Adult Acne: 30 ఏళ్ల తర్వాత మొటిమలు వస్తే నిర్లక్ష్యం వద్దు, కారణాలివే కావచ్చు-know what is adult acne and its cause and prevention ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Adult Acne: 30 ఏళ్ల తర్వాత మొటిమలు వస్తే నిర్లక్ష్యం వద్దు, కారణాలివే కావచ్చు

Adult Acne: 30 ఏళ్ల తర్వాత మొటిమలు వస్తే నిర్లక్ష్యం వద్దు, కారణాలివే కావచ్చు

Adult Acne: మొటిమలు 30 నుండి 35 సంవత్సరాల వయస్సులో రావడం కొందరిలో మొదలవుతుంది. ఇవి సాధారణంగా పరిగణించకూడదు. దానికి కారణాలు, నివారణ మార్గాలేంటో తెల్సుకోండి.

ముప్ఫై ఏళ్ల తర్వాత మొటిమల సమస్య (shutterstock)

టీనేజ్ వయసులో మొటిమలు,యాక్నె సమస్యలు సర్వసాధారణం. చాలా మంది టీనేజర్లు దీనితో ఇబ్బంది పడతారు. కానీ వయసు పెరిగేకొద్ది ఈ సమస్య తగ్గి చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారిపోతుంది. అయితే టీనేజ్ వయసులో కూడా ఎప్పుడూ మొటిమలు రాని వాళ్లకి 30 ఏళ్ల తర్వాత ముఖంపై మొటిమలు వచ్చి ఇబ్బంది పెడతాయి. మహిళల్లో ఈ సమస్య కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. వీటినే హార్మోనల్ యాక్నె అనీ అంటారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అవేం అయ్యుండొచ్చో వివరంగా తెల్సుకోండి.

మొటిమలకు కారణాలు:

హార్మోన్లు:

చాలాసార్లు మహిళల్లో ఈస్ట్రోజెన్, ఇతర హార్మోన్లు సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల అవి హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దీని వల్ల చర్మంపై మొటిమల సమస్య రావచ్చు. అలాగే ఏ పరిశోధనలోనూ ఇది స్పష్టంగా తెలియనప్పటికీ మైదా, చక్కెర, ఆవు పాలు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు వంటి కొన్ని ఆహారాలు మొటిమల సమస్యను పెంచుతాయి.

చర్మం రంధ్రాలు

చర్మం ఈ వయసులో కాస్త ఎక్కువ నూనెల్ని ఉత్పత్తి చేస్తుంటుంది. అప్పుడు అది చర్మ రంధ్రాలకు నిరోధకంగా మారుతుంది. దాని వల్ల మొటిమలు రావడం మొదలవుతుంది. అందుకే తప్పకుండా మొటిమల సమస్య ఉంటే నిద్రపోయే ముందు ముఖం కడుక్కోవడం ఉత్తమం. 

శారీరక ఒత్తిడి

శరీరం బాగా అలసిపోయి ఒత్తిడికి లోనైతే రోగనిరోధక శక్తి బలహీనపడి మొటిమల సమస్య రావచ్చు. కొన్నిసార్లు నిద్రలేమి, అనారోగ్యం, డీహైడ్రేషన్, కాలుష్యం వల్ల కూడా మొటిమలు రావడం మొదలవుతాయి.

మానసిక ఒత్తిడి

ఒత్తిడి కారణంగా శరీరంలోని జీవ గడియారంలో మార్పులు రావడం ప్రారంభమవుతుంది. దీనివల్ల వయోజన మొటిమల సమస్య పెరుగుతుంది. మీకు భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలుంటే అది కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెంచుతుంది. చర్మం మీద సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల మొటిమల సమస్య పెరుగుతుంది.

ఈ మొటిమలను ఎలా నివారించాలి?

  • ఆహారంలో మార్పులు చేయండి, కాయధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఆహారంలో చేర్చండి.
  • బాగా ఫ్రై చేసిన ఆహారాలకు, అధిక చక్కెరలుండే పదార్థాలకు దూరంగా ఉండండి.
  • తరచూ ఒత్తిడికి గురి కాకండి
  • వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగండి. హైడ్రేటెడ్ గా ఉండండి.
  • హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను తగ్గించుకోడానికి వ్యాయామాలను దినచర్యలో చేర్చుకోండి.

మొటిమలు చీము, గడ్డలతో పెద్దగా మారుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మాత్రం అవసరం.