Women Weight Loss: మహిళలూ.. జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గట్లేదా? ఆహారంలో ఇవి చేర్చుకుంటే కొద్దిరోజుల్లోనే ఫాస్ట్ రిజల్ట్-ladies are you going to the gym but not losing weight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women Weight Loss: మహిళలూ.. జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గట్లేదా? ఆహారంలో ఇవి చేర్చుకుంటే కొద్దిరోజుల్లోనే ఫాస్ట్ రిజల్ట్

Women Weight Loss: మహిళలూ.. జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గట్లేదా? ఆహారంలో ఇవి చేర్చుకుంటే కొద్దిరోజుల్లోనే ఫాస్ట్ రిజల్ట్

Ramya Sri Marka HT Telugu
Jan 12, 2025 11:30 AM IST

Women Weight Loss: కొన్ని ఆహారపు అలవాట్లు శరీరంలో కొవ్వును పేరుకుపోయేలా చేస్తాయి. అది తెలియక మనం జిమ్‌లో కొన్ని గంటల పాటు శ్రమపడినా కూడా ఫలితం కనపడదు. ప్రధానంగా డైట్ సరిగ్గా లేకపోతే అంతే. కాబట్టి, మహిళలు బరువు తగ్గడానికి ఏమేం తినాలో నిపుణుల నుండి తెలుసుకోండి.

మహిళలూ.. జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గట్లేదా
మహిళలూ.. జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గట్లేదా

శరీరంలో చాలా రోజులుగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. గంటల కొద్దీ శరీరాన్ని కష్టపెట్టినా అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, శరీరాన్ని శ్రమపెడుతూ కేలరీలు ఖర్చు చేసేటప్పుడు మనం తీసుకునే ఆహారం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గాలనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రతి పని ఉండాలి. జిమ్ లో శ్రమించడమైనా, ఇంట్లో తీసుకునే ఆహారమైనా దానికి తగ్గట్టుగానే జరగాలి. జిమ్‌లో వ్యాయామాల మాట అటుంచితే, మరి బరువు తగ్గాలనుకునే వారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి? ఏమేం తింటే శరీరంలోకి కేలరీలు అదనంగా చేరవు. తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే రండి.

వేగవంతంగా బరువు తగ్గడంలో మహిళలు పాటించాల్సిన బెటర్ డైట్

ఉదయాన్నే తీసుకోవాల్సినవి (ఉదయం 7:00 గంటలకు)

  • చియా గింజలతో నిమ్మరసం
  • జీలకర్ర నీరు
  • అల్లం-పసుపు టీ
  • వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్

బ్రేక్‌ఫాస్ట్‌లోకి.. (ఉదయం 8:00 గంటలకు)

  • వెజిటేబుల్ ఆమ్లెట్, 1 మల్టీగ్రెయిన్ టోస్ట్
  • ఎండు పండ్లు, గింజలతో ఓట్స్
  • పెసరపప్పు చిల్లాను పుదీనా చట్నీతో తినవచ్చు
  • పాలకూర, వే ప్రోటీన్, బాదం పాలు, అరటిపండు కలిపి ఒక స్మూతీ
  • 2 ఉడికించిన గుడ్లు, ఆవకాడో టోస్ట్

బ్రేక్ ఫాస్ట్ తర్వాత (ఉదయం 11:00 గంటలకు)

  • కొబ్బరి నీరు
  • కొన్ని మిశ్రమ ఎండు పండ్లు, గింజలు
  • మజ్జిగ
  • వేయించిన శనగలు

మధ్యాహ్న భోజనం (1:30 గంటలకు)

  • 1 రొట్టె, పన్నీర్ లేదా మిశ్రమ కూరగాయలతో కర్రీ, పప్పుతో తినాలి. దీనిలో సలాడ్‌ను కూడా కలుపుకోవాలి.
  • బ్రౌన్ రైస్‌తో రాజ్మా లేదా పప్పు, సలాడ్‌ను కలిపి తీసుకోండి.
  • క్వినోవా ఖిచిడీని పెరుగుతో తినండి.
  • రొట్టెను కూరగాయలతో చేసిన కర్రీ, పెరుగుతో కలిపి తినండి.

సాయంత్రం స్నాక్స్‌లోకి (4:00 గంటలకు)

  • వేయించిన బాదంపప్పుతో గ్రీన్ టీ తీసుకోండి
  • 1 ఉడికించిన గుడ్డు, హెర్బల్ టీ
  • 1 ఏదైనా పండు తినండి. ఆపిల్, జామ లేదా నారింజ వంటివి

రాత్రి భోజనం (సాయంత్రం 7:30 గంటలకు)

  • గ్రిల్డ్ చికెన్ లేదా చేప, వేయించిన కూరగాయలు
  • పప్పు, మల్టీగ్రెయిన్ టోస్ట్
  • కూరగాయలతో పన్నీర్ టిక్కా
  • పాలకూర లేదా టమాటా సూప్, సలాడ్

నిపుణులు సలహా ప్రకారం..

సమతూకంలో ఉన్న ఈ డైట్‌ను ఫాలో అవుతుండటంతో పాటు, ప్రతిరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు లేదా ఏదైనా ద్రావణాలు త్రాగాలి. కచ్చితంగా ఆవిరిలో ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. దాంతోపాటుగా గ్రిల్ చేయడం లేదా వేయించడం వంటి ఛాయీస్‌లను ఎంచుకోండి. ప్రముఖ సెలబ్రిటీలంతా వారి ఆహారాన్ని ఇలా ఉడకబెట్టుకునో, లేదా గ్రిల్ చేసుకునో మాత్రమే తింటారు. ఇలా చేయడం వల్ల డీప్ ఫ్రైలు, వేపుళ్లకు దూరంగా ఉండగలం. ఫలితంగా శరీరంలోకి అదనంగా కేలరీలు చేరి కొవ్వుగా మారకుండా ఉంటాయి. ఈ డైట్ పాటిస్తూనే కనీసం 30 నిమిషాల వ్యాయామం చేసే దినచర్యను అలవరచుకోండి. మీరు చేరాలనుకున్న బరువు తగ్గే లక్ష్యాన్ని వేగంగా సాధించగలుగుతారు. మరి ఈ డైట్ రూల్స్ ఎప్పటి నుంచి మొదలుపెట్టబోతున్నారు?

Whats_app_banner

సంబంధిత కథనం