Phool Makhana Kheer: ఏకాదశి ఉపవాసం రోజు తినడానికి ఫూల్ మఖానా పాయసం చేసేయండి-know how to make ekadhashi fasting food phool makhana kheer recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Phool Makhana Kheer: ఏకాదశి ఉపవాసం రోజు తినడానికి ఫూల్ మఖానా పాయసం చేసేయండి

Phool Makhana Kheer: ఏకాదశి ఉపవాసం రోజు తినడానికి ఫూల్ మఖానా పాయసం చేసేయండి

Phool Makhana Kheer: ఏకాదశి రోజున ఉపవాసం ఉంటున్నారా? అయితే ఫూల్ మఖానాతో పాయసం చేసి దేవుణికి నివేదించండి. మీరు కూడా తినండి. దీంట్లో రుచితో పాటూ పోషకాలుంటాయి.

ఫూల్ మఖానా పాయసం

ఏకాదశి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ రోజున తినగలిగే వంటకాలు కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో ఒకటి ఫూల్ మఖానా ఖీర్ లేదా పాయసం. బియ్యం, సేమ్యా పాయసం లాంటివి ఏకాదశి రోజున దాదాపుగా ఆరగించరు. కాబట్టి ఈ ఫూల్ మఖానాతో పాయసం చేసి చూడండి. దాని తయారీ ఎలాగో కూడా చూసేయండి. కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది.

ఫూల్ మఖానా ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

200 గ్రాముల ఫూల్ మఖానా

2 లీటర్ల పాలు

50 గ్రాముల దేశీ నెయ్యి

100 గ్రాముల ఎండుద్రాక్ష

100 గ్రాముల పంచదార

10 బాదాం

10 జీడిపప్పులు

5 చిటికెల కుంకుమపువ్వు

4 పచ్చి యాలకులు

మఖానా ఖీర్ తయారీ విధానం:

  1. ఫూల్ మఖానా ఖీర్ తయారు చేయడానికి ముందుగా బాదాం, జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో ఎండు ద్రాక్ష కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. దీని తరువాత, గ్యాస్ మీద తక్కువ మంటపై పాన్ ఉంచి, దానిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక బాదం, జీడిపప్పు, ఫూల్ మఖానా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
  3. దీని తరువాత, పాన్ లో వేయించిన గింజలను ఒక పాత్రలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వేయించిన గింజల్లో సగానికి పైగా తీసి గ్రైండర్ లో వేసి పౌడర్ లా చేసుకోవాలి. ఎండు ద్రాక్ష మిక్సీ పట్టుకోకండి.
  4. ఆ తర్వాత మళ్లీ పాన్ పెట్టి అందులో పాలు పోసి వేడి చేయాలి. పాలు మరుగుతున్నప్పుడు పంచదార, యాలకుల పొడి, కుంకుమపువ్వు, వేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి.
  5. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని కూడా ఆ మరుగుతున్న పాలల్లో వేసుకుని కలుపుకోవాలి. రెండు నిమిషాలు పాలల్లో బాగా ఉడకనివ్వాలి. ఈ పొడివల్ల పాలకు చిక్కదనం పెరిగి తినేటప్పుడు బాగుంటుంది.
  6. ఆ తర్వాత మిగిలిన వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం,ఫూల్ మఖానా, ఎండుద్రాక్ష వేసి కలపాలి. ఖీర్ మొత్తం మిశ్రమం క్రీమీగా మారే వరకు సుమారు 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మరో పాత్రలో ఖీర్ తీసి పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. దేవునికి నైవేద్యంగా పెట్టడానికి, ఏకాదశి ఉపవాసం రోజున తినడానికి ఇది మంచి స్వీట్.