గుడ్లు తినడానికి సరైన పద్ధతి ఏంటి? ఎటువంటి సమయంలో గుడ్లు తినకూడదు?-know the correct way to eat eggs when should you not eat eggs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  గుడ్లు తినడానికి సరైన పద్ధతి ఏంటి? ఎటువంటి సమయంలో గుడ్లు తినకూడదు?

గుడ్లు తినడానికి సరైన పద్ధతి ఏంటి? ఎటువంటి సమయంలో గుడ్లు తినకూడదు?

Ramya Sri Marka HT Telugu

మనలో చాలా మందికి గుడ్లను ఉడకబెట్టుకుని తింటే ఆరోగ్యానికి మంచిదదని తెలుసు. కానీ, అదొక్కటే కాదు, గుడ్ల ద్వారా శరీరానికి ఆరోగ్యం దక్కాలంటే, సరైన ప్రొటీన్ ఫఉడ్ అందాలంటే ఇంకొన్ని విధాలుగా కూడా తీసుకోవచ్చట.

గుడ్డును ఎలా తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్లలో ముందుండేది గుడ్లు. వీటిల్లో పుష్కలంగా ప్రొటీన్ ఉండటంతో పాటు పోషకాలు కూడా ఉంటాయి. కానీ, గుడ్లను ఏ రకంగా తీసుకున్నా మంచిదేనని అనుకోకూడదు. ముఖ్యంగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి జరిగే మంచి కంటే చెడే ఎక్కువ. ఇంతేకాకుండా మరికొన్ని విధాలుగా కూడా గుడ్లను తీసుకోవడం ప్రమాదకరమట. మరి గుడ్లను సరైన విధానంలో తినడం ఎలా? ఎన్ని విధాలుగా తినకపోవడం ఉత్తమం?

గుడ్లు తినడం ఆరోగ్యకరమేనా?

ప్రొటీన్లతో పాటు పోషకాల అందించడంలో గుడ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. అధిక మొత్తంలో ప్రొటీన్, విటమిన్లు, పోషకాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన రీతిలో గుడ్లను తీసుకోవడం ఎలాగో తెలుసుకుందామా..

గుడ్లను తీసుకుంటే గుండెకు చాలా మంచిది. గుడ్లలో ఉండే ఎమినో యాసిడ్లు ఎక్కువగా ఉండటంతో పాటు విటమిన్ బీ12, డీ, ఏ, ఈ లతో పాటు కొలైన్ కూడా శరీరానికి అందుతుంది. ఇది మెదడు పనితీరుకే కాకుండా అభివృద్ధి చెందడానికి కూడా తోడ్పడుతుంది. ఇంకా గుడ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అయిన ల్యూటీన్, జీక్సాంథిన్ కంటి ఆరోగ్యానికి సహకరిస్తుంది.

గుండె ఆరోగ్యం:

గుడ్లు ఆరోగ్యకరమైన పద్ధతిలో తినడం వల్ల HDL (ఆరోగ్యకరమైన కొవ్వు) అందుతుంది. ఇది గుండె ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. మీరు గుండె ఆరోగ్యం కోసమే గుడ్లు తినాలని అనుకుంటే లిమిటెడ్ గా మాత్రమే తినాలి. అంటే రోజుకొక గుడ్డు తినడం మంచిది.

సరైన బరువు:

బరువును సరిగ్గా మెయింటైన్ చేయడానికి గుడ్లు బెస్ట్ ఆప్షన్. కానీ, షుగర్ ఉన్నవాళ్లు లేదా గుండె జబ్బులు ఉన్న వారు గుడ్లలోని పచ్చసొన తినకపోవడం చాలా మంచిది. అది కూడా వారానికి పచ్చసొన లేకుండా 3 నుంచి 4 మాత్రమే తీసుకోవాలి.

ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్లను ఎలా తీసుకోవాలి?

