Egg Pulao Recipe : ఎగ్ పులావ్ రెసిపీ.. ఒక్కసారి తింటే మళ్లీ కావాలంటారు
Egg Pulao Recipe : పులావ్ చేస్తే చాలా మంది ఇష్టంగా తింటారు. ఎగ్‍తో పులావ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం..
స్కూలుకు వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో ఆలోచించడం సాధారణంగా పెద్ద తలనొప్పి. ఆఫీసుకు వెళ్లేవాళ్లు లంచ్ కోసం ఏం తీసుకువెళ్లాలో కూడా ఆలోచన చేయాల్సిందే. పెద్దలు ఏదో ఒకటి తినేద్దాంలే అనుకుంటారు. అయితే పిల్లలు మాత్రం ఒకే రకమైన ఆహారాన్ని తినిపిస్తే వాటిని తినడానికి ఇష్టపడరు. భోజనానికి భిన్నమైన, పోషకమైన వాటిని అందించాలనుకునే తల్లుల కోసం ఇక్కడ గొప్ప లంచ్ బాక్స్ రెసిపీ ఉంది. ఇలా ఒక్కసారి ఎగ్ పులావ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు
15 జీడిపప్పులు
6 లవంగాలు
4 ఏలకులు
పెరుగు 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర
పుదీనా
పసుపు పొడి - పావు చెంచా
మిరియాల పొడి - అర చెంచా
టమోటా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పాలు - అర కప్పు
బాస్మతి బియ్యం - 1 కప్పు
ఎగ్ పులావ్ తయారీ విధానం
ముందుగా జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీరను మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నూనె పోసి అందులో కారం, పసుపు వేసి అందులో ఉడికించిన గుడ్లను వేయించాలి. దీన్ని ఒక ప్లేట్‌లోకి మార్చుకోవాలి. అదే పాన్‌లో మరింత నూనె వేసి బాగా వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో, పుదీనా, కొత్తిమీర వేసి వేసుకోవాలి. తర్వాత రుబ్బిన మసాలా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత కప్పు పాలు, కాస్త నీరు పోసి మరిగించాలి. అందులో బాస్మతి బియ్యం వేసి ఉడికించాలి. చివరగా వేయించిన గుడ్లు వేసి కలపాలి. అంతే రుచికరమైన ఎగ్ పులావ్ రెడీ. ఈ కోడిగుడ్డు పులావ్ పిల్లలకే కాదు ఇంట్లోని ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం.