Dengue Recovery : ఈ రెండు తీసుకుంటే డెంగ్యూ నుంచి త్వరగా బయటపడొచ్చు
kiwi fruit and coconut water for Dengue recovery : డెంగ్యూతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న రోగులు ప్లేట్‌లెట్లను పెంచడానికి కివి, కొబ్బరినీళ్లు చాలా ఉపయోగపడుతాయి.ii
డెంగ్యూ, టైఫాయిడ్ కారణంగా ప్లేట్‌లెట్స్ వేగంగా పడిపోతాయి. దీంతో ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. కొబ్బరి నీళ్లు(Coconut Water), కివీ పండు(Kiwi Fruit), మేక పాలు ప్లేట్‌లెట్లను పెంచడంలో చాలా సాయంగా ఉంటాయి. దీంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. కివి, కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల డెంగ్యూ(Dengue) నుండి త్వరగా ఎలా కోలుకుంటారో చూద్దాం..
ప్లేట్‌లెట్స్ తగ్గితే త్వరగా కోలుకోవడానికి సహాయపడే వాటిలో కివి పండు ఒకటి. ఇందులో విటమిన్ సి(Vitamin C), విటమిన్ ఇ, పొటాషియం, ఫైబర్(Fiber) వంటి మంచి పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు డెంగ్యూ లక్షణాలను(Dengue Symptoms) తగ్గించడంలో సహాయపడతాయి. కివిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కెరోటినాయిడ్స్, ఐరన్‍ను పెంచుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి(Immunity) కారణంగా చాలా మంది డెంగ్యూ రోగులు ఆస్తమాతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు కివీని తింటే అది మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. సరిగ్గా పనిచేయడంలో కూడా సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లలో శరీరానికి తక్షణ శక్తిని అందించే అనేక పోషకాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. డెంగ్యూ సమయంలో రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి కొబ్బరి నీళ్లను ఉత్తమంగా పరిగణిస్తారు. నిపుణుల ప్రకారం, కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్‌తో పాటు సోడియం, కాపర్ పెద్ద మొత్తంలో ఉంటాయి.
డెంగ్యూ రాకుండా ఉండేందుకు మార్గాలు
ఇంటి చుట్టూ లేదా ఇంటి లోపల కూడా నీరు పేరుకుపోకూడదు. కుండలు, కూలర్లు లేదా నిల్వ చేసిన టైర్లలో నీరు నిండితే, వెంటనే దానిని తీసేయండి. శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కూలర్‌లో నీళ్లు ఉంటే అందులో కిరోసిన్ ఆయిల్ వేస్తే దోమలు వృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయి.
నీటి ట్యాంకులను తెరిచి ఉంచవద్దు, వాటిని బాగా కవర్ చేయాలి.
ఫుల్ స్లీవ్‌లు ఉన్న దుస్తులను ధరించండి. మీ కాళ్ళను వీలైనంత వరకు కప్పుకోండి. దోమల నివారణ క్రీమ్ రాసుకున్న తర్వాతే పిల్లలను బయటకు పంపాలి.
డెంగ్యూ వస్తే వీలైనంత ఎక్కువ నీరు, ద్రవాలు తీసుకోండి. తేలికైన, సరళమైన ఆహారాన్ని తినండి. కెఫిన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉండండి. వైద్యుని సంప్రదించకుండా మందులు తీసుకోవద్దు.
ఆస్పిరిన్ లేదా బుప్రోఫెన్ తీసుకోవడం మానుకోండి. వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. పరిస్థితి విషమంగా ఉంటే ఆసుపత్రిలో చేరండి, తద్వారా ప్లేట్‌లెట్స్ తగ్గకుండా నిరోధించవచ్చు.