Liver Cirrhosis: ఈ కాలేయ వ్యాది ఒక సైలెంట్ కిల్లర్, దీని లక్షణాలు తప్పకుండా తెలియాలి-know what is liver cirrhosis and about its symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Liver Cirrhosis: ఈ కాలేయ వ్యాది ఒక సైలెంట్ కిల్లర్, దీని లక్షణాలు తప్పకుండా తెలియాలి

Liver Cirrhosis: ఈ కాలేయ వ్యాది ఒక సైలెంట్ కిల్లర్, దీని లక్షణాలు తప్పకుండా తెలియాలి

Liver Cirrhosis Symptoms: కాలేయం శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, కానీ అది కొద్దిగా దెబ్బతిన్నాఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి కాలేయాన్ని దెబ్బతీసే లివర్ సిర్రోసిస్ గురించి తెల్సుకోవడం ముఖ్యం. దాని లక్షణాలు తెల్సుకోండి.

లివర్ సిర్రోసిస్ లక్షణాలు

శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా ఉంటేనే శరీరం సరిగ్గా పనిచేస్తుంది. కానీ ఏ అవయవంలోనైనా మొదట్లో వచ్చే మార్పులు మనం గుర్తించకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. గుండె లాగే కాలేయం కూడా ఒక ముఖ్యమైన అవయవం. అది చెడిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందులో ఒకటి లివర్ సిర్రోసిస్. ఇది మీ కాలేయాన్ని శాశ్వతంగా దెబ్బతీసే సమస్య. దీనివల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఈ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకోండి

లివర్ సిర్రోసిస్ అంటే ఏమిటి?

కాలేయ సిర్రోసిస్ అనేది కాలేయ వ్యాధి చివరి దశ. దీనిలో, ఆరోగ్యకరమైన కణజాలాలు నశిస్తాయి. ఇది దీర్ఘకాలికంగా ఉండే హెపటైటిస్ వల్ల వస్తుంది. కాలేయంలో వాపుకు కారణమవుతుంది. వాపు ఉన్నప్పుడు, కాలేయం స్వయంగా నయం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కువ కణజాలం దెబ్బతినడం వల్ల కాలేయం సరిగ్గా పనిచేయకుండా నిరోధిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక కాలేయ వైఫల్యం వస్తుంది.

లివర్ సిర్రోసిస్ ప్రారంభ లక్షణాలు ఏమిటి?

1) వికారం లేదా ఆకలి లేకపోవడం

2) బలహీనంగా లేదా అలసటగా అనిపించడం.

3) అనారోగ్యంగా అనిపించడం.

4) కడుపు పై భాగంలో నొప్పి.

5) అరచేతులు ఎరుపెక్కడం

లివర్ సిర్రోసిస్ సమస్య పెరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి:

1) చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి.

2) చర్మం దురదగా అనిపించడం

3) ముదురు రంగు మూత్రం, లేత రంగు మలం.

4) జీర్ణ సమస్యలు.

5) చర్మం లేదా కనురెప్పలపై పేరుకుపోయిన కొవ్వు.

6) బరువు తగ్గడం, కండరాల సమస్యలు

7) హెపాటిక్ ఎన్సెఫలోపతి

8) కండరాల నొప్పులు, వణుకు

9) నెలసరిలో మార్పులు.

లివర్ సిర్రోసిస్ కారణాలు:

1) హెపటైటిస్ బి అనేది వైరల్ ఇన్ఫెక్షన్, ఇది తక్కువ మందిలో దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. అదే జరిగితే జీవితాంతం ఇలాగే ఉంటుంది. ఇది నయం చేయదగినదే కానీ సమస్య మాత్రం పూర్తిగా తగ్గకపోవచ్చు.

2) హెపటైటిస్ సి అనేది వైరల్ ఇన్ఫెక్షన్, ఇది చాలా మందిలో దీర్ఘకాలికంగా మారుతుంది. యాంటీవైరల్ మందులతో నయం చేయగలిగినప్పటికీ, చాలా మంది తమకు ఈ వ్యాధి ఉందని గుర్తించరు.

3) కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం కూడా దీనికి కారణం కావచ్చు. ఇది అధిక రక్త లిపిడ్లు, రక్తంలో చక్కెర, రక్తపోటు వంటి జీవక్రియ కారణాలతో సంబంధం కలిగి ఉంటుంది.

4) అతిగా మద్యం సేవించడం వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది. అయితే ఆల్కహాల్ తీసుకోని వారికి కూడా ఈ సమస్య రావచ్చు.

కాలేయం దెబ్బతింటే కాలేయ మార్పిడి ఒక్కటే మార్గమని నివేదికలు చెబుతున్నాయి. ఇది చాలా ఖరీదుతో కూడుకున్న పని. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ కాలేయ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

సూచన: ఈ ఆర్టికల్ లో పేర్కొన్న లక్షణాలను సూచనలుగా మాత్రమే తీసుకోండి. అటువంటి చికిత్స/ఔషధం/ఆహారం మరియు సలహాను అనుసరించే ముందు డాక్టర్ లేదా నిపుణుడిని సంప్రదించండి.