Friendships: స్నేహబంధం ఇప్పటిది కాదు..పురాణాల్లోను మనకు తెలియని స్ఫూర్తిదాయక స్నేహాలున్నాయ్-know the best and inspiring friendship bond from indian mythology ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friendships: స్నేహబంధం ఇప్పటిది కాదు..పురాణాల్లోను మనకు తెలియని స్ఫూర్తిదాయక స్నేహాలున్నాయ్

Friendships: స్నేహబంధం ఇప్పటిది కాదు..పురాణాల్లోను మనకు తెలియని స్ఫూర్తిదాయక స్నేహాలున్నాయ్

Koutik Pranaya Sree HT Telugu
Aug 04, 2024 03:30 PM IST

Friendship day 2024: శ్రీకృష్ణుడు, సుధామ నుండి శ్రీరాముడు సుగ్రీవుడి వరకు, భారతీయ పురాణాల నుండి మనం తెలుసుకోవలసిన కొన్ని స్నేహాబంధాలు తెల్సుకోండి.

పురాణాల్లో స్నేహబంధాలు
పురాణాల్లో స్నేహబంధాలు (Pinterest)

స్నేహబంధాన్ని ప్రతిరోజూ గుర్తు చేసుకోవాలి. భారతీయ పురాణాలలో, అవతలి వ్యక్తి సంతోషంగా, సురక్షితంగా ఉండేలా చూడటానికి హద్దులు దాటిన స్నేహ బంధాల కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు_ సుధాముడు, రాముడు- సుగ్రీవుడి నుంచి కర్ణుడు-దుర్యోధనుడి వరకు ఈ స్నేహాలు అందమైనవి, స్ఫూర్తిదాయకమైనవి. ఆ బంధాల గురించి తెల్సుకోండి.

శ్రీకృష్ణుడు, సుదాముడు:

భారతీయ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన స్నేహాలలో ఒకటి శ్రీకృష్ణుడు, సుదాముడి స్నేహబంధం. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, ఆప్యాయత వల్ల కులం, మతం, సామాజిక హోదా సరిహద్దులను దాటింది. ఈ చిన్ననాటి స్నేహితులు వారి సామాజిక స్థితిగతులలో చాలా భిన్నంగా ఉండేవారు. సుదాముడు పేద బ్రాహ్మణుడు కాగా, శ్రీకృష్ణుడు రాజు. అయితే ఇది వారి స్నేహానికి ఎప్పుడూ అడ్డుకాలేదు.

శ్రీరాముడు, సుగ్రీవుడు:

శ్రీ రాముడు, సుగ్రీవులు హనుమంతుడి ద్వారా కలుసుకున్నారు. ఒక విపత్కర సమయంలో వారి స్నేహం చిగురించింది. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు, సీతాదేవి జాడ కనిపెట్టడంలో సహాయం చేస్తానని సుగ్రీవుడు శ్రీరామునికి వాగ్దానం చేశాడు. అందుకు ప్రతిఫలంగా శ్రీరాముడు సుగ్రీవుడికి తన సోదరుడు వాలి నుండి తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి సహాయం చేసాడు.

కర్ణుడు, దుర్యోధనుడు:

దుర్యోధనుడు తన స్వలాభం కోసం కర్ణుడితో స్నేహం చేశాడని చరిత్ర విమర్శిస్తుంది. అయితే హస్తినాపురం కులవివక్షతో కూరుకుపోయినప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజును చేశాడు.

శ్రీకృష్ణుడు, అర్జునుడు:

కృష్ణార్జునులు
కృష్ణార్జునులు (Pinterest)

శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి మార్గనిర్దేశం చేశాడు. యుద్ధభూమిలో అర్జునుడితో పంచుకున్న జీవన్మరణాలకు సంబంధించిన ఉపదేశాలే భగవద్గీతకు బలమైన కథనంగా మారాయి.

శ్రీకృష్ణుడు, ద్రౌపది:

హిందూ పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడి వేలికి గాయం అయితే , అది చూసిన ద్రౌపది తన చీర చించి కృష్ణుడు చేతికి కడుతుంది.ఆమె గుణానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు ఆమెకు రక్షగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. రాజసభలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడుతూ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.

టాపిక్