White rice: తెల్ల అన్నాన్ని ప్రతిరోజూ తింటూ కూడా బరువు తగ్గొచ్చట, ఎలాగో తెలుసుకోండి-learn how to lose weight by eating white rice every day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  White Rice: తెల్ల అన్నాన్ని ప్రతిరోజూ తింటూ కూడా బరువు తగ్గొచ్చట, ఎలాగో తెలుసుకోండి

White rice: తెల్ల అన్నాన్ని ప్రతిరోజూ తింటూ కూడా బరువు తగ్గొచ్చట, ఎలాగో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Oct 31, 2024 04:30 PM IST

White rice: కొంతమంది బరువు తగ్గాలంటే పూర్తిగా తెల్ల అన్నాన్ని తినడం మానేస్తారు. అయితే వైట్ రైస్‌ని తింటూ కూడా బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు పోషకాహార నిపుణఉలు. అయితే తినే విధానాన్ని మాత్రం మార్చాలని అంటున్నారు.

తెల్ల అన్నం తింటూ బరువు తగ్గొచ్చా?
తెల్ల అన్నం తింటూ బరువు తగ్గొచ్చా? (Pixabay)

బరువు పెరిగినంత సులువు కాదు బరువు తగ్గడం. బరువును తగ్గించుకోవాలని అనుకునేవారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. బరువు తగ్గే విషయంలో కొన్ని ఆహార నిర్ణయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందులో మొదటిది తెల్ల అన్నం తినాలా? వద్దా? అనేది. చాలామంది బరువు తగ్గేందుకు తెల్ల అన్నాన్ని తినకుండా దూరం పెడతారు. అయితే ప్రపంచంలోనే అనేక సంస్కృతలలో ప్రధాన ఆహారం తెల్ల అన్నమే. దీన్ని తింటూ కూడా బరువు తగ్గచ్చనే చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

తెల్ల అన్నంలోని పోషకాలు

తెల్ల అన్నం తింటూ బరువు తగ్గడం ఎలాగో తెలుసుకోవాలంటే ముందుగా మీరు వైట్ రైస్ లో ఎలాంటి పోషకాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. తెల్ల అన్నం మంచి శక్తివనరు. అయితే ఇప్పుడు బియ్యాన్ని చాలా పాలిషింగ్ చేసి అమ్ముతున్నారు. దీనివల్ల అందులో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు తగ్గిపోతున్నాయి. సాధారణంగా ఒక కప్పు వండిన తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్ 45 గ్రాములు ఉంటాయి. అలాగే ప్రోటీన్ నాలుగు గ్రాములు ఉంటుంది. ఫైబర్, కొవ్వు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి.

అన్నంలో ఉండే అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ వల్లే దాన్ని తినేందుకు ఎంతోమంది భయపడుతూ ఉంటారు. అయితే అంత భయపడాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారంలో భాగంగా తెల్ల అన్నాన్ని కూడా తినవచ్చని అంటున్నారు...ఎలా తినాలో కూడా వివరిస్తున్నారు.

తెల్ల అన్నం అనేది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం ఇది. రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచేస్తుంది. కాబట్టే ఇది బరువును కూడా త్వరగా పెంచుతుందని అంటారు. ఆహారాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఎందుకంటే అవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. శక్తిని కూడా నెమ్మదిగా విడుదల చేస్తాయి.

అలా అని మీరు పూర్తిగా తెల్ల అన్నాన్ని మానేయాల్సిన అవసరం లేదు. తీవ్ర వ్యాయామం చేసిన తర్వాత తెల్ల అన్నాన్ని తినవచ్చు. ఆ సమయంలో అతి సులభంగా జీర్ణం అవుతుంది. సాధారణ సమయంలో తెల్లా అన్నాన్ని ఎక్కువగా తింటే అది బరువు పెరిగేందుకు సహాయపడుతుంది. ప్రోటీన్లతో పాటు ఈ తెల్ల అన్నాన్ని తింటే ఎలాంటి సమస్య ఉండదు. అంటే తెల్ల అన్నాన్ని ప్రోటీన్ నిండిన కూరలతో తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. భోజనంలో తెల్ల అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, తగ్గించుకుంటే సరిపోతుంది. తెల్లా అన్నాన్ని తగ్గించి దాని బదులు లీన్ ప్రోటీన్ ఉండే చికెన్, చేపలు వంటివి అధికంగా తినాలి. అలాగే కోడి గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలి. కొన్ని కూరలను అధికంగా తినాలి. అన్నాన్ని తగ్గించి కూరలు తినడం వల్ల పోషకాలు కూడా అధికంగా శరీరంలో చేరుతాయి.

ప్లేటు భోజనంలో ఏముండాలి?

ఒక ప్లేట్ భోజనంలో ఒక కప్పు అన్నం, ఒక కోడిగుడ్డు, చికెన్ లేదా చేపలు, ఆకుపచ్చని కూరగాయలతో వండిన కూరలు అరకప్పు పెట్టుకొని తినేందుకు ప్రయత్నించండి. ఇది మీ బరువు నిర్వహణను ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే తెల్ల అన్నం వల్ల బరువు పెరగకుండా కూడా అడ్డుకుంటుంది. మీరు చేయాల్సినదల్లా ఎక్కువ మొత్తంలో తెల్ల అన్నాన్ని తినకుండా తగ్గించడమే.

Whats_app_banner