Milk myths: పాలు కఫాన్ని పెంచుతాయా? జలుబు, దగ్గు సమయంలో వీటిని తాగకూడదా?-know the link between milk and mucus do milk increase phlegm and mucus ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Milk Myths: పాలు కఫాన్ని పెంచుతాయా? జలుబు, దగ్గు సమయంలో వీటిని తాగకూడదా?

Milk myths: పాలు కఫాన్ని పెంచుతాయా? జలుబు, దగ్గు సమయంలో వీటిని తాగకూడదా?

Ramya Sri Marka HT Telugu
Jan 12, 2025 10:00 AM IST

Milk myths: పాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని తీసుకోవడం విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు వీటిని తాగకూడదని, ఇవి కఫాన్ని, శ్లేష్మాన్ని పెంచి సమస్యలను తీవ్రతరం చేస్తాయని నమ్ముతారు. ఇది నిజమేనా? తెలుసుకుందాం.

పాలు కఫాన్ని పెంచుతాయా? జలుబు, దగ్గు సమయంలో వీటిని తాగకూడదా?
పాలు కఫాన్ని పెంచుతాయా? జలుబు, దగ్గు సమయంలో వీటిని తాగకూడదా? (freepik)

పాలు ,పాల ఉత్పత్తులపై ఎప్పుడూ వివాదాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా జలుబు లేదా దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు. చాలామంది ఇలాంటి సమమాలల్లో పాలు తాగడం వల్ల కఫం లేదా శ్లేష్మం పెరుగుతుందని, తద్వారా జలుబు , దగ్గు తీవ్రత పెరిగిపోతుందని భావిస్తారు. అయితే, ఇదే నిజమేనా? పాలు కఫం, శ్లేష్మం పై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? జలుబు, దగ్గు సమయంలో పాలు తాగడం మంచిదా కదా? అనే విషయాల గురించి జరిపిన అధ్యయనాలు, పాలకూ, శ్లేష్మానికి మధ్య సంబంధం ఏంటి? విభిన్న ఫలితాలను కనుగొన్నాయి.అవేంటో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

yearly horoscope entry point

పాలకు , శ్లేష్మం ఉత్పత్తికి మధ్య సంబంధం ఏంటి:

పాలు ప్రత్యక్షంగా శ్లేష్మం ఉత్పత్తిని పెంచవు. పాలు నేరుగా శ్లేష్మ ఉత్పత్తిని పెంచవు. అయినప్పటికీ, కొంతమందికి పాలు, చీజ్ లేదా ఐస్ క్రీం వంటి పాల ఉత్పత్తులు తీసుకున్న తర్వాత గొంతులో చిక్కటి పదార్థం కఫం లేదా శ్లేష్మం అడ్డుకుంటున్న అనుభూతిని కలిగిస్తాయి. మరింత ఇబ్బందిగా ఫీలవుతారు.వాస్తవానికి ఇది శ్లేష్మం ఉత్పత్తి పెరగడం వల్ల కాదు, శ్లేష్మానికి పాలు అంటుకోవడం వల్ల గొంతులో జరిగే ప్రతిచర్య కారణంగా.

కొన్ని సందర్భాల్లో, పాలలోని ప్రొటీన్లు, ముఖ్యంగా కేసైన్, గొంతు లేదా నాసికా భాగాలలో తేలికపాటి తాపజనక ప్రతిస్పందనను కలిగిస్తుంది. ఇది శ్లేష్మం మందం అవడానికి కారణమవచ్చు. అలాగే కఫం పెరిగిన యొక్క అనుభూతిని ఇవ్వవచ్చు.

కొందరికి ఎందుకు ఇబ్బంది అవుతుంది?

లాక్టోస్ అనేది పాలలో ఉండే సహజ చక్కెర. కొంతమంది లాక్టోస్‌ను సరిగ్గా జీర్ణించుకోలేకపోతారు, ఈ కారణంగా వారు జలుబు, ముక్కు కారడం, ఎక్కువ కఫం వంటి లక్షణాలను అనుభవిస్తారు. పాలు తాగినప్పుడు తమ గొంతులో ఇరిటేషన్, గట్టిగా, శ్లేష్మం‌ అంటుకుపోయినట్లు ఫీలవుతారు.

శ్వాస సంబంధిత ఆరోగ్యంపై ప్రభావం:

సాధారణంగా, పాలు, పాల ఉత్పత్తులు శ్లేష్మం పెరుగుదలకు కారణం కావు. వీటిలో ఉండే కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి, ఇవి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయినప్పటికీ జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు లేదా సున్నితత్వం ఉన్నవారికి, వారి భావాలను మరింత తీవ్రతరం చేస్తుంది..

జలుబు , దగ్గు సమయంలో పాలు తాగకూడదా?

1. పాలు వల్ల ఎలర్జీ ఉన్నవారు:

కొంతమందికి పాలు, పాల పదార్థాలు అస్సలు పడవు. దీన్నే అలెర్జీ, మిల్క్ సెన్సిటివిటీ అని పిలుస్తారు. ఇలాంటి వారు జలుబు, దగ్గు ఉన్నప్పుడు పాలను తీసుకోవడం మంచిది కాదు. ఇవి మీ గొంతులో ఇరిటేషన్ ను, పెంచుతాయి.కఫం, శ్లేష్మం పెరగడాన్ని సులభతరం చేస్తాయి.కనుక జలుబు దగ్గు వంటి సమస్యలున్నప్పుడు వీటికి దూరంగా ఉండటమే మంచిది. బదులుగా బాదం పాలు, ఓట్ మిల్క్ వంటి పాలేతర ప్రత్యామ్నాయాలన తీసుకోవడం ఉత్తమం.

2. పాల సున్నితత్వాలు లేని వారు:

సాధారణంగా మీకు పాలు తగిన పదార్థమే అయితే వీటి వల్ల మీకు ఎలాంటి అలెర్జీ, సెన్సిటివిటీ వంటి సమస్యలు లేనట్టయితే జలుబు లేదా దగ్గు సమయంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఉండకపోవచ్చు. వాస్తవానికి, పాలు మీ శరీరానికి హైడ్రేషన్, పోషణను అందిస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు . తేనె లేదా పసుపుతో కూడిన గోరువెచ్చని పాలు తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు సమస్య తగ్గుతుంది. పాలలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి.

పాలు తాగడం ఎప్పుడు ఆపేయాలి?

జలుబు, దగ్గు ఉన్నప్పుడు పాలు తాగిన తర్వాత మీకు కఫం పెరుగుతున్నట్లు, శ్లేష్మం అడ్డుకుంటున్నట్లు అనిపిస్తే మీరు కోలుకునే వరకూ వాటికి దూరంగా ఉండటమే మంచిది.

పాలు తాగిన తర్వాత మీకు దగ్గు, తుమ్ములు పెరిగి గొంతులో ఇబ్బందిగా అనిపిస్తే పాలు తాగడాన్ని తగ్గించండి.

హైడ్రేషన్ ఆవశ్యకత:

జలుబు లేదా దగ్గు సమయంలో, శరీరానికి తేమ చేర్చడం చాలా ముఖ్యం. పాలు తాగడం వల్ల ఇబ్బందులు తలెత్తినప్పడు తేమ పొందడానికి గోరువెచ్చటి నీళ్లు, తెనె కలిపిన పానీయాలు, హెర్బల్ టీలను తీసుకోవచ్చు. ఇవి గొంతుకు ఉపశమనం ఇస్తాయి , కఫం తగ్గించడంలో సహాయపడతాయి.

Whats_app_banner