Jowar Idli: షుగర్ ఉన్నవాళ్లు కూడా తినగలిగే.. జొన్నపిండి ఇడ్లీలు..-know how to make jowar idli for breakfast in easy way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jowar Idli: షుగర్ ఉన్నవాళ్లు కూడా తినగలిగే.. జొన్నపిండి ఇడ్లీలు..

Jowar Idli: షుగర్ ఉన్నవాళ్లు కూడా తినగలిగే.. జొన్నపిండి ఇడ్లీలు..

Jowar Idli: మధుమేహం ఉన్నవాళ్లయినా, కాస్త ఆరోగ్యంగా అల్పాహారం తినాలనుకునే వాళ్లకైనా ఈ జొన్నపిండి ఇడ్లీలు నచ్చేస్తాయి. వాటినెలా చేసుకోవాలో తెలుసుకోండి.

జొన్నపిండి ఇడ్లీ (Unsplash)

ఉదయం అల్పాహారంలోకి జొన్నపిండితో ఇడ్లీలు చేసుకుని తింటే చాలా ఆరోగ్యకరం. మధుమేహంతో బాధపడేవారు కూడా వీటిని తినేయొచ్చు. వీటికోసం ముందురోజే పిండిని నానబెట్టాల్సిన పని కూడా లేదు. ఇన్స్టంట్ గా చేసుకోవచ్చు. తయారీ ఎలాగో వివరంగా తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు జొన్న పిండి

1 కప్పు సన్నం రవ్వ

ఒకటిన్నర కప్పుల పెరుగు

సగం కప్పు నీళ్లు

కొద్దిగా కొత్తిమీర తరుగు

ఒక చెంచా జీడిపప్పు

కొద్దిగా వంటసోడా

రెండు చెంచాల నూనె

సగం చెంచా ఆవాలు

సగం చెంచా మినప్పప్పు

3 పచ్చిమిర్చి తరుగు

1 కరివేపాకు రెబ్బ

చిటికెడు ఇంగువ

తయారీ విధానం:

  1. ఒక పెద్ద గిన్నెలో రవ్వ, జొన్నపిండి, ఉప్పు, పెరుగు, నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంట నుంచి నలభై అయిదు నిమిషాల వరకు నాననివ్వాలి.
  2. ఈ లోపు చిన్న కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ కట్టేయాలి.
  3. ఇప్పుడు జొన్నపిండి మిశ్రమంలో ఈ తాలింపును వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే ఇప్పుడే మరికొన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవచ్చు.
  4. వంటసోడా కూడా కలుపుకుని వెంటనే ఇడ్లీ కుక్కర్ పాత్రల్లో ఇడ్లీ పిండిని పోసుకోవాలి. పది నుంచి పదిహేను నిమిషాల్లో ఆవిరి మీద ఉడికించుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. అంతే.. వేడివేడిగా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవడమే.