Kulfi Recipe: వేసవి వచ్చేసిందిగా ఇంట్లోనే ఇలా కుల్ఫీ చేసి పిల్లలకు పెట్టేయండిUntitled Story
Kulfi Recipe: టేస్టీ కుల్ఫీలకు అభిమానులు ఎక్కువ. కుల్ఫీలు తింటుంటే నోట్లో కరిగిపోతాయి. కుల్ఫీలను కొనక్కర్లేదు... ఇంట్లోనే వీటిని సులువుగా తయారు చేయవచ్చు. కుల్ఫీ రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
Kulfi Recipe: వేసవి వచ్చిందంటే పిల్లలు ఐస్ క్రీమ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ప్రతిసారి బయటకు అని ఐస్ క్రీములు కన్నా ఇంట్లోనే మీరు కుల్ఫీలను తయారు చేసి పెడితే ఎంతో మంచిది సాదరణ ఐస్ క్రీమ్తో పోలిస్తే కుల్ఫీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కుల్ఫీలు ఇంట్లోనే చాలా సులువుగా చేయొచ్చు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి
బ్రెడ్‌తో చేసే కుల్ఫీ రెసిపీకి కావలసిన పదార్థాలు
మిల్క్ బ్రెడ్ ముక్కలు - రెండు
కండెన్స్ డ్ మిల్క్ - ఒక కప్పు
ఫ్రెష్ క్రీము - ఒక కప్పు
గోరువెచ్చని పాలు - ఒక కప్పు
యాలకుల పొడి - ఒక స్పూను
కుంకుమపువ్వు - రెండు రేకులు
బాదం, పిస్తా తరుగు - గుప్పెడు
బ్రెడ్‌తో చేసే కుల్ఫీ రెసిపీ
1. బ్రెడ్ అంచులను కట్ చేసి ఒక గిన్నెలో వేయండి. గోరువెచ్చని పాలను ఆ బ్రెడ్ పై పోయండి. అవి మెత్తగా నానిపోతాయి.
2. ఆ బ్రెడ్ ను మిక్సీలో వేసి మెత్తని మిశ్రమంలా చేసుకోండి. దానిలో పిస్తా, బాదం తరుగును వేయండి.
3. యాలకుల పొడిని కలపండి. కండెన్స్‌డ్ మిల్క్ కూడా వేసి బాగా కలపండి.
4. ఫ్రెష్ క్రీము, యాలకుల పొడి, తరిగిన బాదం పిస్తాలు వేసి బాగా కలపాలి.
5. కుంకుమ పూల రేకలను రెండు స్పూన్ల పాలల్లో నానబెట్టాలి. ఆ పాలను కూడా మిశ్రమంలో కలపాలి.
6. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లో ఫ్రిజ్లో 12 గంటల పాటు ఉంచండి.
7. తర్వాత మౌల్డ్స్ కాసేపు నీళ్లలో పెట్టి తీస్తే కుల్ఫీ బయటికి సులువుగా వచ్చేస్తుంది.
8. ఈ కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
ఈ కుల్ఫీలో మనం ఉపయోగించినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. పాలు, బాదం, పిస్తా, కండెన్స్‌డ్ మిల్క్, ఫ్రెష్ క్రీము, యాలకుల పొడి, కుంకుమపువ్వు... ఇవన్నీ కూడా మనకు ఏదో రకంగా ఆరోగ్యానికి మేలు చేస్తారు. మిల్క్ బ్రెడ్ లో కూడా పాలే ఉంటాయి. కాబట్టి రుచిగా ఉంటాయి. ఇందులో మనం పంచదారను కలపలేదు. పంచదార కలిపితే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కానీ మిల్క్ బ్రెడ్‌లో ఉన్న తీయదనమే ఈ కుల్ఫీకి సరిపోతుంది. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ఇంట్లో చేసి పెట్టండి... పిల్లలు పెద్దలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు.