మన దక్షిణ భారత శైలి దేవాలయాలు చాలా అందంగా ఉంటాయి. వాటి శిల్పకళ నుండి గుడి వాతావరణం వరకు, మిగిలిన దేవాలయాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఉత్తర భారత గుడి వాతావరణానికి, మన గుళ్లల్లో ఉండే వాతావారణానికి చాలా తేడా ఉంటుంది. పూజా విధానాల నుంచి మొదలుకొని చాలా విషయంలో వేటికవే ప్రత్యేకం. అందుకే దక్షిణ భారత సంస్కృతిని ప్రతిబింబించే గుళ్లు మన దేశ రాజధాని డిల్లీలోనూ కనిపిస్తాయి. దక్షిణ భారత దేవాలయాల శిల్పకళ, వాస్తు పోలి ఉంటాయి. డిల్లీ వెళ్లినప్పుడు, డిల్లీ చుట్టుపక్కలా ఉండే వాళ్లు వీటిని తప్పకుండా సందర్శించాల్సిందే.
ఈ ఆలయం ఢిల్లీలోని పాలం రోడ్డులో ఉంది. దీనిని మలై ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది స్వామినాథుడికి అంకితం చేసిన దక్షిణ భారత సంస్కృతి ఆలయం. ఈ ఆలయం ప్రధానంగా దక్షిణ భారత నాగరికత, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.
ఇది విష్ణువు అవతారమైన తిరుపతి బాలాజీకి ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనిని ఢిల్లీ తిరుపతి బాలాజీ ఆలయం అంటారు. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నాలుగు సార్లు హారతి, భోగం సమర్పిస్తారు. అదే సమయంలో ప్రతి శుక్రవారం తిరుపతి బాలాజీకి అభిషేక దర్శనం చేసుకోవచ్చు.
ఆర్కే పురంలో ఉన్న అయ్యప్ప ఆలయం అయ్యప్ప స్వామికి అంకితం చేయబడింది. కేరళ తరహా పూజలు, ఆచారాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడి గుడి వాతావరణంతో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఈ గుడి మయూర్ విహార్ ఫేజ్ 1 మెట్రో స్టేషన్ సమీపంలో ఉంది. శ్రీ ఉత్తర గురువాయూరప్పన్, విష్ణువుగా కేరళలో ప్రధానంగా పూజలందుకుంటున్నాడు. గురువాయూరప్పన్ విగ్రహాన్ని కృష్ణుని తల్లిదండ్రులు వాసుదేవుడు, దేవకి పూజించారని చెబుతారు.
ఈ ఆలయం సందర్శించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మిక. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు ఈ గుడిలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు చేసే భక్తులకు భగవంతుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని చెబుతారు.