Sooji Potato Rolls: పిల్లలకు ఉప్మా నచ్చడం లేదా..? అయితే రవ్వతో ఇలా రోల్స్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు-know the perfect breakfast recipe with sooji and potato ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sooji Potato Rolls: పిల్లలకు ఉప్మా నచ్చడం లేదా..? అయితే రవ్వతో ఇలా రోల్స్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు

Sooji Potato Rolls: పిల్లలకు ఉప్మా నచ్చడం లేదా..? అయితే రవ్వతో ఇలా రోల్స్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు

Ramya Sri Marka HT Telugu
Dec 29, 2024 07:00 AM IST

Sooji Potato Rolls: ఉదయాన్నే ఏ హడావుడి లేకుండా సింపుల్‌గా అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఉప్మా ఒకటి. అయితే దీన్ని తినడానికి చాలా మంది పిల్లలు ఇష్టపడరు. అలాంటప్పుడు అదే రవ్వతో ఇలా రోల్స్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు.

రవ్వతో ఇలా రోల్స్ చేసి ఇవ్వండి
రవ్వతో ఇలా రోల్స్ చేసి ఇవ్వండి

ఉదయాన్నే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసి పెట్టడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద టాస్క్. రోజుకో వైరైటీ ఉంటే కానీ వాళ్లకు నచ్చదు. అందుకే పిల్లల కోసం రకరకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు తయారు చేసేందుకు తల్లలు తపన పడుతుంటారు. మీరు అలాంటి వారే అయితే మీకు ఈ రెసిపీ చాలా బాగా సహాయపడుతుంది. ఉప్మా రవ్వ బంగాళాదుంపలతో చేసే ఈ పదార్థం పిల్లలకు, పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.

yearly horoscope entry point

రోల్స్ కోసం కావలసిన పదార్థాలు..

  • 1.5 కప్పు ఉప్మా రవ్వ
  • 1.5 కప్పుల పెరుగు
  • 1/4 కప్పు నీరు
  • రుచికి తగినంత ఉప్పు
  • 1.5 టీస్పూన్ ఎనో పౌడర్

రోల్స్ లోపలి కర్రీకి కావాల్సిన పదార్థాలు

  • 2 కప్పులు ఉడికించిన బంగాళాదుంపలు
  • 1 టేబుల్ స్పూన్ నూనె
  • 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయలు
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 స్పూన్ ఆవాలు
  • 1 టీస్పూన్ జీరా
  • 1/2 స్పూన్ పసుపు పొడి
  • 1 స్పూన్ మిరప పొడి
  • 1 టీస్పూన్ ధనియాల పొడి
  • తరిగిన కొత్తిమీర ఆకులు

తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు

  • 1 స్పూన్ నూనె
  • 1/2 టీస్పూన్ ఆవాలు
  • 1/2 స్పూన్ పసుపు పొడి
  • 1 టీస్పూన్ ఎర్ర మిరప పొడి
  • 1 టీస్పూన్ తరిగిన కొత్తిమీర ఆకులు
  • 1/4 కప్పు నీరు

రవ్వ, బంగాళాదుంప రోల్స్ తయారీ విధానం:

  • ముందుగా ఒక గిన్నెలో ఉప్మా రవ్వ తీసుకుని దాంట్లో పెరుగు, ఉప్పు వేసి నీళ్లు పోసి చక్కగా కలపి పక్కకు పెట్టుకోండి.
  • ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె పోయాలి.
  • నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
  • ఇవి నూనెలో వేగిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న బంగాళాదుంపలను దాంట్లో వేసి వేయండి.
  • తరువాత దీంట్లో పసుపు, కారంపొడి, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  • బంగాళాదుంపలు చక్కగా ఉడికి వాటికి మసాలాలు అన్నీ పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి.
  • ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత వాటిని పొడవాటి ఉండలుగా చేయండి.
  • ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న రవ్వ మిశ్రమంలో కాస్త ఈనో పౌడర్ వేసి, నీళ్లు పోసి బాగా కలపండి.
  • తరువాత రెండు లేదా మూడు గ్లాసుల్లో ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసి ఒక్కో గ్లాసులో ఒక్కో బంగాళాదుంప ఉండను వేయండి.
  • బంగాళాదుంప ముద్దలు మొత్తం మునిగిపోయేలా వాటిపైన కూడా రవ్వ బ్యాటర్ తో కప్పేయండి.
  • ఇప్పుడు ఒక లోతు గిన్నె తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని వేడి చేయండి.
  • మరుగుతున్న నీటిలో ఈ గ్లాసులను పెట్టి ఇడ్లీలను ఉడికించినట్టుగా ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడికించండి. ఉడికిన తర్వాత వీటిని పక్కక్కు పెట్టేయండి.
  • ఇప్పుడు మరో ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె పోసి వేడిచేయండి.
  • నూనె వేడిక్కిన తర్వాత ఆవాలు, పసుపు, కారం వేసి దాంట్లో నాలుగు ఐదు స్పూన్ల నీటిని పోయండి.
  • ఈ నీళ్లు కాస్త వేడిక్కిన తర్వాత ఉడికించుకున్న రవ్వ బంగాళాదుంప రోల్స్ తీసుకుని వేయించుకోవాలి.
  • వీటిని గుండ్రంగా తిప్పుతూ బంగారు రంగులోకి వచ్చే వరకూ వేయించుకోవాలి.
  • తరువాత వీటిని తీసుకుని బంగాళాదుంపలను కట్ చేసినట్టుగా గుండ్రంగా కట్ చేసుకోవాలి.
  • అంతే రవ్వ రోల్స్ తయారయినట్టే. వీటిని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా తినచ్చు. సాయంత్రం స్నాక్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు. పిల్లలకు బాక్సుల్లో పెట్టి పంపించచ్చు. ఎప్పుడు చేసినా ఇది మీ ఇంట్లో వాళ్లకి, ముఖ్యంగా పిల్లలకు కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం