నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా అలాంటి వ్యక్తులు వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు వారి భాగస్వామి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి జీవిత భాగస్వామిని వదిలించుకోవడం కూడా చాలా కష్టం.
కొందరు భార్యలు లేదా భర్తలు ప్రతి విషయంలో లోపాలు వెతుకుతున్నారు. చిన్న చిన్న విషయాలకే పెద్దగా గొడవపడతారు. ఇలాంటి నార్సిసిస్టిక్ కేటగిరీకి చెందిన వారితో వేగడం కాస్త కష్టమే. అలాంటి వారితో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీరు చేసే ప్రతి పనిలో తప్పును చూపించే జీవిత భాగస్వామి దొరికితే మీకు అపరాధ భావన కలిగిస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి, మనస్తత్వవేత్తలు గ్రే రాక్ పద్ధతిని వివరించారు. కాబట్టి ఈ పద్ధతి ఏమిటో, నార్సిసిస్టిక్ జీవిత భాగస్వామితో వ్యవహరించడానికి ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
నార్సిసిస్టిక్ భార్యలు లేదా భర్తలు ఎప్పడూ తమ గురించే ఆలోచిస్తారు. తన చుట్టూ ఉన్న వ్యక్తుల భావోద్వేగాలు, ప్రవర్తన, సౌలభ్యం లేదా దేని గురించి అతను పట్టించుకోరు. తమ ఇమేజ్ ను పెంచుకోవడం, తమను తాను కరెక్ట్ అని నిరూపించుకోవడంలో మాత్రమే వీరు పనిచేస్తారు. వారు ఎల్లప్పుడూ తన జీవిత భాగస్వామిని పనికిరానివాడిలా చూస్తారు.
నార్సిసిస్ట్ ఎదుటివారి భావాలను ఎప్పుడూ గౌరవించడు. మీ శారీరక లేదా భావోద్వేగ అవసరాలు ఏవీ అతను పట్టించుకోడు. తన అవసరాలే అత్యవసరమైనవిగా భావిస్తాడు. ప్రతి చిన్న తప్పుకు మిమ్మల్ని నిందించడం, తమ తప్పును అంగీకరించకపోవడం వంటివి చేస్తారు. మీరు ఎంత ప్రయత్నించినా, వారు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. అలాంటి నార్సిసిస్టిక్ జీవిత భాగస్వామితో వ్యవహరించడానికి ఏమి చేయాలి.
మీ జీవిత భాగస్వామి నార్సిసిస్టిక్ గా ఉన్నప్పుడు, వారి దగ్గర నుంచి మీరు తప్పించుకోలేనప్పుడు… వారిని ఎదుర్కోవటానికి గ్రే రాక్ పద్ధతిని పాటించండి. ఇది నార్సిసిస్టిక్ వ్యక్తిత్వాలతో వ్యవహరించడానికి నిపుణులు సూచించే మానసిక పద్ధతి. భాగస్వామి మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు లేదా తప్పులను లెక్కించినప్పుడల్లా… మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి. చాలా తక్కువ మాటలతో ప్రతిస్పందించాలి.
మీ భార్య లేదా భర్త మిమ్మల్ని దూషించిన తర్వాత కూడా ఎమోషనల్ గా సమాధానం చెప్పకుండా ప్రాక్టికల్ గా ఒకటి రెండు పదాల్లో మాట్లాడాలి. అలా తక్కువగా మాట్లాడడం వల్ల నార్సిసిస్టిక్ వ్యక్తి చాలా వరకు తగ్గిపోతాడు. ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడూ తమ ముందున్న వ్యక్తిని మానసికంగా బలహీనంగా ఉంచాలనుకుంటారు. తద్వారా వారు మీపై ఆధిపత్యం చెలాయించలనుకుంటారు. కాబట్టి మీ భార్య నార్సిసిస్టిక్ అయితే… మీరు ఆమె ముందు ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా, ప్రతిస్పందించకుండా ఉండండి.
టాపిక్