అక్టోబర్‌లో ఏదైనా టూర్‌కు ప్లాన్ చేస్తున్నారా? ఈ స్పాట్స్‌పై ఓ లుక్కేయండి!-koli best places to visit during winters in uttarakhand ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Koli Best Places To Visit During Winters In Uttarakhand

అక్టోబర్‌లో ఏదైనా టూర్‌కు ప్లాన్ చేస్తున్నారా? ఈ స్పాట్స్‌పై ఓ లుక్కేయండి!

HT Telugu Desk HT Telugu
Oct 02, 2022 10:36 PM IST

ఖజ్జియార్, ఔలి. దేశంలోనే ఈ చల్లటి ప్రదేశాలలో పర్యటించే ప్రయత్నం చేయండి. దేశియ పర్యటకులే కాదు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఇక్కడి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు.

October Tourist Destinations:
October Tourist Destinations:

మీరు అక్టోబర్‌లో ఏదైనా టూర్‌కు ప్లాన్ చేస్తున్నారా? ఖచ్చితంగా భారతదేశంలోనే ఉన్న రెండు 'మినీ స్విట్జర్లాండ్'ను సందర్శించే ప్రయత్నం చేయండి. ఇక్కడి అందాలను పర్యటకులను మైమరింపజేస్తాయి. ఈ ప్రదేశాలను చూసిన తర్వాత, మీరు స్విట్జర్లాండ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు, ఇక్కడ అలాంటి అనుభూతిని పొందవచ్చు. ఖజ్జియార్, ఔలి. దేశంలోనే ఈ చల్లటి ప్రదేశాలలో పర్యటించే ప్రయత్నం చేయండి. దేశియ పర్యటకులే కాదు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఇక్కడి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. మీరు ప్రకృతి ప్రేమికులైతే, ఈసారి ఖచ్చితంగా ఈ రెండు ప్రదేశాలను సందర్శించండి.

ఔలి, ఉత్తరాఖండ్

ఔలి ఉత్తరాఖండ్‌లో ఉన్న ఒక హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 3,056 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ హిల్ స్టేషన్ బద్రీనాథ్ వెళ్ళే మార్గంలో ఉంది. 4 కి.మీ పొడవున్న ఆసియాలోనే అతి పొడవైన కేబుల్ కారు బ్రిడ్జ్ ఇక్కడ ఉంది. ఈ కేబుల్ కారులో కూర్చొని, పర్యాటకులు ఔలిలోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తారు. మంచుతో కప్పబడిన శిఖరాల దృశ్యాలను చూస్తారు. దేవదార్, పైన్ చెట్లు, యాపిల్ తోటలు ఈ హిల్ స్టేషన్ అందాన్ని ఇనుమడింపజేస్తాయి. ఔలి హిల్ స్టేషన్ దాని సహజ అందం కారణంగా భారతదేశంలోని 'మినీ స్విట్జర్లాండ్' అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుండి పర్యాటకులు అనేక పర్వత శ్రేణులను చూడవచ్చు.

ఖజ్జియార్

ఖజ్జియార్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ పర్యాటకులు అనేక అందాలను అస్వాదించవచ్చు. ప్రకృతిలో ఉండే అద్భుతమైన వీక్షణలతో పరవశించి పోవచ్చు. నిర్మలమైన వాతావరణం, చాలా దూరం వ్యాపించి ఉన్న పచ్చిక బయళ్ళు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. చుట్టూ దేవదారు వృక్షాలు, ఈ గిన్నెలాంటి మైదానంలో అందమైన సరస్సు కూడా ఉంది. దాని అంచున కూర్చొని మీరు ప్రశాంతమైన క్షణాలు గడపవచ్చు. ఖజ్జియార్‌ను చూసేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇది ధౌలాధర్ పర్వత శ్రేణిలో ఉన్న పీఠభూమి ప్రాంతం. పచ్చని గడ్డి పొలాలు చాలా దూరం విస్తరించి ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉన్న ఈ పర్యాటక ప్రదేశం సముద్ర మట్టానికి 1900 మీటర్ల ఎత్తులో ఉంది. డల్హౌసీ నుండి ఖజ్జియార్ వరకు దూరం కేవలం 24 కి.మీ. ఈ అందమైన ప్రదేశం పఠాన్‌కోట్ రైల్వే స్టేషన్ నుండి 95 కి.మీ, కాంగ్రా జిల్లాలోని గగ్గల్ విమానాశ్రయం నుండి 130 కి.మీ దూరంలో ఉంది. సర్ప దేవతకు అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ ఖజ్జీ నాగ దేవాలయం కూడా ఉంది. ఖజ్జి నాగ దేవాలయం కారణంగా ఖజ్జియార్ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఖజ్జియార్ అందాలు 'మినీ స్విట్జర్లాండ్' అని కూడా పిలుస్తారు. ఇక్కడ పర్యాటకులు పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్ చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం