Mineral water: ఇంట్లోనే మినరల్ వాటర్ తయారు చేసుకోండి.. క్యాన్లు కొనాల్సిన పనిలేదు-know how to make mineral water at home with proper ingredients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mineral Water: ఇంట్లోనే మినరల్ వాటర్ తయారు చేసుకోండి.. క్యాన్లు కొనాల్సిన పనిలేదు

Mineral water: ఇంట్లోనే మినరల్ వాటర్ తయారు చేసుకోండి.. క్యాన్లు కొనాల్సిన పనిలేదు

Koutik Pranaya Sree HT Telugu
Aug 06, 2024 10:30 AM IST

Mineral water DIY: మినరల్ వాటర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా, స్వచ్ఛమైన నీటిని ఎలా తయారు చేసుకోవచ్చో తెల్సుకోండి.

మినరల్ వాటర్
మినరల్ వాటర్ (freepik)

మినరల్ వాటర్ బాటిల్స్ రోజూ వేయించుకోని ఇళ్లు దాదాపు ఉండవనే చెప్పాలి. ఈ నీళ్లకు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఎంతగా అంటే ఆ రుచి తప్ప మరో నీటి రుచి నోటికి తాకితే మందులా అనిపించేంత. అయితే ఈ నీళ్లు నిజంగా సరైన పద్ధతిలోనే శుద్ధి చేసి అమ్ముతున్నారా లేదా అనే సందేహం ఉంటుంది. 

చిన్న గ్రామాల్లో కనీసం నీళ్లు ఎక్కడ శుద్ధి చేస్తున్నారు? ప్యూరిఫికేషన్ జరిగే చోటేదో కాస్త అవగాహన ఉంటుంది. పెద్ద నగరాల్లో ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలీదు.అలాంటప్పుడు ఇంట్లోనే కొంతమంది వాటర్ ప్యూరిఫయర్లు వాడుతున్నారు.కొంతమంది అనారోగ్యకరమైన నీటినే ఇంకా తాగి రోగాల బారిన పడుతున్నారు. కాస్త ఓపిక, కొద్దిపాటు ఖర్చు పెడితే రోజూ మీరే ఇంట్లోనే మినరల్ వాటర్ తయారు చేసుకోవచ్చు.

ఇంట్లో మినలర్ వాటర్ ఎలా తయారు చేయాలి?

ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో అయితే పూర్తి నీటి శుద్ధీకరణ సాధ్యం కాదు. కానీ ఈ మినరల్ వాటర్ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు గనక ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చాలా చవకగా, సులభంగా నీటి ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు. మినరల్ వాటర్ గంట వ్యవధిలో ఇంట్లోనే సిద్ధం అవుతుంది. కాస్త రుచిలో తేడాగా ఉన్నా శుద్ధీకరణ మాత్రం పూర్తవుతుంది.

రెండు రకాల్లో మినరల్ వాటర్ తయారు చేయొచ్చు. ఒకరకం నీటితో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. దానికోసం ఆల్కలైన్ మెగ్నీషియం వాటర్ తయారు చేసుకోవచ్చు. ఎముకల ఆరోగ్యం పెంచే క్యాల్షియం మెగ్నీషియం మినరల్ వాటర్ కూడా మరో ఆప్షన్.

స్టెప్1: నీటి వడబోత

ముందుగా ట్యాప్ వాటర్‌లో ఎలాంటి మలినాలు లేకుండా వడకట్టుకోవాలి. దానికోసం కుళాయికే కాటన్ వస్త్రం చుట్టి ఉంచితే సరిపోతుంది. ఆ నీళ్లలో పటిక లేదా ఆలం వేయాలి. బజారులో చాలా సులభంగా దొరుకుతుందిది. ఈ పటిక మలినాలను ఆకర్షిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నదీ జలాలను త్రాగడానికి వాడేవారు. అప్పుడు నీటి శుద్ధికోసం పటికను మాత్రమే ఉపయోగించేవారు.

స్టెప్ 2: బేకింగ్ సోడా

1 లీటర్ నీటికి ఏమేం, ఎంత కలపాలో చూద్దాం. వడకట్టిన నీటిలో 1/8 టీస్పూన్ బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. దీంతో నీటిలోకి సోడియం కలిపినట్లే. అజీర్తి, మలబద్దకం, డీహైడ్రేషన్, ఆర్తటైటిస్ లాంటివి రాకుండా సోడియః కాపాడుతుంది. దీంతో నీళ్లు సగం శుద్ధి అయినట్లే.

స్టెప్ 3: రాళ్లుప్పు

బేకింగ్ సోడా వేసి నీరు బాగా కలిపాక అందులో 1/8 టీస్పూన్ రాళ్లుప్పు వేయాలి. బ్యాక్టీరియా చేరకుండా ఈ ఉప్పు నీటిని శుద్ధి చేస్తుంది.

స్టెప్ 4: పొటాషియం బైకార్బోనేట్

ఇప్పుడు 1/8 టీస్పూన్ పొటాషియం బైకార్బోనేట్ వేసుకోవాలి. ఇది తప్పకుండా కలపాలి. అయితేనే నీటి శుద్ధి వందశాతం అయినట్లు. గుండె జబ్బులు రాకుండా, గుండె పోటు రాకుండా ఇది కాపాడుతుంది. మార్కెట్లో కేజీ పొటాషియం బైకార్బోనేట్ ధర వెయ్యి దాకా ఉంటుంది. ఒక్కసారి లీటర్ తయారీకి చెంచాడు కూడా దీన్ని వాడం. కాబట్టి ఎంత తక్కువ ధరలో మినరల్ నీరు రెడీ అవుతుందో చూడండి.

ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా నీటిని కలుపుకోవాలి. అన్నీ కలిపాక ఒక నిమిషం నీటిని వేడిచేయాలి. చల్లారాక గంట సేపు ఆగితే మినరల్ వాటర్ రెడీ అయినట్లే.

రెండో పద్ధతిలో క్యాల్షియం క్లోరైడ్ వాడతారు. దీని తయారీ కోసం స్టెప్1,2,3 అన్నీ పైన చెప్పిన విధంగానే ఫాలో అవ్వాలి. పొటాషియం బైకార్బోనేట్ బదులుగా క్యాల్షియం క్లోరైడ్ 1/8 టీస్పూన్ కలుపుకుంటే చాలు.

 

టాపిక్