Jasmine Tea | మల్లెపువ్వు వాసన, మత్తెక్కించే రుచి, మైమరపించే ప్రయోజనాలు దీని స్పెషాలి'టీ!-know how to make jasmine tea and miraculous health benefits of this flowerful beverage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jasmine Tea | మల్లెపువ్వు వాసన, మత్తెక్కించే రుచి, మైమరపించే ప్రయోజనాలు దీని స్పెషాలి'టీ!

Jasmine Tea | మల్లెపువ్వు వాసన, మత్తెక్కించే రుచి, మైమరపించే ప్రయోజనాలు దీని స్పెషాలి'టీ!

HT Telugu Desk HT Telugu

Jasmine Tea: జాస్మిన్ టీ ఎప్పుడైనా తాగారా? ఇది మత్తెక్కించే మల్లెల సువాసనను కలిగి ఉంటుంది, ఒక కప్పు తాగితే బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మల్లెపువ్వు చాయ్ కథేంటో తెలుసుకోండి.

Jasmine Tea (Unsplash)

జాస్మిన్ టీ అనేది ఒక రకమైన హెర్బల్ టీ. ఇది తాజా మల్లెపువ్వుల సువాసనను కలిగి ఉంటుంది, మామూలు టీకి సున్నితమైన పూల రుచిని అందిస్తుంది. జాస్మిన్ టీని తరచుగా గ్రీన్ టీతో చేస్తారు, కానీ మీరు బ్లాక్ టీ, వైట్ టీ అలాగే ఊలాంగ్ టీలలో కూడా జాస్మిన్ ఫ్లేవర్ టీలను ఆస్వాదించవచ్చు.

ఈ జాస్మిన్ టీ కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. మానసిక ఉల్లాసం కలిగించడం మొదలుకొని, రోగనిరోధక శక్తిని పెంచడం వరకు వివిధ ప్రయోజనాల కోసం జాస్మిన్ టీ తాగుతారు. సాధారణంగా ఈ ఎండాకాలంలో దీనిని తాగుతారు. మరి ఈ జాస్మిన్ టీని ఎలా తయారు చేస్తారు, దీనివలన కలిగే ప్రయోజనాలేమిటి ఇప్పుడు తెలుసుకుందాం.

Jasmine Tea Making- జాస్మిన్ టీని ఎలా తయారు చేస్తారు

జాస్మిన్ టీ తయరు చేయడం చాలా సింపుల్. మామూలు టీపొడిలో కొన్ని మల్లెపువ్వులను కలపడం ద్వారా అది జాస్మిన్ టీ అవుతుంది. అయితే కొన్ని ప్రీమియం బ్రాండ్లు మరింత సువాసన గల జాస్మిన్ టీ పొడులను అందిస్తున్నాయి. సాధారణంగా అయితే ఈ వసంతకాలం మొదలుకొని, ఎండాకాలం ముగిసేంత వరకు మల్లెపువ్వులను సేకరిస్తారు. వాటిని ఎండబెట్టి, ప్రాసెస్ చేసి, భద్రపరచడం ద్వారా జాస్మిన్ టీని తయారు చేస్తారు. నీలివర్ణపు అపరాజితా పుష్పాలతో తయారు చేసే బ్లూ టీ లేదా Butterfly Tea అలాగే చామంతి టీలు కూడా దాదాపు ఇలాంటి తయారీ ప్రక్రియనే కలిగి ఉంటాయి. ఇలా పూలతో చేసే టీలను వేడినీటిలో కలిపి కాసేపయ్యాక గోరువెచ్చగా తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు.

Jasmine Tea Health Benefits- జాస్మిన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

సుగంధభరితమైన, సువాసన గల మల్లెపువ్వు వాసన పీల్చినపుడు ఎంత మత్తుగా, గమ్మతుగా అనిపిస్తుందో అలాంటి ప్రయోజనాలే జాస్మిన్ టీ తాగడం వలన లభిస్తాయి. కామెల్లియా సినెన్సిస్ టీ తాగటం వలన వచ్చే ప్రయోజనాలు కూడా జాస్మిన్ టీ తాగితే లభిస్తాయి. అవి ఎలాంటి ప్రయోజనాలో చూడండి.

1. మానసిక ప్రశాంతత

మల్లెల సువాసనగల జాస్మిన్ టీ మీకు హాయి గొలిపే విశ్రాంతి ప్రభావాలను అందిస్తుంది. ఇందులో ఎల్-థియానైన్ ఉంటుంది, ఇది టీలో ఉండే ఒక ప్రత్యేకమైన సమ్మేళనం. ఇది ఒత్తిడి, ఆందోళనలు తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ఉపశమనం పొందిన అనుభూతిని, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మీరు చెలరేగటానికి ఇది ఒక టానిక్.

2. చురుకుతనం పెంచుతుంది

జాస్మిన్ టీ కూడా తాగతే, అది వ్యతుల్లో చురుకుదనం, శ్రద్ధను పెంచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు పేర్కోన్నాయి. మానసిక స్పష్టతతో ఉంటారు. ఇందులో కూడా తేలికపాటి నుండి మితమైన కెఫిన్ ఉంటుంది. ఇది మీ శక్తిని పెంచడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

జాస్మిన్ టీ మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ టీలు ఫ్లూ , జలుబు వంటి అనారోగ్యాలను దూరం చేయగల కేటెచిన్‌లను కలిగి ఉంటాయి.

4. వాపును తగ్గిస్తుంది

ఇలాంటి టీలు శరీరంలో నొప్పులు, వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయని తేలింది. మల్లెపూల టీ ఒక కప్పు తాత్కాలిక నొప్పులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక శోథ పరిస్థితుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

5. జీర్ణక్రియ మెరుగుపడుతుంది

జాస్మిన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. హైడ్రేటెడ్‌గా ఉంటూనే కడుపు నొప్పిని తగ్గించడానికి ఒక కప్పు జాస్మిన్ టీ ఒక గొప్ప మార్గం.

6. యాంటీ ఆక్సిడెంట్లు అధికం

కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి తయారయ్యే అన్ని టీలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి సెల్యులార్ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి పని చేస్తాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించడంలో కూడా సహాయపడతాయి.

సంబంధిత కథనం