Sleep Talk With kids: పిల్లలు నిద్రపోతున్నప్పుడు వారితో మాట్లాడటం చాలా మంచిది! ఎందుకో తెలుసా?-know the amazing benefits of talking to a child during sleep ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep Talk With Kids: పిల్లలు నిద్రపోతున్నప్పుడు వారితో మాట్లాడటం చాలా మంచిది! ఎందుకో తెలుసా?

Sleep Talk With kids: పిల్లలు నిద్రపోతున్నప్పుడు వారితో మాట్లాడటం చాలా మంచిది! ఎందుకో తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Jan 13, 2025 10:30 AM IST

Sleep Talk With kids: పిల్లలలో మంచి అలవాట్లను పెంపొందించడానికి, ముఖ్యంగా వారు మీ మాట వినేలా చేయడానికి పగలు కన్నా రాత్రి సమయం మంచిదని మీకు తెలుసా? తాజా అధ్యయనాల ప్రకారం పిల్లలు నిద్రపోతున్నప్పుడు తల్లిదండ్రులు వారితో మాట్లాడటం చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. అవేంటో, ఎలాగో తెలుసుకుందాం రండి.

పిల్లలు నిద్రపోతున్నప్పుడు వారితో మాట్లాడటం చాలా మంచిది! ఎందుకో తెలుసా?
పిల్లలు నిద్రపోతున్నప్పుడు వారితో మాట్లాడటం చాలా మంచిది! ఎందుకో తెలుసా?

పిల్లలు బుద్ధిగా ఉండాలనీ, చెప్పిన మాట వినాలనీ ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందుకోసం రోజంతా చాలా సార్లు వారికి అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు అని సలహాలు, సూచనలూ ఇస్తూనే ఉంటారు. విసుగు వచ్చి తిడుతుంటారు, కొందరైతై కొట్టెస్టారు కూడా. మీరు కూడా మీ పిల్లల పట్ల ఇవన్నీ చేసి విసిగిపోయారా? వారిలో మంచి అలవాట్లు, అభిరుచులను పెంపొందించలేకపోతున్నామని బాధపడుతన్నారా? అయితే ఇది మీ కోసమే.

ఇప్పటి వరకూ మీరు పిల్లలకు వారు ఏం చేయాలి, ఎలా ఉండాలి వంటి విషయాల్లో సలహాలు, సూచనలు వారు మెలకువగా ఉన్నప్పుడు, పనుల్లో బిజీగా ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చి ఉంటారు. కానీ వారు నిద్రపోతున్నప్పుడు వారికి మంచి మాటలు ఎప్పుడైనా చెప్పారా..? అదీ వారు డీప్‌స్లీప్‌లోకి అంటే పూర్తిగా అపస్మారకస్తితిలోకి వెళ్లినప్పుడు వారితో ఎప్పుడైనా మాట్లాడి చూశారా? ఇప్పటి వరకూ పిల్లలు నిద్రపోతున్న సమయంలో వారితో మీరు మాట్లాడి ఉండకపోతే ఇకపై ప్రారంభించండి. ఎందుకుంటే ఇలా చేయడం వల్ల పిల్లలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

నిద్రపోతున్నప్పుడే ఎందుకు?

పిల్లల మనసు చాలా సున్నితమైనది. అంతేకాదు చెడుకి ఇట్టే ఆకర్షితమవుతుంది. ఇదంతా వాళ్లు మెళుకువగా ఉన్నప్పుడే మాత్రమే అనుకుంటే పొరపాటే. నిద్రపోతున్నప్పుడు పిల్లల బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుందట. ఈ సమయంలో వారి చెవిన పడ్డ మాటలు కంప్యూటర్ సేవ్ అయినట్లుగా వారి బ్రెయిన్ లో ఎప్పటికీ ఉండిపోతాయట. అందుకే మీరు వారి మంచి కోసం చెప్పాలనుకునే చాలా విషయాలను, వారిలో మీరు కోరకునే మార్పులను నిద్రలో వారితో చెప్పడం వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చట. పిల్లలు నిద్రలో ఉన్నప్పుడు వారితో ప్రేమగా మాట్లాడటం వల్ల వారి భావోద్వేగాలు , చదువు , అచేతన మనసు (subconscious mind) మీద మంచి ప్రభావం చూపుతుంది. ఇది వారికి ఆత్మవిశ్వాసం పెరగడంలో, తనదైన గుర్తింపు పొందడంలో, ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దీని వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రం ప్రయోజనాలు వివరంగా చూద్దాం.

పిల్లలు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ల మెదడు ఎలా పనిచేస్తుంది?

పిల్లలు నిద్రలో ఉన్నప్పటికీ, వాళ్ల మెదడు REM (Rapid Eye Movement) అనే దశలో క్రియాశీలంగా (active) ఉంటుంది. ఈ సమయంలో వాళ్ల అచేతన మనసు (subconscious mind) వారి చుట్టూ జరిగే మృదువైన శబ్దాలను గ్రహించగలదు.

మీరు పిల్లలతో సున్నితంగా, ప్రేమతో మాట్లాడినప్పుడు, ఆ మాటలు వారి అచేతన మనసులో నిలుస్తాయి. ఇవి వారి అలోచనలను, వ్యవహారాన్ని ప్రేరేపిస్తాయి.

పిల్లలతో నిద్రలో మాట్లాడటం వల్ల వచ్చే ప్రయోజనాలు:

1. భావోద్వేగ స్థిరత్వం (Emotional Reassurance):

పిల్లల నిద్రలో మీరు వారితో ప్రేమతో, సానుభూతితో మాట్లాడితే వారు చాలా సురక్షితంగా ఫీలవుతారు. మీరు వారిని చాలా ప్రేమిస్తున్నారనే భావన పొందుతారు. ఇది వారికి చాలా సంతోషాన్ని ఇస్తుంది.

ఉదాహరణకు:

"నువ్వుంటే నాకు చాలా చాలా ఇష్టం."

"నువ్వు మాకు ఎంతో ప్రత్యేకమైనవాడివి."

"నువ్వు ఎప్పటికీ మా దగ్గరే సురక్షితంగా ఉంటావు."

2. అవగాహన కలిగించటం (Positive Behavior Reinforcement):

నిద్రపోతున్నప్పడు వారిలోని మంచి అలవాట్ల గురించి మాట్లాడటం, వారిని పొగడటం వల్ల వాటి వారిలో సానుకూల ప్రవర్తన రెట్టింపవుతుంది.

ఉదాహరణకు:

"నువ్వు చాలా మంచివాడివి లేదా మంచిదానివి,"

"నువ్వు చాలా చక్కగా ప్రవర్తిస్తావు,"

"నీకు మంచి ఆలోచనలు ఉన్నాయి"

3. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం (Building Confidence):

మెలకువగా ఉన్నప్పటి కన్నా వారు నిద్రలో ఉన్నప్పుడు వారితో కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పడం వల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వారి మీద వారికున్న నమ్మకం రెట్టింపవుతుంది.

ఉదాహరణకు:

"నువ్వు ఏదైనా సాధించగలవు."

"నువ్వు చాలా తెలివైనవాడివి."

"ఎప్పుడూ నీ ప్రయత్నాలు వదులుకోవద్దు."

4. ఆందోళన, ఒత్తిడిని తగ్గించడం (Reducing Anxiety and Stress):

కొందరు పిల్లలు విధ్యాసంబంధంగా లేదా ఇతర సమస్యల వల్ల ఆందోళన చెందుతుంటారు. అలాంటి పిల్లలతో నిద్రలో ప్రేమగా మాట్లాడి, వారిలో ధైర్యాన్ని నింపవచ్చు. వారికి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వారితో ఆందోళన, ఒత్తిడి తగ్గి మరింత సాంత్వనతో, శాంతిగా ఉంటారు.

ఉదాహరణకు:

"నీకు ఏమి జరగినా, అమ్మా నాన్న ఎప్పుడూ నీకు అండగా ఉంటారు."

"నువ్వు భయపడాల్సిన అవసరం లేదు."

5. పిల్లలతో అనుబంధాన్ని బలపరచడం (Improving Parent-Child Bond):

పిల్లలు నిద్రలో ఉన్నప్పటికీ, వారి అచేతన మనసు మీరు చెప్పే ప్రేమ పదజాలాన్ని గ్రహిస్తుంది. శ్రద్ధగా వింటుంది. ఇది పిల్లలతో మీ బంధాన్ని మరింత బలంగా మార్చుతుంది.

6. అపస్మారక స్థితిలో నేర్చుకోవడం (Subconscious Learning):

కొన్ని పరిశోధనలు చెబుతున్నట్లు నిద్రలో మీరు వారికి చెప్పే మంచి మాటలు, విలువలను పిల్లలు సబ్కాన్షస్ మైండ్‌లో గ్రహిస్తారు . వాటిని ఆచరించే ప్రయత్నం తప్పక చేస్తారు.

ఉదాహరణకు:

"అందరికీ సహాయం చెయ్."

"నువ్వు నిజాయితీగా ఉండాలి."

"ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకో."

అంతేకాదు నిద్రపోతున్నప్పుడు పిల్లలతో మాట్లాడటం వల్ల పిల్లలలో సృజనాత్మకత మెరుగవుతుందనీ, వారి ప్రవర్తనను మెరుగుపరుస్తుందనీ స్టడీలు చెబుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం