Teddy Day 2025: మీ ప్రేయసికి టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇచ్చే ముందు ఏ రంగు టెడ్డీ బేర్ కు ఏం అర్థమో తెలుసుకోండి
Teddy Day 2025: ప్రేమికుల వారంలో నాలుగో రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు టెడ్డీ డేను నిర్వహించుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజునప్రేమికులు ఒకరికొకరు టెడ్డీలను బహుమతిగా ఇస్తారు. ఏ రంగు టెడ్డీకి ఏ అర్థమో తెలుసుకోండి.

వాలెంటైన్స్ వీక్ ను ప్రేమికులు ఆనందంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో నాలుగో రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు టెడ్డీ డేను జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున... ప్రేమికులు ఒకరికొకరు టెడ్డీలను బహుమతిగా ఇస్తారు. టెడ్డీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఉత్తమ మార్గంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి మీ భాగస్వామికి టెడ్డీని బహుమతిగా ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అలా చేయడానికి ముందు మీ భాగస్వామికి ఏ రంగు టెడ్డీ బేర్ బహుమతిగా ఇవ్వాలో ముందుగా తెలుసుకోండి. గులాబీల్లాగానే ఒక్కో రంగు టెడ్డీకి ఒక్కో రకమైన అర్థం ఉంది. కాబట్టి మీరు ముందుగా ఏ రంగు టెడ్డీకి ఏమి అర్థమో తెలుసుకోండి.
నీలం రంగు టెడ్డీ బేర్
టెడ్డీ డే రోజున బ్లూ టెడ్డీని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే మీరు మీ భాగస్వామిని చాలా ప్రేమిస్తున్నారని చెప్పడమే. మీ అనుభూతిని మీ భాగస్వామికి తెలియజేయడానికి, మీరు వారికి బ్లూ టెడ్డీని బహుమతిగా ఇవ్వవచ్చు.
ఆకుపచ్చ టెడ్డీబేర్
ఆకుపచ్చ టెడ్డీ బేర్ మీరు మీ ప్రేమికులకు ఇవ్వాలనుకుంటే .. దాని ద్వారా మీ ప్రేయసి మీకెంతో ఇష్టమని చెప్పడమే. మీరు ఎవరినైనా బాగా ఇష్టపడితే, టెడ్డీ డే రోజున వారికి ఆకుపచ్చ టెడ్డీని బహుమతిగా ఇవ్వండి.
రెడ్ టెడ్డీ బేర్-
ఎరుపు ఎప్పుడైనా ప్రేమకు చిహ్నమే. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా ఈ రోజున మీ ప్రేమను వ్యక్తపరచాలని ఆలోచిస్తుంటే, రెడ్ టెడ్డీ బేర్ కొనండి. ఎర్ర గులాబీకు ఎంత విలువ ఉందో.. ఎరుపు టెడ్డీకి కూడా అంతే విలువ ఉంది.
పింక్ టెడ్డీ బేర్
పింక్ టెడ్డీని బహుమతిగా ఇవ్వడం అంటే మీరు మీ స్నేహితుడిని డేటింగ్ గురించి అడగాలనుకుంటున్నట్టు. కాబట్టి మీరు మీ హృదయంలో ఎవరినైనా ప్రేమిస్తే, వారిని మీతో డేటింగ్ కు తీసుకెళ్లాలనుకుంటే, వారికి పింక్ టెడ్డీని బహుమతిగా ఇవ్వండి. మీతో డేటింగ్ కు వచ్చేందుకు వారికి ఇష్టమైతే వారు మీరిచ్చిన టెడ్డీని స్వీకరిస్తారు.
ఆరెంజ్ టెడ్డీ బేర్
ఆరెంజ్ కలర్ అంటే ఆనందం, సృజనాత్మకత, అభిరుచితో ముడిపడి ఉంటుంది. ఇది కూడా ప్రపోజ్ చేసే విధానం వేరు. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే, వారికి ఆరెంజ్ కలర్ టెడ్డీని బహుమతిగా ఇవ్వండి.
వైట్ టెడ్డీ బేర్
మీ స్నేహితుడికి తెలుపు టెడ్డీని బహుమతిగా ఇచ్చారంటే… మీరు ఇప్పటికే మరొక వ్యక్తికి కట్టుబడి ఉన్నారని, అతడి ప్రేమను ఒప్పుకోవడం లేదని అర్థం. అవతలి వ్యక్తితో మీరు స్నేహం మాత్రమే చేయాలనుకుంటున్నారని అర్థం.
పసుపు టెడ్డీ బేర్
పసుపు రంగు సాధారణంగా చాలా సానుకూలంగా పరిగణిస్తారుజ. కానీ పసుపు టెడ్డీని బహుమతిగా ఇవ్వడం అంటే మీరు ఇప్పుడు మీ భాగస్వామితో విడిపోవాలనుకుంటున్నారని అర్థం.
బ్రౌన్ టెడ్డీ బేర్
బ్రౌన్ టెడ్డీలు మార్కెట్లో అధికంగానే లభిస్తాయి. దీన్ని బహుమతిగా ఇవ్వడం అంటే మీ భాగస్వామి వల్ల మీ గుండె విరిగిపోయిందని అర్థం.
పర్పుల్ టెడ్డీ బేర్
ఊదా రంగు టెడ్డీని బహుమతిగా ఇవ్వడం అంటే మీరు మీ భాగస్వామితో విడిపోవాలనుకుంటున్నారని అర్థం. అతనికి ఇకపై మీపై ఆసక్తి లేదని. మీ మధ్య అనుబంధాన్ని తెంపుకుని ఇద్దరూ వేర్వేరు దారుల్లో నడవాలని అర్థం చేసుకోవాలి.
సంబంధిత కథనం