Calcium Rich Fruits: పాలు అంటే మీకు నచ్చదా? కాల్షియం కోసం ఈ 5 రకాల పండ్లను తినండి!
Calcium Rich Fruits: ఎముకల ఆరోగ్యం కోసం సహాయపడే కాల్షియం కేవలం పాలు, కూరగాయల్లోనే కాదు పండ్లలో కూడా పుష్కలంగా దొరుకుతుందట. పాలు తాగడం ఇష్టం లేని వారు ఎముకల్లొ సాంద్రత కోసం తరచూ ఈ పండ్లను తింటే చాలని చెబుతున్నారు నిపుణులు. కాల్షియం కలిగి ఉండే 5 రకాల పండ్ల గురించి తెలుసుకుందాం.

మనకు చాలా రోజులుగా తెలిసిన మాటేంటంటే పౌష్టికాహారంలో పాలు చాలా ముఖ్యమైనవి. పాలు తాగితే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. శారీరకంగా బలంగా తయారవుతారు. అందుకే చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారైనా గ్లాసుడు పాలు తాగడం అలవాటుగా చేసుకోవాలని నిపుణు చెబుతుంటారు. ఎందుకంటే పాలలోని కాల్షియం ఎముక సాంద్రతను పెంచడంతో, వ్యక్తి బలహీనపడకుండా ఉండటానికి సహాయపడుతుంది.
కానీ కొందరిలో పాలు తాగాలన్నా, పాలతో తయారుచేసే పదార్థాలను తినాలన్నా అయిష్టత కనిపిస్తుంటుంది. ఇంకొందరికి వీటిని తీసుకోవడం వల్ల ఎలర్జీ కడుపులో అజీర్తి వంటి సమస్యలు వస్తుంటాయి. ఇటువంటి వాళ్లు అందరూ కాల్షియం కోసం ఏం తినాలా? అని ఆలోచిస్తుంటారు. మీరు అలాంటి వారే అయితే కాల్షియం కోసం మీరు కూవలం పాల మీదే ఆధారపడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఆ లోటును తీర్చుకోవచ్చు.
శరీరానికి కాల్షియం ఎందుకు అవసరం?
ఆరోగ్యకరమైన ఎముకల కోసం ఆహారం నుంచే కాల్షియం పొందాలి. 19ఏళ్లు కంటే ఎక్కువ వయస్సుకన్న వాళ్లకు రోజులో 700 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం ఉంటుంది. లేదంటిప ఎముకల్లో సాంద్రత తగ్గి కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అలాగా శారీరకంగా బలహీనంగా తయారవుతారు.
- మన శరీరంలోని 99శాతం కాల్షియం ఎముకలు, పళ్లలో నిల్వ ఉంటుంది. ఎముకలు విరిగినా, సాంద్రత తగ్గినా కాల్షియమే వాటిని తిరిగి బాగు చేస్తుంది. అంతేకాకుండా యాసిడ్, బ్యాక్టీరియా నుంచి కూడా కాల్షియమే పళ్లని, ఎముకలని కాపాడుతుంది.
- కాల్షియం సరైన మోతాదులో ఉంటే, కండరాలు బిగుసుకోవడం, వదులు అవడం వంటి అంశాల్లో చక్కటి పనితీరు కనిపిస్తుంది.
- ఏదైనా గాయం తగిలితే రక్తం గడ్డకట్టడానికి, గాయాలు త్వరగా మానిపోవడానికి, అధిక రక్తం పోకుండా ఉండటానికి కాల్షియం సాయం చేస్తుంది.
కాల్షియంను అధికంగా అందించే ఫ్రూట్స్:
మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ కాల్షియం అందించే ఫ్రూట్స్ ఇవే..
1. ఆరెంజెస్
కమలాలు విటమిన్ సీ అధికంగా అందించడంతో పాటు ప్రతి 100 గ్రాముల ఆరెంజెస్ లో 43 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందట. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..కమలాలు తినడం వలన రోగనిరోధకవ్యవస్థ బలపడటంతో పాటు ఎముకల ఆరోగ్యం మెరుగవుతుందట.
2. కివీ
కాల్షియం ఎక్కువగా అందించడంతో పాటు విటమిన్ సీ కూడా సమకూర్చే పండ్లలో మరొకటి కివీ. విటమిన్ సీ ఉండటం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మారోగ్యానికి దోహదపడుతుంది. అందులో దాదాపు 60 మిల్లీగ్రాముల వరకూ కాల్షియం దొరుకుతుందట.
3. బొప్పాయి
ప్రతి 100 గ్రాముల బొప్పాయి పండులో 30 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా విటమిన్ సీ అందించి ఇమ్యూనిటీ ఉత్పత్తి మెరుగుపరచడానికి కూడా సాయపడుతుంది. కంటి ఆరోగ్యం సమకూర్చడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడి ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది.
4. బ్లాక్ బెర్రీస్
కాల్షియం అధికంగా ఉండే మరో పండు బ్లాక్ బెర్రీ. అరకప్పు బ్లాక్ బెర్రీలలో 42మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందట. కాల్షియంతో పాటు విటమిన్ సీ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఫలితంగా ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడటంతో పాటు అరుగుదలకు తోడ్పడుతుంది.
5. నిమ్మకాయ
విటమిన్ సీ, ఫైబర్ లు అధికంగా ఉండే నిమ్మకాయల్లో కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి వంద గ్రాముల నిమ్మకాయలో 26మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. ఇంకా నిమ్మకాయలు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, కాల్షియంను శోషించుకునేందుకు శరీర వ్యవస్థకు సాయం అందిస్తుంది.
సంబంధిత కథనం