ఉడకబెట్టిన గుడ్లు:

కోడిగుడ్లను బాగా ఉడకబెట్టుకుని లేదా సగం ఉడకబెట్టుకుని తినొచ్చు. వీటిల్లో కేలరీలు తక్కువగా ఉండి అధిక ప్రొటీన్ అందడంతో పాటు ఎటువంటి కొవ్వులు శరీరంలో చేరవు. ఎటువంటి నూనెలను చేర్చకుండా ఉడకబెట్టుకుని తినడం వల్ల గుడ్లలో ఉండే ప్రొటీన్లు, పోషకాలు తొలగిపోకుండా ఉంటాయి. ఇంకా గుడ్లు తినడానికి ఇదొక వేగవంతమైన ఆప్షన్ కూడా.

గుడ్డుసొన ఉడకబెట్టడం:

గుడ్డును పెంకుతో పాటు ఉడకబెట్టుకోవడమే కాకుండా మరొక ఆరోగ్యకరమైన ఆప్షన్ ఏంటంటే అందులోని సొనను ఉడకబెట్టుకోవడం. ఇలా తినడం వల్ల కూడా ఎటువంటి కొవ్వులు యాడ్ అవకుండా తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. ఇంకా ల్యూటీన్, జీక్సాంథిన్ లు శరీరానికి అంది కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.

ఎగ్ బుజ్జి:

కొద్దిపాటి ఆయిల్‌తో కూరగాయలు (ఆకుకూర, టమాటాలు, కాప్సికం)లు చేర్చుకుని ఎగ్ బుజ్జి చేసుకోవడం చాలా మంచిది. ఇలా తినడం వల్ల ఫైబర్ అధికంగా అందడంతో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. కానీ, ఇలా చేసేటప్పుడు స్టవ్ మంట చాలా చిన్నగా ఉంచాలనే విషయం మర్చిపోకండి. ఎక్కువ వేడి లేకుండా వంట చేయడం వల్ల పోషకాలు కోల్పోకుండా ఉంటాయి.

కూరగాయలతో ఆమ్లెట్:

గుడ్డు సొనను కూరగాయలతో కలిపి ఆమ్లెట్ గా వేసుకోవడం వల్ల పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. తక్కువ రైస్ తో పాటుగా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడ పోషకాలు అందుతాయి. వీటితో పాటు కాస్త మసాలా పొడులు వేసుకోవడం వల్ల ఎక్స్‌ట్రా ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి.

ఇవేకాకుండా కోడి గుడ్లను సలాడ్ రూపంలో, బేక్ చేసుకుని, చపాతీలో హాఫ్ బాయిల్డ్ సొనను పోసుకుని, మైనీస్ రూపంలో తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అందుతాయి.

గుడ్లను ఏయే విధంగా తినకూడదు?

పచ్చి లేదా సరిగ్గా ఉడికించని గుడ్లు: ఇలా తినడం వల్ల సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

డీప్-ఫ్రై చేసిన గుడ్లు: వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

అతిగా ఉడికించిన ఉడికించిన గుడ్లు: ఇది పోషకాలను తొలగించడంతో పాటు గుడ్డులోని తెల్లభాగం పాడై తినడానికి ఇబ్బందికరంగా మారుస్తుంది.

అదనపు వెన్న/నూనెతో చేసిన గుడ్లు: సంతృప్త కొవ్వును పెంచుతుంది.

ప్రాసెస్ చేసిన మాంసాలతో చేసిన గుడ్లు: వీటిలో సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.

మళ్లీ వేడి చేసిన గుడ్లు: ఇది ప్రోటీన్ విలువను, పోషక స్థాయిలను మార్చవచ్చు.

గుడ్ల పచ్చడి: అధిక సోడియం కంటెంట్ కారణంగా ఇది అనారోగ్యకరమైనది.

ప్రాసెస్ చేసిన ఆహారాలలో గుడ్లు: ఇవి అనారోగ్యకరమైన కొవ్వులు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను పెంచుతాయి..

గది ఉష్ణోగ్రత వద్ద వదిలిన గుడ్లు: బ్యాక్టీరియా కాలుష్యం ప్రమాదం ఉంటుంది.

కాల్చిన గుడ్లు: ఇది హానికరమైన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం