పు

బాస్మతి బియ్యం - రెండు కప్పులు

ఉల్లిపాయ - ఒకటి

టమోటా - ఒకటి

పెరుగు - అరకప్పు

పచ్చిమిర్చి - నాలుగు

కారం - ఒక స్పూను

పసుపు - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

గరం మసాలా - అర స్పూను

యాలకులు - రెండు

లవంగాలు - నాలుగు

మిరియాలు - ఆరు

బిర్యానీ ఆకు - ఒకటి

నూనె - తగినంత

చికెన్ బిర్యాని రెసిపీ

1. చికెన్ కూర రెడీగా వండి ఉంది కాబట్టి, ఈ చికెన్ బిర్యాని అరగంటలో రెడీ అయిపోతుంది.

2. బాస్మతీ బియ్యాన్ని 20 నిమిషాలు పాటు ముందే నానబెట్టుకొని ఉంచండి.

3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయండి.

4. నూనె వేడెక్కాక లవంగాలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసి బాగా వేయించండి.

5. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించండి.

6. అవి రంగు మారే వరకు వేయించాక పచ్చిమిర్చి, టమాటో తరుగు వేసి కలపండి.

7. పసుపు, కారం వేసి కలపండి. ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపండి.

8. అలాగే పెరుగును కూడా వేసి కలపండి.

9. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి రుచికి సరిపడా ఉప్పును కలపండి.

10. బాస్మతి బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను పోయండి.

11. తర్వాత యాలకులు, మిరియాలు కూడా వేసి కుక్కర్ మీద మూత పెట్టండి.

12. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత స్టవ్ కట్టేయండి.

13. ఆవిరి పోయాక కుక్కర్ మూత తీయండి.

14. వేడివేడిగా చికెన్ బిర్యాని రెడీగా ఉంటుంది.

15. దీన్ని కేవలం అరగంటలో వండేసుకోవచ్చు.

16. కాబట్టి చికెన్ కర్రీ వండి రెడీగా ఉంచుకుంటే బిర్యానీ త్వరగా అయిపోతుంది.

17. దీని రుచి కూడా బావుంటుంది.

18. ఎప్పుడు ఒకేలా చికెన్ బిర్యానీ వండే కన్నా ఇలా కొత్తగా వండి చూడండి. అందరికీ నచ్చుతుంది.

19. ఈ చికెన్ బిర్యానీతో పక్కన ఉల్లిపాయలు, కాస్త పెరుగు పెట్టుకుంటే చాలు. ఎంతైనా తినేస్తారు.

చికెన్ బిర్యానీకి అభిమానులు ఎక్కువ. ఎప్పుడూ ఒకేలా వండితే ఎలా? మిగిలిపోయిన చికెన్ కర్రీతో కూడా వండి చూడండి. దీని రుచి అదిరిపోతుంది. రంగు కూడా తినాలనిపించేలా ఉంటుంది. ఇది వండడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కాబట్టి ఒక పావుగంట సేపు స్టవ్ దగ్గర నిల్చుని కుక్కర్ పెట్టేస్తే సరి. కేవలం కుక్కర్ లోనే కాదు సాధారణ గిన్నెలో కూడా దీన్ని వండుకోవచ్చు. ఒకసారి వండితే మీకే దీని రుచి నచ్చుతుంది.

Whats_app_banner