Katrina's diet: కత్రినాకైఫ్ పాటించే పాతకాలం పద్ధతులివే.. రోజూ ఏం తింటుందో తెలుసా?
Katrina's diet: కత్రినా కైఫ్ డైట్ ప్లాన్‌ను ఆమె న్యూట్రిషనిస్ట్ వెళ్లడించారు. మీకు ఊహించనట్లుగా ఇది చాలా సింపుల్. తన సీక్రెట్ ఏంటో చూడండి.
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఫిట్‌నెస్ కు పెట్టింది పేరు. కత్రినా రోజువారీ ఆహారం, జీవనశైలి గురించి ఆమె సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెప్పారు. కత్రినాకు ఆహారమే ఔషధమని, తన శరీర పోషకాహార అవసరాలను ఆమె గుర్తుంచుకుంటారని, సరైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తనకు తెలుసని ఆమె చెప్పారు. శరీర పోషక అవసరాలు తెలుసు కాబట్టి, ఆమె కొన్ని సప్లిమెంట్లు, జ్యూసులు, లేదా ఐరన్ రిచ్ ఫుడ్స్ కోసం తన న్యూట్రీషనిస్టును సంప్రదిస్తుందట.
కత్రినా సింపుల్ డైట్:
ఆమె డైట్ ప్లాన్ సింపుల్ గా ఉంటుంది. కత్రినా ఇంట్లో వండిన భోజనాన్నే ఎక్కువగా ఇష్టపడుతుంది. 41 ఏళ్ల ఈ నటి బయటి ఆహారాన్ని ఎప్పుడూ తినదు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తనవెంట తీసుకువెళ్తుందట. కత్రినా కైఫ్ చాలా సాంప్రదాయ పద్ధతులు పాటిస్తుంది. ఆయిల్ పుల్లింగ్, నాసికలను శుభ్రపరచడం, షత్పవలి (లంచ్ మరియు డిన్నర్ తర్వాత 100 అడుగులు వేయడం) వంటి పద్ధతులను తన దినచర్యలో తప్పకుండా పాటిస్తుంది. సాధారణ సాంప్రదాయ పద్ధతులను ఒక బాలీవుడ్ దిగ్గజం అనుసరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నారు ఆమె న్యూట్రీషనిస్ట్.
ఈ జ్యూసులే ఆమె సీక్రెట్:
కత్రినాది పిత్త గుణం ఉన్న శరీరం. అంటే అమెకు జీవక్రియ రేటు వేగంగా ఉంటుంది. దాంతో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు ఆమె తీసుకోవాలి. నల్ల ఎండుద్రాక్ష తీసుకోవడం, సోంపు నమలడం, బూడిద గుమ్మడి కాయ రసం తాగడం తనకున్న అలవాట్లు. లేదంటే ఉసిరికాయ రసం, పుదీనా కొత్తిమీర రసాలు ఆమెకు ప్రత్యామ్నాయాలు. కత్రినా కైఫ్ తన రోజును ఉదయాన్నే తొందరగా ప్రారంభిస్తుంది. గంటకోసారి ఏదో ఒకటి తినడం కన్నా, బదులుగా రోజుకు రెండు సార్లు కడుపునిండా తింటుందామె. అలాగే కత్రినా ప్రతిరోజు ఒకే రకమైన ఆహారం తినడానికి విముఖత ఏం చూపదట. అలాగే ఇష్టంగా తింటుందట.
కత్రినా తాజా ప్రాజెక్టులు
2024 లో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ మెర్రీ క్రిస్మస్ సనిమాలో విజయ్ సేతుపతి సరసన నటించింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఐదవ భాగమైన మనీష్ శర్మ యొక్క టైగర్ 3 లో ఐకానిక్ గూఢచారి పాత్రను కత్రినా పోషించింది.