Foods in Fridge: మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి, ఆ చల్లని ఫుడ్‌ను తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి-know these things before you refrigerate leftovers and eat that cold food ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods In Fridge: మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి, ఆ చల్లని ఫుడ్‌ను తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

Foods in Fridge: మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి, ఆ చల్లని ఫుడ్‌ను తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Aug 14, 2024 02:30 PM IST

Foods in Fridge: చల్లని ఆహారం తినే అలవాటు మీకుంటే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యవిషయాలు కొన్ని ఉన్నాయి. ఇలా చల్లని ఆహారాన్ని తినే వ్యక్తులు త్వరగా అనారోగ్యానికి గురిచేస్తుంది. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ ప్రకారం, చల్లని ఆహారాన్ని తినడం వల్ల పొట్ట ఉబ్బరం, తిమ్మిరి వంటి పొట్ట సమస్యలు చికాకు కలిగిస్తాయి.

చల్లని ఆహారం తింటే ఈ ఎఫెక్టులు తప్పవు
చల్లని ఆహారం తింటే ఈ ఎఫెక్టులు తప్పవు (shutterstock)

కొందరు వేడివేడి భోజనం తినేందుకు ఇష్టపడతారు. మరికొందరు మాత్రం ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి ఆహారాన్ని అలానే తినేస్తూ ఉంటారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం చల్లటి ఆహారాన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వేడి ఆహారం తినడం వల్ల వచ్చే అనారోగ్యాలు చాలా తక్కువ. కానీ తరచూ చల్లటి ఆహారాన్ని తింటే మాత్రం త్వరగా అనారోగ్యం బారిన పడతారు. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ ప్రకారం, చల్లని ఆహారాన్ని తినడం వల్ల పొట్ట ఉబ్బరం, తిమ్మిరి వంటి పొట్ట సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకు చల్లని ఆహారం తినడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

చల్లని ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు మొదలవుతాయి. చల్లని ఆహారం తినడం వల్ల వ్యక్తులకు పొట్ట సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వేడి ఆహారం కడుపు నొప్పి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాంటి ఆహారం శరీరానికి చేరి సులభంగా జీర్ణమవుతుంది. చాలాసార్లు చల్లని ఆహారం తినడం వల్ల కడుపు తిమ్మిరిగా అనిపించడం ప్రారంభమవుతుంది. కాబట్టి పిల్లలకు కచ్చితంగా వేడి వేడి ఆహారాన్ని తినిపించాలి. చల్లని ఆహారాలు వారిలో పొట్ట ఆరోగ్యాన్ని చెడగొడతాయి. పొట్టలోని మంచి బ్యాక్టిరియా సమతుల్యతను ఈ చల్లటి ఆహారం దెబ్బతీస్తుంది.

బలహీనమైన జీవక్రియ

చల్లని ఆహారం తినడం వల్ల శరీర జీవక్రియ బలహీనపడుతుంది. వేడిగా అప్పుడు వండిన తాజా ఆహారాన్ని తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. వాస్తవానికి, చల్లని ఆహారాన్ని తినడం వల్ల ఆ ఆహారాన్ని వేడి చేయడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది కేలరీల బర్న్ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. కాబట్టి శరీరాన్ని కష్టపెట్టే చల్లటి ఆహారాలను తినకండి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఆహారాన్ని తిన్నా మంచిదే. లేదా వేడి వేడి ఆహారాన్ని వండవచ్చు.

గ్యాస్, ఉబ్బరం

చల్లని ఆహారం తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి. వాస్తవానికి, చల్లని ఆహారాన్ని, ముఖ్యంగా చల్లని ఆహారం తీసుకోవడం గ్యాస్, ఉబ్బరం సమస్యను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఫుడ్ పాయిజనింగ్

చల్లటి ఆహారంలో బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. వేడి ఆహారంలో బ్యాక్టీరియా పుట్టదు. చల్లని ఆహారం కంటే వేడి ఆహారాన్ని ఎక్కువ పోషకమైనదిగా భావిస్తారు. ఫ్రిజ్‌లో నిల్వ చేయబడిన చల్లని ఆహారాలు, ముఖ్యంగా చల్లని అన్నం తినడం వల్ల బాసిల్లస్ సెరియస్ వంటి హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది.

స్థూలకాయం

చల్లని లేదా ఫ్రిజ్‌లో ఆహారం తినడం జీర్ణక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఎన్నో రెట్లు శరీర బరువు కూడా పెరుగుతుంది. నిజానికి జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల కడుపులోని ఆహారం సకాలంలో జీర్ణంకాక బరువు పెరగడానికి కారణమవుతుంది.

టాపిక్