Baby Crying : పిల్లలు మళ్లీ మళ్లీ ఏడవడానికి కారణాలు ఏంటి? ఆకలి మాత్రం కాదు-know the meaning of baby crying parenting tips telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Crying : పిల్లలు మళ్లీ మళ్లీ ఏడవడానికి కారణాలు ఏంటి? ఆకలి మాత్రం కాదు

Baby Crying : పిల్లలు మళ్లీ మళ్లీ ఏడవడానికి కారణాలు ఏంటి? ఆకలి మాత్రం కాదు

Anand Sai HT Telugu
Oct 29, 2023 09:30 AM IST

Baby Crying Reasons : పిల్లలు ఏడ్చినప్పుడు.. ఆకలితో ఉన్నారని తల్లులు అనుకుంటారు. కొంతమంది పిల్లల ఏడుపును కూడా ఒక వ్యాధిగా భావిస్తారు. కానీ పిల్లలు నిరంతరం ఏడవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అవేంటో తెలుసుకోవాలి.

పిల్లల ఏడుపు
పిల్లల ఏడుపు (unsplash)

పిల్లలు ఏడవడం అనేది చాలా సాధారణమైన విషయం. చాలాసార్లు తల్లిదండ్రులను పిలవడానికి ఏడుస్తారు. కానీ మీ బిడ్డ ఎక్కువకాలం పాటు నిరంతరం ఏడుస్తుంటే వారి బాధను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు నిరంతరం ఏడుపు అనేక కారణాల వల్ల కావచ్చు.. కానీ అనారోగ్యం మాత్రమే కాదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.

చాలా సార్లు పిల్లలు బిగుతుగా ఉన్న బట్టలు ధరించడం వల్ల ఏడవడం మెుదలుపెడతారు. దాని గురించి అసౌకర్యంగా కూడా భావిస్తారు. పిల్లలకు ఎప్పుడూ వదులుగా ఉండే కాటన్ దుస్తులనే వాడండి. బాగా టైట్ దుస్తులు వేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు.

తల్లి ఏది తింటే అది నేరుగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే శిశువుకు పాలు ఇస్తారు. తల్లి ఎక్కువగా వేయించిన, మసాలా ఆహారాన్ని తింటే, అది పిల్లలను బాగా ప్రభావితం చేస్తుంది. అందుకే పిల్లలు ఏడుస్తారు. కడుపు నొప్పి, గ్యాస్ సమస్య రావొచ్చు.

అనేక సార్లు తెలిసి లేదా తెలియక బిడ్డకు తల్లి అతిగా తినిపిస్తుంది. అదే సమయంలో కొన్నిసార్లు పిల్లలకు హడావుడిగా తినిపిస్తారు. దీంతో అతిగా తినడానికి దారితీస్తుంది. దీని వల్ల పిల్లలకు కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ కారణంగా పిల్లలు ఏడుస్తుంటారు.

చిన్నపిల్లల ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి. చిన్నపాటి అజాగ్రత్త వల్ల వారి ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ ఉంది . ఎవరైనా అకస్మాత్తుగా పాపను చేయి లేదా మెడ ద్వారా ఎత్తినప్పుడు ఇటువంటి సమస్యలు సాధారణంగా సంభవిస్తాయి. కాబట్టి పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. శిశువు ఎముక జారిపోతే ఏడుస్తూనే ఉంటారు.

ఒక శిశువు ప్రతిరోజూ సాయంత్రం ఒకే సమయంలో ఏడుస్తుంటే, కడుపు నొప్పితో బాధపడుతూ ఉండవచ్చు. ఈ కారణంగా పిల్లలు కడుపు తిమ్మిరి, చాలా నొప్పిని అనుభవిస్తారు. చాలా మంది పిల్లలు మూడు నెలల పాటు ఇలా బాధపడుతుంటారు. దీంతో గంటల తరబడి ఏడుస్తారు.

WhatsApp channel