Sleep Deprivation : నిద్ర మీ గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?-lack of sleep can effect your heart health
Telugu News  /  Lifestyle  /  Lack Of Sleep Can Effect Your Heart Health
నిద్ర సమస్యలు
నిద్ర సమస్యలు

Sleep Deprivation : నిద్ర మీ గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

13 March 2023, 20:15 ISTHT Telugu Desk
13 March 2023, 20:15 IST

Sleeping Problems : నిద్రలేమి సమస్యతో ఈ కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే సరైన నిద్రలేకపోవడం కూడా మీ గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. నిద్ర సరిగా ఉంటేనే.. ఆరోగ్యం బాగుంటుంది.

స్లీప్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం, సమయానికి నిద్రపోవడం ద్వారా 20 శాతం రక్తపోటు సమస్యలను పరిష్కరించవచ్చని తెలిసింది. మీ గుండె ఆరోగ్యాన్ని(Heart Health) కాపాడుకోవడానికి రోజుకు 6 నుండి 8 గంటల సరైన నిద్ర అవసరం. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిద్ర లేకపోవడం వల్ల గుండెతో సహా శరీరంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ హృదయ స్పందన మందగిస్తుంది. మీ రక్తపోటు పడిపోతుంది. అందువల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను చూడవచ్చు.

స్లీప్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం, సమయానికి నిద్రపోవడం ద్వారా 20 శాతం రక్తపోటు సమస్యలను పరిష్కరించవచ్చని తెలిసింది. నిద్రలేమి గుండెను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా రక్తపోటు, ఇది గుండె జబ్బులు, గుండెపోటు(Heart Attack)కు దారితీస్తుంది. ఇది ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్(cholesterol) స్థాయిలను పెంచుతుందని ఫరీదాబాద్ కార్డియాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ గజిందర్ గోయల్ చెప్పారు.

బెంగళూరులోని ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ పవన్ కుమార్ ప్రకారం, నిద్రలేమి గుండెను ఈ కింది 5 విధాలుగా ప్రభావితం చేస్తుంది.

గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.

అధిక రక్తపోటు, అధిక చక్కెర, అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వంటి ఇతర ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తాయి.

ఇది ముందుగా ఉన్న గుండె జబ్బులతో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.

నిశ్చల జీవనశైలి మరియు బరువు పెరగడానికి దారితీస్తుంది.

జీవనశైలి మార్పులు కూడా ఈ సమస్యను పరిష్కరించగలవు. రాత్రిపూట ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నైట్ షిఫ్ట్(Night Shift) పనిని నివారించడం కూడా సమస్యను పరిష్కరించగలదు. మద్యపానం తగ్గించడం దీనికి పరిష్కారం. ఆరోగ్యకరమైన ఆహారం(Healthy Food) తీసుకోవడం, ధ్యానం, యోగాభ్యాసం కూడా ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉపయోగపడతాయి.

రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర(8 Hours Sleep) సరిపోతుంది. అలా కాకుండా రోజుకు 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతే మాత్రం ప్రమాదమే. ఇలాంటి వాళ్లు గుండెపోటు(Heart Attack) ముప్పు 85 శాతం వరకూ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా నిద్రపోతే అంతర్గత అవయవాలైన కాలేయం, పేగుల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి కొవ్వు మీ జీవక్రియను దెబ్బతీసి అధిక కొలెస్ట్రాల్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులకు కారణమవుతుందని ఒబెసిటీ జర్నల్‌లోని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది.