Jagannath Puri prasad list: జగన్నాథునికి ప్రతిరోజూ నివేదించే 56 రకాల ప్రసాదాలేంటో తెల్సా?
Puri chappan bhog list: జగన్నాథ్ పూరీలో శ్రీ కృష్ణునికి ప్రతిరోజూ 56 రకాల ప్రసాదాలు నివేదిస్తారు. ఆ ప్రసాదాలేంటో తెల్సుకోండి.
తోబుట్టువులను కొలిచే గుడి జగన్నాథ్ పూరీ. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కొలువై ఉన్నాడు. కలువ కళ్ల కృష్ణుణ్ణి కొలిచే జగన్నాథ్ పూరీ క్షేత్రం చార్‌దామ్ లలో ఒకటి. ఇక్కడి ఆ గోవర్దనుడికి నివేదించే చప్పన్ భోగ్‌కు ప్రత్యేకత ఉంది. చప్పన్ అంటే 56, భోగ్ అంటే ప్రసాదాలు.. ప్రతిరోజు జగన్నాథునికి 56 రకాల ప్రసాదాలు పెడతారు. ఆ ప్రసాదాలేంటో తెల్సుకోవాలని ఉంటే ఇది చదివేయండి.
ఇక్కడి దేవాలయ వంటగదిలో దాదాపు లక్షమందికి వంట చేసే సామర్థ్యం ఉంది. ప్రసాదాలన్నీ మట్టి కుండల్లో, పాత్రల్లో వండటం మరో ప్రత్యేకత.
చప్పన్ భోగ్ ప్రసాదాలు:
అన్నం ప్రసాదాలు:
- సాదా అన్న - అన్నం
2 దహీ పాఖాలా - పెరుగన్నం
3 కనిక- నెయ్యి, పంచదార కలిపి వండిన అన్నం
4 తాలి కిచుడి- పప్పులు, నెయ్యి, పంచదార కలిపి వండిన పసుపు రంగు అన్నం
5 అడ పాఖాలా- అల్లం రుచితో వండిన అన్నం
6 ఘీ అన్న - నెయ్యి కలిపిన అన్నం
7 మీఠా పాఖాలా - పంచదారతో వండిన అన్నం
8 ఒడియా పాఖాలా - నెయ్యి, నిమ్మరసం, ఉప్పు కలిపి వండిన అన్నం
9 కెచుడి - పప్పులతో వండిన అన్నం
స్వీట్స్:
10 ఖాజా - మైదాతో చేసి పంచదారా పాకంలో నానిన కరకరలాడే స్వీట్
11 గాజా - గోదుమలతో చేసే వంటకం
12 లాడూ - లడ్డు
13 జీరా లాడూ - జీలకర్ర, నిమ్మరసం, పంచదార, ఉప్పు రుచితో ఉండే లడ్డు
14 మగాజా లాడూ - శనగపిండి, పంచదార, నెయ్యి, పాలు కలిపి చసిన లడ్డు
15 మాతాపులి - నెయ్యి, అల్ం రుచితో చేసిన తీపి వంటకం
16 ఖురుమా- - గోధుమపిండి, పంచదార, నెయ్యి, ఉప్పుతో చేసిన స్వీట్
17 జగన్నాథ్ బల్లవ్ - గోధుమ, పంచదార, నెయ్యితో చేసిన నలుపు రంగు మిఠాయి
18 కాకరా - నెయ్యి, పంచదారా, కొబ్బరి తురుము, గోదుమపిండితో చేసిన మిఠాయి
19 లూని ఖురుమా - నెయ్యి, గోధుమ, ఉప్పుతో చేసిన ఉప్పు బిస్కట్లు
20 మారిచి లాడూ - గోధుమ, పంచదారతో చేసిన లడ్డు
పీఠా:
21 సువార్ పీఠా - గోధుమ, నెయ్యితో చేసే వంటకం
22 చడాయ్ లాడా - గోధుమ, నెయ్యి పంచదారతో చేసే వంటకం
23 ఝిల్లి బియ్యం - పిండి, నెయ్యి ,పంచదారతో చేసే వంటకం
24 కాంటి - బియ్యంపిండి, నెయ్యితో చేసే వంటకం
25 మండా - బియ్యం, కొబ్బరి, బెల్లం, నెయ్యితో చేసే రొట్టె లాంటి వంటకం
26 అమాలు - గోధుమ, నెయ్యి పంచదారతో చేసే వంటకం
27 పూరీ
28 లూచీ - మైదా, నెయ్యితో చేసే అట్టు
29 దహీ బరా- పెరుగులో నానబెట్టిన మినప్పప్పు వడలు
30 బరా - నెయ్యిలో వేయించిన మినప్ప్పు వడలు
31 అరిసా - అరిసెలు
32 త్రిపురీ- అరిసెల్లాంటి మరో వంటకం
33 రోసాపైక్ - గోదుమపిండి, నెయ్యితో చేసే వంటకం
పాలతో చేసేవి:
34 ఖీరీ - పాలు, పంచదార, బియ్యంతో చేసే డెజర్ట్
35 పాపుడి - పాల మీగడతో చేసే వంటకం
36 ఖువా - కోవా
37 రసబలి - పాలు, పంచదార, గోదుమపిండితో చేసే స్వీట్
38 టాడియా - పన్నీర్, పంచదార, నెయ్యితో చేసే వంటకం
39 చెన్నాఖాయి - పన్నీర్, పాలు, పంచదారతో
40 బాపుడి ఖాజా -మీగడ, పంచదార, నెయ్యి కలిపి చేసే స్వీట్
41 ఖువా మండ - పాలు, గోధుమపిండి, నెయ్యితో చేసేది
42 సారాపుల్లి - కోవా లాంటి మరో మిఠాయి
పప్పు, కూరలు:
43 బీరీ దాలి - మినప్పప్పుతో చేసే పప్పు
44 చనా దాలి - శనగలతో పప్పు
45 మీఠా దాలి- కందులతో చేసే తీపి పప్పు
46 ముగా దాలి - ఒడియా స్పెషల్ పప్పు
47 దాలామా - కూరగాయలు, పప్పులు కలిపి చేసే వంటకం
48 రైతా - ముల్లంగి, కీరదోస, ఉప్పు, పెరుగు చేసే రైతా
49 బేసర్ - ఆవపెట్టిన కొబ్బరి కూరగాయలతో చేసిన కూర
50 సాగా - ఆకుకూరలతో చేసే కూర
51 బైగిని - వంకాయతో చేసే వంట
52 గోటీ బైగానా - చిన్న వంకాయలు, కొబ్బరి గ్రేవీలో చేసే వంట
53 ఖాటా - మామిడి, ద్రాక్ష, యాపిల్ తో చేసే పుల్లటి వంటకం
54 మాహురా - ఒకరకమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
55 పీటా - వేప పూలతో చేసే వంటకం
56 పొటాలా రస - పర్వాల్ కూరగాయ, కొబ్బరి పాలతో చేసే గ్రేవీ కర్రీ