World's costliest Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇది, కేజీ 30 వేల రూపాయలు
world's costliest Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఒకటి ఉంది. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదే వెదురు ఉప్పు. వెదురు కర్రలో చేసే ఉప్పు ఇది.

ఉప్పు చాలా చవకైన పదార్థం. కిలో కావాలంటే ఇరవై రూపాయలకే వచ్చేస్తుంది. నెల అంతా ఆ 20 రూపాయల ప్యాకెట్ సరిపోతుంది. అంత చవకైన ఉప్పును మనము వాడతాము. అయితే ప్రపంచంలోనే అతి ఖరీదైన ఉప్పు కూడా ఉంది. దీని కొనాలంటే ఒక కిలోకి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. దీని పేరు కొరియన్ బాంబూ సాల్ట్.
ఉప్పులో రకాలు
అనేక రకాల ఉప్పులు మార్కెట్లో ఉన్నాయి. తెల్ల ఉప్పు, నల్ల ఉప్పు, రాతి ఉప్పు ఊరగాయ ఉప్పు, పింక్ సాల్టు ఇలా ఎన్నో రకాలు వీటి ధరలన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. కానీ కొరియన్ బాంబూ సాల్ట్ ధర మాత్రం చాలా ఎక్కు.వ దీన్ని తయారు చేయడం కూడా కాస్త కష్టమైన ప్రక్రియగానే ఉంటుంది. అందుకే దీని ధర అధికంగా ఉంటుంది.
వెదురు కర్రలో ఉపయోగించి ఈ ఉప్పును అత్యంత ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు. ఈ ఉప్పు తయారీలో అనేక దశలు ఉంటాయి. వీటన్నింటినీ దాటాకే ఉప్పు బయటికి వస్తుంది. అందుకే దీని ధర కూడా అధికంగా నిర్ణయించారు.
ఖరీదైన కొరియన్ బాంబూ సాల్ట్ తయారు చేయడానికి 45 నుండి 50 రోజుల సమయం పడుతుంది. దీన్ని జుగ్యోమ్ అని కూడా పిలుస్తారు.
వెదురు ఉప్పు తయారీ ఇది
కొరియన్ వారి ప్రసిద్ధ ఉప్పు ఇది. వారు ఔషధ ప్రయోజనాల కోసం ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా వారు వెదురును ఉపయోగించి ఉప్పును తయారుచేస్తారు. ఈ ప్రత్యేక ఉప్పును తయారు చేయడం కోసం బోలుగా ఉండే వెదురు గొట్టాలను తీసుకుంటారు. అందులో సముద్రపు ఉప్పును నింపి రెండు చివరలు మూసివేస్తారు. ఆ వెదురు గొట్టాలను అధికమంటపై కాలుస్తారు. వెదురు నుండి వచ్చే ఖనిజాలన్నీ ఉప్పులోకి చేరిపోతాయి. ఆ వెదురును ఎనిమిది వందల నుండి 1500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. అధిక వేడి కారణంగా ఉప్పు చల్లబడిపోయి ద్రవ రూపంలోకి మారిపోతుంది. ఇలా తొమ్మిది సార్లు కాల్చే ప్రక్రియను పునరావృతం చేస్తూ ఉంటారు. అందుకే ఈ ఉప్పు ఉత్పత్తి కావడానికి చాలా సమయం పడుతుంది.
వెదురు ఉప్పులో ఉండే పోషకాలు
కొరియన్ వెదురు ఉప్పులో పొటాషియం, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. కానీ సాధారణ సముద్ర ఉప్పుతో పాటు మిగతా ఉప్పులో ఇలాంటి పోషకాలు ఏవి ఉండవు. కాబట్టే కొరియన్ వెదురు ఉప్పు ఎంతో ఆరోగ్యకరమైనది. ఖనిజాల కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టే ఈ కొరియన్ వెదురు ఉప్పు అధికంగా కొరియన్లు అమ్ముతూ ఉంటారు. అయితే ధనవంతులు మాత్రమే వీటిని కొనడం వాడడం వంటివి చేస్తారు.
సంబంధిత కథనం