world book day 2023:ప్రపంచ పుస్తక దినోత్సవం 2023 ప్రాముఖ్యత తెలుసుకోండి-know more details about world book day 2023 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know More Details About World Book Day 2023

world book day 2023:ప్రపంచ పుస్తక దినోత్సవం 2023 ప్రాముఖ్యత తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Apr 23, 2023 12:23 PM IST

world book day 2023: పుస్తకాల ప్రచురణ, కాపీరైట్, పుస్తక పఠనం గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో నిర్ణయించింది.

ప్రపంచ పుస్తక దినోత్సవం
ప్రపంచ పుస్తక దినోత్సవం (pexels)

పుస్తకాలు చదవడం వల్ల లాభాలెన్నో. కానీ పుస్తకాన్ని కూడా కంప్యూటర్ స్క్రీన్ మీదో, మొబైల్ లోనో చదివేస్తున్నాం. పుస్తక పఠనం అలవాటు చేసుకోడానికి ఇవి మంచి మార్గాలే అయినా.. చేతిలో పుస్తకం పట్టుకుని చదివినంత ఆనందం, తృప్తీ మాత్రం అలా చదివితే రాదు. పుస్తకం చదవటం వల్ల లాభాలెన్నో.. ఆ ఆనందాన్ని అందరూ ఆస్వాదించాలనీ, అవగాహన కల్పించాలనీ ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తకం దినోత్సవం యునెస్కో నిర్వహిస్తోంది.

చరిత్ర

పుస్తకాలను మించిన స్నేహితులండరు అంటారు. ప్రపంచ పుస్తక దినోత్సవం మొదటగా 1995 వ సంవత్సరంలో ఏప్రిల్ 23న నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా యువతకు పుస్తక పఠనం మీద ఆసక్తి కలిగేలా చేయాలని, అందులో ఉన్న ఆనందాన్ని పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశంగా దాన్ని నిర్వహించారు. ఈ తేదీన ప్రసిద్ధ రచయితలు విలియమ్ షేక్‌స్పియర్, గార్సిలాసో డి లా వేగా మరణించారు. వాళ్ల జ్ఞాపకార్థం ఈ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా నిర్ణయించారు. ప్రతి సంవత్సరం వివిద నినాదాలతో ఈ రోజు జరుపుకుంటాం. ఈ సంవత్సరం నినాదం “ దేశీయ భాషలు ”.

పుస్తక పఠనానికి ప్రాముఖ్యత ఎందుకు?

పుస్తకం చదవడం అలవాటయ్యేంత వరకే ఈ ప్రశ్న. ఒకసారి అలవాటయ్యాక అదొక వ్యసనం లాగా మారిపోతుంది అనొచ్చు. ఎందుకంటే ఒక పుస్తకం చదివితే వచ్చే ఆనందం చాలా ఎక్కువ. ఇంట్లో కుర్చీలో కూర్చుని సర్వ లోకాలు చుట్టేయొచ్చు. ఊహాలోకంలో తేలిపోవచ్చు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భాష పరిజ్ఞానం, భాష మీద ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.

పుస్తకం చదవలేకపోతే..

కొత్త అలవాటు ఏదైనా మొదట్లో కష్టంగానే ఉంటుంది. అందుకే మొదట్లో మీకు ఇష్టమైన, మీ అభిరుచికి తగ్గ పుస్తకాలు చదవటం మొదలు పెట్టండి. మీకు ఏ విషయాలు తెలుసుకోవడం ఎక్కువ ఇష్టమో ఆలోచించండి. కథలూ, నవలలూ, విషయ పరిజ్ఞానం గురించిన పుస్తకాలు.. ఇలా చాలా ఉంటాయి. అలా క్రమంగా అన్ని రకాల పుస్తకాలు చదవటం అలవాటయిపోతుంది. మీరు చదివే వేగం కూడా క్రమంగా పెరుగుతుంది. చదవడమంటే పేజీలు తిప్పడం కాకుండా.. ప్రతిదీ ఊహిస్తూ, అర్థం చేసుకోండి. దానివల్ల ఊహా శక్తి పెరగుతుంది. ప్రతి విషయం సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

WhatsApp channel

టాపిక్