Korean skin real secret: “మా మి మి మో ము” జపం చేస్తే మెరిసే చర్మం మీ సొంతం, కొరియన్ స్కిన్ రహస్యాలివే
Korean skin real secret: కొరియన్ మహిళల చర్మ సౌందర్యం కోసం అనేక జాగ్రత్తలు, టిప్స్ పాటిస్తారు. వాటిలో కొన్ని ఎవ్వరైనా పాటించేంత సులువుగా ఉంటాయి. వాటితో మీరూ మెరిసే కొరియన్ గ్లాసీ స్కిన్ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.
కొరియన్ మహిళలకు సహజంగానే మెరిసే చర్మం ఉంటుంది. వారి చర్మంపై ఎటువంటి మరకలు ఉండవు. చెప్పాలంటే వారి చర్మం గాజులా మెరిసిపోతూ ఉంటుంది. వాళ్లు తమ చర్మాన్ని అందంగా ఉంచుకోడానికి ఎన్నో చిట్కాలు పాటిస్తారు. పులియబెట్టిన బియ్యం నీళ్లను ఖచ్చితంగా వారి స్కిన్ కేర్ రొటీన్‌లో తప్పకుండా ఉపయోగిస్తారు. మీరు కూడా కొరియన్ మహిళల మాదిరిగా మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే, కొరియన్స్ బ్యూటీ రొటీన్ గురించి తెల్సుకోండి.
4-2-4 టెక్నిక్:
కొరియన్ మహిళలు చర్మ అందం కోసం 4-2-4 టెక్నిక్ ను అనుసరిస్తారు. ఇందులో నాలుగు నిమిషాల పాటు క్లెన్సింగ్ చేస్తారు. అంటే నూనెతో మర్దనా చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత నురుగుతో కూడిన ఫేస్ వాష్ తో వలయాకార కదలికలతో రెండు నిమిషాలు మసాజ్ చేయాలి. తరువాత గోరువెచ్చని నీరు, తరువాత చల్లటి నీటితో మరో నాలుగు నిమిషాలు మసాజ్ చేయండి. ఈ పద్ధతిని పాటించడం ద్వారా ముఖం శుభ్రపడి తెరిచిన రంధ్రాలు మూసుకుపోతాయి. చర్మం యవ్వనంగా, అందంగా కనిపిస్తుంది.
ఈ జపం చేస్తారు
కొరియన్ మహిళలు తమ ముఖం, బుగ్గల్లో ఉండే కండరాలకు వ్యాయామం అవ్వడానికి రోజుకు పదిసార్లు 'మా మి మి మో ము' అంటూ జపం లాగా చేస్తారు. అంటే ఈ అక్షరాలను క్రమంలో చెప్పుకుంటూ ఉండటం వల్ల మంచి వ్యాయామం జరుగుతుంది. దాంతో చర్మానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది వాళ్ల చర్మ అంద రహస్యాల్లో ఒకటి.
పగలు, రాత్రి మాయిశ్చరైజర్:
కొరియన్ గ్లాస్ లుక్ చర్మాన్ని పొందాలనుకుంటే ఉదయం, రాత్రి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. పగటిపూట మంచి సన్ ప్రొటెక్టెడ్ మాయిశ్చరైజర్, రాత్రి పడుకునే ముందు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడాలి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి.
మెరిసే చర్మం కోసం
మెరిసే చర్మం కోసం పుష్కలంగా నీరు త్రాగటం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కొరియన్ మహిళలు దీన్ని పూర్తిగా అవలంబిస్తారు. సోడియం తక్కువగా ఉండే ఆహారాన్ని తింటారు. ఇది వారి శరీరంలో నీటి స్థాయిని సమతుల్యంలో ఉంచడానికి సహాయపడుతుంది.
టాపిక్